పప్పు చారు | అమ్మలకాలం నాటి పప్పు చారు | మీకు పర్ఫెక్ట్ పప్పుచారు గారంటీ

Curries
5.0 AVERAGE
7 Comments

వేసేవి నాలుగైదు పదార్ధాలు అయినా సంచలనాలు సృష్టించవచ్చు అంత రుచిగా ఉంటుంది తెలుగు వారి పప్పు చారు. బెస్ట్ పప్పు చారు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

"పప్పుచారు" ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. సరిగ్గా పెట్టలేగాని గ్లాసులతో తాగేయోచ్చు. చాలా సింపుల్ రెసిపీ. సాంబార్ కి మల్లె ఎక్కువెక్కువ సంబారాలు ఇందులో ఉండవు. వేసేవి నాలుగైదు పదార్దాలే కాని రుచి చాలా బాగుంటుంది.

తెలుగువారిళ్ళలో పప్పుచారు వారంలో కనీసం రెండు సార్లు అయినా చేసేదే! కానీ పప్పుచారు కాచే తీరు, పదార్ధాలు వేసే కొలతలోనే ఉంది రుచంతా.

టిప్స్

  1. ఈ పప్పు చారు పూర్తిగా మా స్టైల్. మేము ఇందులో ములక్కాడ ముక్కలు, ధనియాల పొడి కూడా వేస్తాము. దీని వల్ల పప్పుచారుకి రుచీ, సువాసన. సాధారణంగా ధనియాల పొడి వేయారు పప్పుచారులో.

  2. ఆఖరున బెల్లం వేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాలన్స్ అవుతాయ్. నచ్చని వారు వదిలేయోచ్చు. ఇంకా పప్పుని పప్పు గుత్తితో ఎనిపే కంటే మిస్కీ లో మెత్తగా చేసి వేస్తే చిక్కని పప్పుచారు వస్తుంది.

  3. సాధారణంగా పులుసులకి కొలతలేకుండా నీళ్ళు పోసి మరిగించోచ్చు. కానీ ఈ పప్పు చారు కొలతకి మాత్రం కచ్చితంగా 300ml కి మించి నీరు పోయకండి. అప్పుడే చిక్కని రుచి కరమైన పప్పుచారుని ఎంజాయ్ చేస్తారు. లేదంటే పలుచగా అంత రుచిగా ఉండదు.

  4. ఈ పప్పుచారు నేను రాచిప్ప లో కాస్తున్నా. రాచిప్పలో కాచిన పప్పుచారుకి మామూలు గిన్నెలో కాచిన పప్పుచారు రుచికి ఎక్కడా పొంతనే ఉండదు. రాచిప్పలో పులుసులు ఎంత మరిగితే అంత

పప్పు చారు | అమ్మలకాలం నాటి పప్పు చారు | మీకు పర్ఫెక్ట్ పప్పుచారు గారంటీ - రెసిపీ వీడియో

Andhra-Style Sambar | Pappu Charu Recipe | Dal Rasam | How to make Sambar

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Resting Time 30 mins
  • Total Time 55 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup కందిపప్పు
  • 2 cup నీళ్ళు
  • 1/2 tsp పసుపు
  • పప్పుచారుకి
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp సెనగపప్పు
  • ఇంగువా -చిటికెడు
  • 2 ఎండుమిర్చి
  • 3 పచ్చిమిర్చి
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 6 - 7 పీచు తీసిన మునక్కాడ ముక్కలు
  • 2 టమాటో ముక్కలు
  • కొత్తిమీర- పిడికెడు
  • 300 ml నీళ్ళు
  • 1 tbsp బెల్లం పొడి
  • ఉప్పు
  • 1 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 100 ml 50 గ్రాముల నుండి తీసిన చింతపండు పులుసు

విధానం

  1. 2 గంటలు కడిగి నానబెట్టిన కందిపప్పుని కుక్కర్ లో వేసి 2 కప్స్ నీళ్ళు, పసుపు వేసి మీడియం ఫ్లేం మీద 3 విసిల్స్ రానివ్వండి
  2. ఆవిరి పోయాక పప్పు మిక్సీలో వేసి మెత్తని పేస్టు చేసుకోండి
  3. రాచ్చిప్పలో/అడుగుమందంగా ఉన్న పాత్రలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, సెనగపప్పు వేసి వేపుకోవాలి
  4. ఉల్లిపాయ, మునక్కాడ, పచ్చిమిర్చి చీలికలు వేసి మూతపెట్టి ఉల్లిపాయలు, మునక్కాడ ముక్కలు మెత్తబడేదాక మీడియం ఫ్లేం మీద మూత పెట్టి మగ్గనివ్వండి.
  5. ముక్కలు మగ్గాక టమాటో ముక్కలు ఉప్పు, కారం, ధనియాల పొడి చేర్చి టమాటో ముక్కలు కూడా మెత్తబడనివ్వాలి మూతపెట్టి.
  6. ఆ తరువాత 100ml చింతపండు పులుసు పోసి మరో 3 నిమిషాలు మరగనివ్వండి.
  7. పులుసు మరిగాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పు, 300 ml నీళ్ళు పోసి బాగా కలిపి సన్నని సెగ మీద 10-12 నిమిషాలు మరగనివ్వండి.
  8. పప్పుచారు మరుగుతున్నప్పుడు కొత్తిమీర తరుగు, బెల్లం తరుగు మరో 5 నిమిషాలు ఉడికించి దిమ్పెసుకోండి. • ఈ పప్పు చారు అప్పడాలు, వడియాలు, ఆమ్లెట్, చికెన్ ఫ్రై తో చాలా రుచిగా ఉంటుంది

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

7 comments

  • M
    Mounika
    Salt veyyaledu
  • P
    Peddababu medabalimi
    1/2 cup kandipappu annaruga, quantity entha sir i mean 400 ml or 300 ml
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Super. This is my 3rd attempt in 2 months. I’m happily enjoying his dishes. Thanks
  • N
    Naveen
    Recipe Rating:
    Brother plz share details regarding utensils (like rachippa, brass) where to buy and how to use ...please I want to buy these traditional utensils from a genuine place.
    • S
      Sushil Kumar Rachuri
      You can find it in AMAZON—search for RAATI CHIPPA or SOAP STONE. Or else you can find in the foot path of tolichowki and bio diversity roads or ERRA GADDA KUKATPALLY roads. Brass items you can find in BEGUM BAZAAR in bartan bazar
  • S
    Sravani pusarla
    Recipe Rating:
    Hii sir me recipes Anni sprr ga vuntai,,me voice nd chepe vidanam Chala baguntadi