బోన్లెస్ ఫిష్ ఫ్రై | అమృత్సరీ ఫిష్ ఫ్రై

చేపల వేపుడు తలుచుకోగానే నోట్లో నీళ్లొచ్చేస్తాయ్. ఆలాంటి చేపల వేపుడు చేయాలంటే అమృత్సరీ చేపల వేపుడు బెస్ట్. దేశమంతటా చేపల వేపుడు చేస్తారు. కానీ అమృత్సరీ చేపల వేపుడు వాము సువాసనతో ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ రెసిపీలో ఎక్కువగా మసాలాలు ఉండవు. జస్ట్ 2 నిమిషాల్లో మసాలాలు పట్టించి గంట నానబెట్టి వేపితే చాలు బెస్ట్ చేపల వేపుడు తయార్.

ఈ చేపల వేపుడు స్టార్టర్గా లేదా చారు పప్పుచారు తో నంజుడుకి కూడా చాలా బాగుంటుంది.

Boneless Fish Fry | Amritsari Fish Fry | Ajwain Fish Fry recipe

టిప్స్

  1. చేపలు: అమృత్సరీ చేపల వేపుడు అంటేనే బోన్లెస్ చేపల వేపుడు. నచ్చితే ముళ్లుతోనే చేపల వేపుడు చేసుకోవచ్చు.

  2. నేను రవ్వ చేప వాడాను, మీరు ఇంకేదైనా బోన్లెస్ చేప వాడుకోవచ్చు

  3. చేపలకి మసలాలు పట్టించాక కనీసం గంట అయినా నానబెడితే ఫ్లేవర్స్ బాగా పడతాయ్

  4. చేపలు వేపడానికి నూనెలో చేప మునిగేలా నూనె ఉండాలి.

Boneless Fish Fry | Amritsari Fish Fry | Ajwain Fish Fry recipe

బోన్లెస్ ఫిష్ ఫ్రై | అమృత్సరీ ఫిష్ ఫ్రై - రెసిపీ వీడియో

Boneless Fish Fry | Amritsari Fish Fry | Ajwain Fish Fry recipe | How to Make Boneless Fish Fry

Starters | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 20 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms బోన్లెస్ రవ్వ చేప
  • 1 tsp నిమ్మరసం
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tsp కొత్తిమీర తరుగు
  • ఉప్పు
  • 1/2 tsp వాము
  • 3/4 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 1 tsp కారం
  • 1/8 tsp పసుపు
  • 3-4 tbsps శెనగపిండి
  • 1 tbsp బియ్యం పిండి
  • 3-4 tbsps నీళ్ళు
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. చేప ముక్కలకి పదార్ధాలన్నీ వేసి బాగా పట్టించి గంట నానాబెట్టాలి .
  2. నూనెలో చేప ముక్కలు వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి ,
  3. చేప ముక్కలు పుదీనా చట్నీతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

Boneless Fish Fry | Amritsari Fish Fry | Ajwain Fish Fry recipe