ఆంధ్రా స్టైల్ టొమాటో కాజు మసాలా కర్రీ
రోటీ, చపాతీలతో బెస్ట్ జోడీ ఆంధ్రా స్టైల్ కాజు టొమాటో కర్రీ. ఆంధ్రా స్టైల్ కాజు మసాలా కర్రీ పెళ్ళిళ్ళ స్పెషల్ రెసిపీ. ఈ కాజూ కర్రీ కారంగా ఘాటుగా మసాలా ఘుమఘుమలతో చాలా రుచిగా ఉంటుంది.
నిజానికి కాజూ టొమాటో కర్రీ పంజాబీ దాభాల స్పెషల్ రెసిపీనే కాస్త తెలుగు వాయి టచ్ ఇచ్చి పెళ్ళిళ్ళ షెఫ్లూ సృష్టించిన రెసిపీ. ఈ కాజూ కర్రీ రెసిపీ చాలా సింపుల్. వీకెండ్స్ లేదా స్పెషల్ పార్టీలకి పర్ఫెక్ట్. ఇంకా తెలంగాణ స్టైల్ బగరా రైస్తో సూపర్ జోడీ.

టిప్స్
- టొమాటోలు పుల్లనివి నాటువీ అయితే చాలా రుచిగా ఉంటుంది కూర
నూనె:
-
నేను పెళ్ళిళ్ళ స్టైల్ చేస్తున్నాను. అందుకే కాస్త నూనెలు ఉంటాయ్. కావాలంటే తగ్గించుకోవచ్చు. నిజానికి కాస్త నూనె ఉంటేనే రుచిగా ఉంటుంది ఈ కూర.
-
ఆఖరున నెయ్యి కొద్దిగా వేస్తే పరిమళం కూరకి. నచ్చని వారు వదిలేవచ్చు.
జీడిపప్పు పేస్ట్
- రెస్టారెంట్ స్టైల్ కూర అంటే చిక్కగా ఉండాలి కూరలో నుండి నీరు కారకూడదు. ఆలాంటి చిక్కదనం కోసం కొద్దిగా జీడిపప్పు పేస్ట్ వేస్తారు. ఉంటే జీడిపప్పు పేస్ట్ వాడుకోండి. లేదంటే చిక్కని చిలికిన పెరుగు ½ కప్పు వేసి కూరలో కలిసి పోయేదాక సన్నని సెగ ఉడికించుకున్నా సరిపోతుంది.
ఆంధ్రా స్టైల్ టొమాటో కాజు మసాలా కర్రీ - రెసిపీ వీడియో
Andhra Style Tomato Cashew Spicy Curry | Kaju Masala Curry | Tomato Kaju Masala Curry | How to Make Kaju Tomato curry
Curries
|
vegetarian
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 3 tbsp నూనె
- 1/2 tsp జీలకర్ర
- 2 ఉల్లిపాయ తరుగు
- 2 రెబ్బల కరివేపాకు
- 2 ఎండుమిర్చి
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- 1/2 cup జీడిపప్పు
- 3 టొమాటోల పేస్ట్
- 1/4 tsp పసుపు
- 1/4 tsp గరం మసాలా
- 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
- ఉప్పు
- 1/2 tsp ధనియాల పొడి
- 1 tsp కారం
- 2 టొమాటోల పెద్ద ముక్కలు
- 2 tbsp జీడిపప్పు పేస్ట్
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- 1 tsp నెయ్యి
- 250 ml నీళ్ళు
విధానం
-
నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి చిటచిటలాడించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేదాక లేత వేపుకోవాలి.
-
ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చాక జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
-
జీడిపప్పు వేగిన తరువాత అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి.
-
తరువాత గరం మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి,
-
మసాలాలూ వేగిన తరువాత టొమాటో పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
-
టొమాటోలు వేగిన తరువాత టొమాటో పెద్ద తరుగు ముక్కలు వేసి టొమాటో మెత్తబడే దాకా నూనెలో మగ్గించాలి.
-
టొమాటోల పైన తోలు ఊడేదాకా వేగిన తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి వేపుకోవాలి (జీడిపప్పు పేస్ట్కి బదులు ఏమి వాడుకోవచ్చో టిప్స్ చూడండి).
-
నీళ్ళు పోసి బాగా కలిపి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. దింపే ముందు నెయ్యి కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment ×