బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్

చూడడానికి చైనీస్ రెసిపీకి దగ్గరగా ఉండే దేశీయమైన స్టార్టర్ బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్. పార్టీస్కి మాంచి స్టార్టర్. ఈ సింపుల్ స్టార్టర్ ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది.

బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్ రెసిపీ కారంగా పుల్లగా కొత్తిమీర పరిమళంతో అందరికీ తప్పక నచ్చే రెసిపీ. చూడానికి, చేసే తీరులో బేబీ కార్న్ మంచూరియాన్లా అనిపిస్తుంది కానీ రుచి పూర్తిగా దేశీయంగా ఉంటుంది. ప్రతీ పదార్ధం ప్రతీ ఇంట్లో ఉండేదే!

నేను ఈ రెసిపీ హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్ వెడ్డింగ్లో తిన్నాను, చాలా నచ్చేసింది. ఆ రోజు అక్కడ చెఫ్ సర్వ్ చేస్తూ కనిపిస్తే మొహమాటపడకుండా రెసిపీ చాలా బాగుంది ఎలా చేశారుని అడిగేసా. ఆయాన చాలా హాపీగా రెసిపీ షేర్ చేశారు ఆ రెసిపీనే మీకు చెప్తున్నా!

చాలా సింపుల్ స్టార్టర్ కొన్ని సింపుల్ స్టెప్తో చేస్తే ఎప్పుడు చేసినా బెస్ట్గా వస్తుంది

టిప్స్

బేబీకార్న్ని ఎంత ఉడికించాలి?

  1. బేబీకార్న్ 60% ఉడికించాలి. ఎక్కువ ఉడికిస్తే ఫ్రై అయ్యాక మెత్తగా అయిపోతాయ్ కార్న్. ఉడికిన కార్న్ని ఫోర్క్ గుచ్చి చూస్తే తెలిసిపోతుంది 60% ఉడకడం అంటే. సగం పైన ఉడికి ఫోర్క్ని పట్టి నిలిచి ఉంటుంది.

  2. 60% ఉడికిన కార్న్ని చల్లని నీళ్ళలో వేసి 5 నిమిషాలు వదిలేస్తే ఆ పైన ఉడకదు

కార్న్ కరకరలాడుతూ రావాలంటే:

  1. కార్న్ పైన ఇచ్చే కోటింగ్ చాలా గట్టిగా ఉండాలి. అందుకు చాలా తక్కువ నీళ్ళు పోసి కోటింగ్ గట్టిగా ఇస్తే కార్న్ బంగారు రంగులోకి వేగి కరకరలాడుతూ ఉంటాయ్.

  2. కార్న్ని 1.5 ఇంచుల ముక్కలుగా కోసుకుంటే వేగాక మరీ చిన్నవిగా అవ్వవు.

రెసిపీ మాంచి ఫ్లేవర్తో ఉండాలంటే?

  1. కార్న్ వేసి టాస్ చేసేప్పుడు కేవలం హైఫ్లేమ్ మీదే చేయాలీ అప్పుడు మాంచి ఫ్లేవర్ వస్తుంది రెసిపీకి

  2. ఇంకా సాసులు వేశాక కొంచెం నీరుగా ఉండగానే వేపుకున్న కార్న్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తేనే ఫ్లేవర్స్ కార్న్ని పట్టుకుంటుంది లేదా పై పైనా కోటింగ్లా ఉంది అంత రుచిగా అనిపించదు. ఇంకా హై ఫ్లేమ్ మీద టాస్ చేయకపోతే మెత్తగా అయిపోతాయ్ కార్న్

బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్ - రెసిపీ వీడియో

Baby Corn Coriander Bullets | How to make Baby corn Kothimeera Bullets

Starters | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • కార్న్ కోటింగ్ ఇంకా ఫ్రై చేయడానికి
  • 200 gm బేబీ కార్న్
  • పసుపు – కొద్దిగా
  • నీళ్ళు – ఉడికించడానికి
  • 2 tbsp మైదా
  • 2 tbsp కార్న్ ఫ్లోర్
  • ఉప్పు – కొద్దిగా
  • కొత్తిమీర సన్నని తరుగు – కొద్దిగా
  • 2 tsp నీళ్ళు
  • నూనె – ఫ్రై చేయడానికి
  • కార్న్ టాసింగ్ కోసం
  • 2 tbsp నూనె
  • 1 tbsp దంచిన ధనియాలు
  • 2 tsp వెల్లులి తరుగు
  • 2 tbsp సన్నని పచ్చిమిర్చి తరుగు
  • 1 tbsp టొమాటో కేట్చప్
  • 1 tsp కారం
  • ఉప్పు – కొద్దిగా
  • 1 tsp చాట్ మసాలా
  • 1/2 tsp గరం మసాలా
  • 1 cup సన్నని కొత్తిమీర తరుగు
  • 1 tsp నిమ్మరసం

విధానం

  1. నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి అందులో కార్న్ వేసి 60% కుక్ చేసుకోవాలి. ఫోర్క్ గుచ్చి చూస్తే తెలిసిపోతుంది 60% ఉడికింది లేనిది (టిప్స్ చూడండి).
  2. ఉడికిన కార్న్ని వడకట్టి చల్లని నీళ్ళలో వేసి 5 నిమిషాలు ఉంచి వడకట్టి 1.5 ఇంచుల ముక్కలుగా కోసి గాలికి చెమ్మ ఆరిపోయేదాకా ముక్కలని ఆరబెట్టాలి.
  3. గిన్నెలో మైదా, కారం ఫ్లోర్, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి నీరంత దిగిన బేబీకార్న్ వేసి నెమ్మదిగా పిండి బాగా పట్టుకునేలా కోటింగ్ ఇవ్వాలి.
  4. బాగా వేడెక్కిన నూనెలో వేసి ఎర్రగా కరకరలాడేట్టు వేపుకోవాలి. వేగిన కార్న్ని జల్లెడలో వేసి ఉంచితే మెత్తబడవు.
  5. టాసింగ్ పాన్లో నూనె వేడి చేసి అందులో దంచిన ధనియాలు, వెల్లులి మిర్చి తరుగు వేసి హై ఫ్లేమ్ మీద వెల్లులి ఎర్రబడే దాక టాస్ చేసుకోవాలి.
  6. తరువాత టొమాటో కేట్చాప్ సాల్ట్ కారం, చాట్ మసాలా నీళ్ళు వేసి టాస్ చేసుకోవాలి.
  7. ఇంకా కాస్త నీరుగా ఉండగానే వేపుకున్న బేబీ కార్న్, గరం మసాలా, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి హై-ఫ్లేమ్ మీద టాస్ చేసి దింపేసుకోండి.
  8. వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్!!!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Baby Corn Coriander Bullets | How to make Baby corn Kothimeera Bullets