పనీర్ పాప్ కార్న్ | 5 నిమిషాల్లో బెస్ట్ పనీర్ స్నాక్

పార్టీస్కి ఇంకా స్పెషల్ రోజుల్లో పర్ఫెక్ట్ స్టార్టర్ పనీర్ పాపకార్న్. ఈ సింపుల్ స్టార్టర్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో పాటు వీడియో కూడా ఉంది చూడండి.

అన్నీ రెడీగా ఉంటే "పనీర్ పాప్ కార్న్" టీ పెట్టినంత ఈసీగా చేసేవచ్చు. చాలా రుచిగా ఉంటాయ్, తిన్న కొద్దీ అలా తింటూనే ఉంటారు.

నిజానికి ఈ రెసిపీ, kfc స్టైల్ చికెన్ పాపకార్న్ ని చూసి కొద్ది మార్పులతో నా స్టైల్ లో చేసిన పాప్ కార్న్.

Paneer Popcorn recipe | Perfect Paneer Starter | Paneer Snacks | Restaurant Style Paneer Snack Recipe

టిప్స్

ఎప్పుడు చేసినా బెస్ట్ పనీర్ పాపకార్న్ కోసం? పాప్ కార్న్ కరకరలాడుతూ రావాలంటే?

  1. పనీర్ పైన కోటింగ్ గట్టిగా ఉండాలి. అప్పుడు నూనెలో వెయ్యగానే పైన కోటింగ్ ఎర్రగా క్రిస్పీగా వేగుతుంది. అలా గట్టిగా ఉండాలంటే పైన కోటింగ్ పిండి కాస్త గట్టిగా చిక్కగా ఉండాలి.

  2. పిండి పైన కోటింగ్ కి నేను బ్రెడ్ పొడి వాడను. సాధారణంగా నేను బ్రెడ్ పొడి వాడడానికి ఇష్టపడను. ఇంట్లో మనం పాత బ్రెడ్ ని పొడి చేసి వాడుకున్న దానికి, పాపకార్న్ కి రెడీ మేడ్ గా దొరికే Panko బ్రెడ్ పొడి/ బ్రెడ్ పొడికి చాలా తేడా ఉంటుంది. కుదిరితే Panko వాడడానికే చుడండి. లేదంటే పాత మిల్క్ బ్రెడ్ ని ఎండలో 3 గంటలు ఉంచితే చెమ్మ ఆరిపోయి అట్ట ముక్కలా అవుతుంది, దాని పొడి చేసి వాడుకోండి.

  3. అలాగే ఇందులో నేను చిల్లి ఫ్లేక్స్ వాడను ఇవి రెడీ మేడ్ గా దొరుకుతాయ్, ఒకవేళ లేనట్లైతే 2 ఎండు మిర్చి పొయ్యి మీద 15 సెకన్లు కాల్చి కచ్చాపచ్చాగా దంచినది వాడుకోవచ్చు.

  4. ఇంకా ఇందులో నేను మిక్స్డ్ హెర్బ్స్ వాడను, ఇవి ఇటాలియన్ హెర్బ్స్. సహజంగా ఇవి మనకి పిజ్జా తో పాటు ఇస్తారు. చాలా సులభంగా ఆన్లైన్ లో దొరికేస్తాయ్!(ఇది రాయకండి, ఇది తెలుగు వారికోసం )

  5. బ్రెడ్ పొడి పట్టించాక 10 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచడం బెస్ట్. ఈ స్టెప్ వల్ల పిండి జారై కోటింగ్ సరిగా పట్టుకోకపోయినా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కచ్చితంగా పట్టుకుంటుంది.

  6. వేడెక్కిన నూనె లో మీడియం ఫ్లేం మీద కరకరలాడేట్టు బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి టమాటో సాస్, మింట్ మయోనైస్, స్వీట్ చిల్లీ సాస్ తో చాలా బాగుంటాయ్.

పనీర్ పాప్ కార్న్ | 5 నిమిషాల్లో బెస్ట్ పనీర్ స్నాక్ - రెసిపీ వీడియో

Paneer Popcorn Recipe | Perfect Paneer Starter | Paneer Snacks | Restaurant Style Paneer Snack Recipe

Snacks | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 5 mins
  • Total Time 15 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms పనీర్
  • నూనె వేపుకోడానికి
  • కోటింగ్ కోసం
  • 1/4 cup మైదా
  • ఉప్పు- రుచికి సరిపడా
  • 1 tsp చిల్లి ఫ్లేక్స్
  • 1 tsp మిక్స్డ్ హెర్బ్స్
  • తగినన్ని నీళ్ళు
  • 1 cup బ్రెడ్ పొడి

విధానం

  1. కోటింగ్ కోసం ఉంచుకున్న పదార్ధాలన్నీ వేసి పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి.
  2. పనీర్ ముక్కలు వేసి కోటింగ్ బాగా పట్టించాలి.
  3. తరువాత ఒక్కో పనీర్ ముక్క తీసి బ్రెడ్ పొడి లో బాగా రోల్ చేయండి. బ్రెడ్ పొడిలో ఒకటికి రెండు సార్లు రోల్ చేసి బాగా పట్టించండి.
  4. ఇలా అన్నీ కోట్ చేసుకున్నకా 30 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి.
  5. 30 నిమిషాల తరువాత వేడి నూనెలో మంట పూర్తిగా తగ్గించి పనీర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    StrongMom
    Recipe Rating:
    The taste was ok. Maybe because of Maida? Could you let us us know if Maida can be replaced with corn flour?
Paneer Popcorn recipe | Perfect Paneer Starter | Paneer Snacks | Restaurant Style Paneer Snack Recipe