మిక్స్డ్ వెజ్ లాలిపోప్ | పార్టీలకి, పిల్లలు ఇష్టంగా తినే వెజ్ స్టార్టర్

Snacks
3.0 AVERAGE
1 Comments

పార్టీలకి, పిల్లలు ఇష్టంగా తినే వెజ్ స్టార్టర్ చేయాలనుకుంటున్నారా? అయితే మిక్స్ వెజ్ లాలిపాప్ బెస్ట్ రెసిపీ. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో ఇంకా వీడియోతో ఉంది చూడండి.

మిక్స్ వెజ్ లాలిపాప్ చూడడానికి కొత్తగా తినడానికి సరదాగా ఉంటుంది. ఏ లాలిపాప్స్ బయట కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా రుచిగా ఉంటాయ్.

ఈ లాలిపాప్స్ ముందుగా చేసి జిప్ లాక్ బ్యాగ్లో ఫ్రీజ్ చేస్తే కనీసం నెల రోజులు నిలవ ఉంటాయ్.

Try Paneer Popcorn

Mixed Veg Lollipop | Best Veg Starters | Crispy Vegetable Lollipops | How to make Mixed Veg Lollipop

టిప్స్

  1. బ్రెడ్ పొడి రెడీమేడ్గా దొరుకుతుంది నేను అదే వాడాను. బ్రెడ్ పొడి లేని వారు మిల్క్ బ్రెడ్ ని ఎండలో పెట్టి లేదా పెనం మీద కాల్చి అంచులు తీసేసి మిక్సీలో మెత్తని పొడి చేసి వాడుకోండి.

  2. లాలిపాప్లు బ్రెడ్ పొడిలో రోల్ చేసి ఫ్రిజ్లో గంటసేపు ఉంచితే గట్టి పడతాయ్. అప్పుడు నూనెలో వేసి పగలవు.

  3. ఈ లాలిపాప్లు టొమాటో సాస్, మయోనైస్, పుదీనా చట్నీ ఇలా దేనితో అయినా చాలా రుచిగా ఉంటాయ్.

Mixed Veg Lollipop | Best Veg Starters | Crispy Vegetable Lollipops | How to make Mixed Veg Lollipop

మిక్స్డ్ వెజ్ లాలిపోప్ | పార్టీలకి, పిల్లలు ఇష్టంగా తినే వెజ్ స్టార్టర్ - రెసిపీ వీడియో

Mixed Veg Lollipop | Best Veg Starters | Crispy Vegetable Lollipops | How to make Mixed Veg Lollipop

Snacks | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 3/4 cup మెత్తగా ఉడికించిన ఆలూ
  • 1/2 cup కేరట్ తురుము
  • 1/2 cup క్యాబేజ్ తురుము
  • 1/2 cup ఫ్రెంచ్ బీన్స్ తరుగు
  • 1 tbsp పచ్చిమీర్చి తరుగు
  • 1/4 cup ఉల్లిపాయ తరుగు
  • 1 tsp నిమ్మరసం
  • 1/2 tsp జీలకర్ర
  • 1/2 tsp రెడ్ చిల్లి ఫ్లేక్స్
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • సాల్ట్
  • 1/2 tsp కారం
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • ఐస్ పుల్లలు
  • నూనె వేయించడానికి
  • పైన కోటింగ్ కోసం
  • 1/4 cup మైదా
  • 1/2 cup బ్రెడ్ పొడి
  • కొద్దిగా సాల్ట్
  • నీళ్ళు- పిండి జారుగా కలుపుకోడానికి

విధానం

  1. 2 tsps నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేపి, అప్పుడు పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ సన్నని తరుగు వేపి పచ్చి వాసన పోయే దాక వేపుకోండి.
  2. తరువాత క్యాబేజ్, కేరట్, బీన్స్ తరుగు వేసి 2-3 నిమిషాలు వేపుకోండి.
  3. కరేట్లోంచి చెమ్మ తగ్గాక అప్పుడు సాల్ట్, కారం, చిల్లి ఫ్లేక్స్, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకుని మరో నిమిషం ఫ్రై చేసుకోండి
  4. ఇప్పుడు మెత్తగా ఉడికించి తురుముకున్న ఆలూ వేసి బాగా కలిపి, స్టవ్ ఆపేసి కొత్తిమీర తరుగు నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకుని దింపి చల్లార్చుకోండి.
  5. చల్లారిన వెజిటేబుల్ మిక్స్ ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోండి. బాల్స్ గా చేసి 30 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి.
  6. ఇప్పుడు మైదా లో ఉప్పు వేసి నీళ్ళు పోసి పిండిని గరిట జారుగా కలుపుకోండి
  7. ఆ తరువాత వీటిని మైదా పిండి లో ముంచి ఆ తరువాత బ్రెడ్ పొడి లో 3-4 సార్లు కోట్ చేసుకోండి, ఆ తరువాత ఐస్ పుల్ల గుచ్చి మరో సారి నెమ్మదిగా పుల్లకి అంటుకునేలా బాల్ ని వత్తుకోండి
  8. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనె లో వేసి 2 నిమిషాలు కదపకుండా వదిలేయండి, ఆ తరువాత నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి
  9. లాలీపాప్స్ నూనెలో వేసి మాంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేం మీదే ఫ్రై చేసుకోండి.
  10. లాలిపాప్ బాగా క్రిస్పీ గా వేగాక అప్పుడు వేడి వేడి గా టమాటో సాస్ తో సర్వ్ చేసుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • D
    diva appadoo
    Recipe Rating:
    I have followed the recipe. Its looking yummy. will try it and comment latet.thanks for sharing
Mixed Veg Lollipop | Best Veg Starters | Crispy Vegetable Lollipops | How to make Mixed Veg Lollipop