రాయలసీమ స్పెషల్ చేమగడ్డ కారం పులుసు

ఆంధ్రా స్టైల్ చేమదుంపల పులుసు ఘాటుగా కారంగా పుల్లగా చిక్కని పులుసుతో ఎంతో రుచిగా ఉంటుంది. వేడి అన్నంతో చేమదుంపల పులుసు ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది.

సరైన చేమదుంపల పులుసు అంటే తిన్నాక చెయ్యి కడిగినా వదలకూడదు అదీ పులుసు అంటే అంటారు తెలుగు వారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు తెలుగు వారికి ఎంత ఇష్టమో ఈ చేమదుంపల పులుసు.

చేమదుంపల పులుసు దక్షిణ భారతదేశంలో చాల ఎక్కువగా చేస్తారు, కానీ తెలుగు వారి తీరు కాస్త కారంగా ఉంటుంది. ఇదే పులుసు తమిళ వారు కొబ్బరి వేసి కమ్మగా చేస్తారు. ఆ రెసిపీ కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తా!

తెలుగు వారి తీరులో చేసే చేమదుంపల పులుసు కనీసం 3 రోజులు నిలవుంటుంది.

టిప్స్

చేమదుంపలూ

ఉడికించి పొట్టు తీసిన చేమదుంపలు అంగుళం సైజు ముక్కలుగా తరుక్కోండి. చేమదుంపలు మరీ మెత్తగా కాక కాస్త పలుకు ఉండగానే దింపెయండి. మిగిలినది పులుసులో సన్నని సెగ మీద ఉడుకుతుంది. ముందే మెత్తగా ఉడికిస్తే పులుసులో ఉడికేపాటికి చిదురైపోతుంది దుంప.

నూనె :

పులుసులకి కాస్త నూనె ఉండాలి. నూనె పైకి తేలాలి అప్పుడే రుచి పులుసు.

ఉప్పు కారాలు:

తెలుగు వారి తీరు అంటే ఉప్పు కారాలు నూనెలు ఉంటాయి. కావాలంటే ఉప్పు కారాలు తగ్గించుకోండి.

బెల్లం:

పులుసులకి కచ్చితంగా కొద్దిగా బెల్లం వేస్తారు.పిలుపుని బాలన్స్ చేయడానికి. మాంచి ఘాటైన పులుసు తినాలనుకుంటే బెల్లం అవసరం లేదు.

కమ్మని పులుసు కోసం:

ఉప్పు కారాలు వేసాక నూనె పైకి తేలేదాక సన్నని సెగ మీద మరగాలి. అలాగే దుంపలు వేసాక కూడా నూనె పైకి తేలేదాక సన్నని సెగ మీదే మరగాలి, అప్పుడే రుచి.

రాయలసీమ స్పెషల్ చేమగడ్డ కారం పులుసు - రెసిపీ వీడియో

Arbi Sabzi | Colocasia Curry | Chemagadda Curry | How to Make Arbi Sabzi

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 40 mins
  • Total Time 45 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms ఉడికించిన చేమగడ్డ (పొత్తు తీసి అంగుళం ముక్కలుగా కోసుకున్నవి)
  • 3 tbsp నూనె
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 1/2 cup టమాటో ముక్కలు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 1 tsp ఆవాలు
  • 1/4 tsp మెంతులు
  • 1/2 tsp జీలకర్ర
  • 1 tsp పచ్చిశెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 3 ఎండుమిర్చి
  • 10 దంచిన వెల్లులి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 1.5 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp మిరియాల పొడి
  • కొత్తిమీర - కొద్దిగా
  • 150 ml చింతపండు పులుసు (నిమ్మకాయ సైజు అంత చింతపండు నుండి తీసినది)
  • 600 ml నీళ్లు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో ఆవాలు సెనగపప్పు మినపప్పు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వెల్లులి వేసి మెంతులు ఎర్రబడి దాకా వేపుకోవాలి.
  2. వేగిన తాలింపులో కరివేపాకు రెబ్బలు పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి.
  3. ఉల్లిపాయల చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  4. వేగిన ఉల్లిపాయల్లో టమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి టమాటో మెత్తబడే దాకా వేపుకోవాలి.
  5. మగ్గిన టొమాటోల్లో కారం ధనియాల పొడి మిరియాల పొడి వేసి మాడకుండా వేఫై చింతపండు పులుసు పోసి కలిపి నూనె పైకి తేలేదాక నెమ్మదిగా మరగనివ్వాలి.
  6. నూనె పైకి తేలాక నీళ్లు పోసి ఉడికించిన చేమగడ్డలు వేసి కలిపి మూత పెట్టి 30-40 నిమిషాల పాటు నిదానంగా ఉడికిస్తే అప్పుడు దుంపకి ఉప్పు కారం పులుసు పట్టి ఎంతో రుచిగా ఉంటుంది పులుసు.
  7. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకుంటే అద్దిరిపోయే ఆంధ్రా స్టైల్ చేమదుంపల పులుసు తయారు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Arbi Sabzi | Colocasia Curry | Chemagadda Curry