టీ తో మాంచి జోడీ, కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు లేదా సినిమా చూస్తున్నపుడు తింటూనే ఉండాలనిపించే బెస్ట్ స్నాక్ ఈ కడక్ రుమాలీ రోటీ. ఎప్పుడు చేసినా చిటికెలో ఖాళీ అయిపోయే సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇంజెస్ ఇంకా వీడియోతో ఉంది.

ఈ స్టైల్ “కడక్ రుమాలీ రోటీ” కరకరలాడుతూ కారంగా మెక్సికన్ నాచోస్తో సాల్సా కలిపి తింటున్నట్లుగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే గుజరాతీ ఖాక్రాలా ఉంటుంది. పోలికలు ఎలా ఉన్నా తింటున్నప్పుడు మాత్రం మనసు నిండిపోతుంది

“కడక్ రుమాలీ రోటీ” మొదటగా నేను మూడేళ్ళ క్రితం హైదరాబాద్లోని ఒక రెస్టారెంట్లో చూశాను. ఏంటిది కొత్తగా ఉంది అనుకున్నా, ఆ తరువాత మరో హోటల్ బుఫేలో టేస్ట్ చేశా, చాలా నచ్చేసింది. కొన్ని రోజులు పోయాక ఈ కడక్ రుమాలీ రోటీలో ఎన్నో ఫ్లేవర్స్ ఉన్నాయి అని సోషల్ మీడియాలో చూసీ వావ్ అనుకున్నా!

కడక్ రుమాలీ రోటీ నేపాలీలు చాలా ఇష్టంగా తింటారట అక్కడ స్ట్రీట్ ఫుడ్గా దొరుకుతుంది అని ఒక ఫ్రెండ్ చెప్పాడు. బహుశా ఈ రెసిపీ అక్కడ నుండే పాపులర్ అయ్యి మన దాకా వచ్చి ఉండవచ్చు.

నేను చేస్తున్న రోటీకి కొంచెం మెక్సికన్ టచ్ ఇచ్చాను సాల్సాతో. మీకు నచ్చితే ఇంకేదైనా పద్ధతిలో అయినా చేసుకోవచ్చు. రోటీ కాల్చడంలో కొన్ని కచ్చితమైన టిప్స్ పాటిస్తే బెస్ట్ “కడక్ రుమాలీ రోటీ” వస్తుంది.

టిప్స్

పిండి:

  1. నేను కొంచెం గోధుమ మైదా కలిపి రోటీ చేశాను, నచ్చితే అచ్చంగా మైదా లేదా గోధుమ పిండితో రోటీ చేసుకోవచ్చు. లేదా జొన్న, రాగి ఇలా మరింకేదైనా పిండితో కూడా చేసుకోవచ్చు.

  2. పిండిలో తక్కువ నీరు పోసి గట్టిగా వత్తుకోవాలి. ఇంకా పిండిని ఎంత ఎక్కువసేపు మర్ధనా చేస్తే అంత సాగుతుంది పిండి. అప్పుడు ఎంత పల్చగా పేపర్లా పిండిని వత్తినా చిరగదు రోటీ.

  3. రోటీలు అన్నీ సరైన ఒకే తీరు ఆకారం కోసం పదునుగా ఉండే ప్లేట్తో కట్ చేసుకుంటే అన్నీ రోటీలు ఒకే తీరుగా వస్తాయ్.

  4. రోటీ కాలచ్చాక గాలికి చల్లారానిస్తే ఇంకా కరకరలాడుతుంటుంది రోటీ.

రొటీలు కాల్చే టిప్స్:

  1. “U” ఆకారంలో ఉండే మందపాటి ఇనుప మూడుకు మీద చాలా పర్ఫెక్ట్గా కాలతాయ్ రొటీలు.

  2. రొటీలు ఎంత సేపైనా సన్నని సెగ మీదే కాల్చాలి అప్పుడు పిండిలోని చెమ్మారి రోటీ కరకరలాడుతూ వస్తుంది

  3. రోటీ వేసే ముందు మూకుడు విపరీతమైన వేడిగా ఉండనే కూడదు, వేడిగా ఉండాలి అంతే!!! బాగా వేడిగా ఉంటే రోటీమీద నల్ల మచ్చలు ఏర్పడతాయ్ చూడడానికి అంత బాగుండదు.

  4. రోటీని నెమ్మదిగా కాటన్ బట్టతో ప్రతీ మూల అద్దుతూ కాల్చుకోవాలి. అప్పుడు రోటీ పైన పొంగినట్లుగా బుడగలు ఏర్పడవు.

కడక్ రుమాలీ రోటీ - రెసిపీ వీడియో

Kadak Rumali Roti | Simple and easy Kadak Rumali Roti at home | Crispy Rumali Roti

Snacks | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Resting Time 15 mins
  • Total Time 40 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • రోటీ కోసం
  • 1 cup మైదా
  • 1/2 cup గోధుమ పిండి
  • ఉప్పు
  • 1/2 tsp నెయ్యి
  • బటర్ వాష్ కోసం
  • 2 tbsp కరిగించిన బటర్/ నెయ్యి
  • 1/2 tsp చాట్ మసాలా
  • 1/2 tsp కారం
  • సలాడ్ కోసం
  • 1 ఉల్లిపాయ తరుగు
  • 1/4 cup గింజలు తీసేసిన టొమాటో తరుగు
  • 1 tsp టొమాటో సాస్
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 1/2 tsp కారం
  • 1 tsp చిల్లీ ఫ్లేక్స్
  • ఉప్పు
  • 1/2 tsp నిమ్మరసం
  • 1/2 tsp చాట్ మసాలా

విధానం

  1. గోధుమ మైదాలో ఉప్పు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి పిండి గట్టిగా వత్తుకోవాలి.
  2. 5-6 నిమిషాలు వత్తుకున్న పిండిని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి
  3. బటర్/ నెయ్యిలో చాట్ మసాలా కారం వేసి కలిపి పక్కనుంచుకోండి
  4. సలాడ్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి కలిపి ఉంచుకోండి
  5. “U” ముకుడు మంట మీద బోర్లించి పైన నూనె పూసి సన్నని సెగ మీద వేడెక్కనివ్వాలి.
  6. నానుతున్న పిండి ముద్దని సమానంగా విడదీసి పేపర్ అంత పలుచగా వత్తుకోవాలి
  7. వత్తుకున్న రొటీని పదునుగా ఉండే ప్లేట్తో కట్ చేసుకోండి, తరువాత వేడెక్కిన ముకుడు మీద వేసి ఒక నిమిషం వదిలేయాలి
  8. నిమిషానికి రోటీ మీద తెల్ల చుక్కలు ఏర్పడతాయ్, అప్పుడు రొటీని తిరగతిప్పి సన్నని సెగ మీదే కరకరలాడేట్టు కాల్చుకోవాలి. (రోటీని కాల్చే టిప్స్ చూడండి)
  9. కాలుతున్న రొటీని కాటన్ గుడ్డతో నెమ్మదిగా అన్నీ వైపులా వత్తుతూ కాల్చుకోవాలి. ఒక్కో రోటీ కాలడానికి కనీసం 5 నిమిషాల పైనే సమయం పడుతుంది.
  10. కరకరలాడుతూ కాలిన రోటీ పైన కలిపి ఉంచుకున్న బటర్ పూయాలి, ఆ తరువాత పైన టొమాటో సాలాడ్ వేసి సర్వ చేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.