బాదాం హల్వా కమ్మగా నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్. కుంకుమపువ్వు కమ్మని నెయ్యి పంచార వేసి చేసే ఈ స్వీట్ ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది.

స్పెషల్ రోజులకి పర్ఫెక్ట్ గా సరిపోయే స్వీట్ బాదాం హల్వా చేయడానికి కాస్త ఓపిక ఉంటె చాలు. అందరికి నచ్చే మెచ్చే తీరులో హల్వా తయారవుతుంది.

బాదం హల్వా భారత దేశమంతా చేసినా దక్షిణాది వారిది కాస్త భిన్నం, నా స్టైల్ ఇంకాస్త భిన్నం. బాదాం హల్వాకి బాదం పేస్ట్ నెయ్యి పంచదార చాలంటారు కొందరు, కుంకుమపువ్వు జోడించి చేసే హల్వానే బాదాం హల్వా అంటారు. నేను మాత్రం పైవి అన్నింటితో పాటు పాలు, కొద్దిగా బొంబాయ్ రవ్వ కూడా వేస్తాను. దీని వల్ల హల్వా రుచితో ఎంతో మృదువుగా కమ్మగా ఉంటుంది.

బాదాం హల్వాకి కాస్త నెయ్యి ఉండాలి అప్పుడే రుచి. అందుకే స్పెషల్ స్వీట్ అన్నాను. స్పెషల్ స్వీట్ అంటే ఆ మాత్రం రిచ్గా ఉండాలి కదా!

హల్వా చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని టిప్స్:

Badam Halwa | Almond Halwa | Badam Ka Halwa

టిప్స్

బాదాం:

బాదం పప్పుని 10 నిమిషాలు లోపు ఉడికిస్తే చాలు పైన తోలు సులభంగా ఊడిపోతుంది. లేదా రాత్రంతా నానబెట్టిన పప్పునైనా తోలు తీసి వాడుకోవచ్చు.

బాదాం పేస్ట్ కోసం:

బాదం పేస్ట్ని పాలతో మెత్తగా చిక్కగా గ్రైండ్ చేసుకోండి.

పంచదార/బెల్లం :

నచ్చితే పంచదార వేసుకోండి. లేదా బెల్లం కరిగించి ఆ పాకం పోసుకుని దగ్గరగా చేసుకోండి. కానీ బెల్లం వాడితే యాలకులపొడి వేసుకోండి. కుంకుమపువ్వు వేస్తే రంగు వస్తుంది కానీ బెల్లం సువాసన తెలియదు

నెయ్యి:

నెయ్యి అంతా ఒకేసారి కాకుండా కొద్దీ కొద్దిగా వేస్తూ వేపితీ బాదం పేస్ట్ లోపలిదాకా వేగి రుచోస్తుంది.

బొంబాయ్ రవ్వ:

వేసే కొద్దీ బొంబాయ్ రవ్వ హల్వా నోటికి తెలిసేలా రవ్వరవ్వగా చేస్తుంది. నచ్చితే బాదాం పేస్ట్నే కాస్త రవ్వగానూ చేసుకోవచ్చు. నాకు బొంబాయ్ రవ్వ వేసి చేసేదే నచ్చింది అందుకే ఈ తీరులో చేసాను.

ఉప్పు:

స్వీట్ షాప్స్ వాళ్ళు హల్వా మొహం కొట్టకుండా ఉండడానికి చిటికెడు కంటే కాస్త ఉప్పు వేస్తారు. నచ్చితే వేసుకోండి. నేను వేయలేదు

సర్వింగ్:

మాములుగా గాలి చొరని డబ్బాలో ఉంచితే చలికాలం లో 4 రోజులు ఎండల కాలంలో 2 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్లో అయితే వారం రోజులు తాజాగా ఉంటుంది. కానీ ఏ ఫ్రిజ్లోంచి తీసిన హల్వా ఎప్పుడు 30 సెకన్లు నుండి ఒక నిమిషం మైక్రోవేవ్ చేసి సర్వ్ చేసుకుంటే బిగుసుకున్న నెయ్యి వదులుతుంది హల్వా నుండి.

బాదాం హల్వా - రెసిపీ వీడియో

Badam Halwa | Almond Halwa | Badam Ka Halwa | How to Make Badam Halwa

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 50 mins
  • Total Time 51 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బాదాం పప్పు
  • 350 ml పాలు
  • 1/2 cup పంచదార
  • 3/4 cup నెయ్యి
  • 1 tbsp బొంబాయ్ రవ్వ
  • 2 tbsp బాదం పలుకులు
  • 3 tbsp కుంకుమపువ్వు నానబెట్టిన పాలు

విధానం

  1. మరిగే నీళ్లలో బాదం వేసి 8 నిమిషాలు ఉడికించి తీసి చల్లని నీళ్లలో వేసి 5 నిమిషాలు వదిలేయండి.
  2. 5 నిమిషాల తరువాత నెమ్మదిగా నొక్కితే బాదం పైన తోలు ఊడిపోతుంది.
  3. మిక్సీ జార్లో నానబెట్టిన బాదం 100 ml పాలు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. అడుగు మందంగా ఉండే మూకుడులో ¼ కప్పు నెయ్యి కరిగించి అందులో బొంబాయ్ రవ్వ వేసి ఒక నిమిషం వేపుకోండి.
  5. వేగిన రవ్వలో బాదం పేస్ట్ మిగిలిన 250ml పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ నెయ్యి పైకి తేలేదాక ఉడకనివ్వాలి.
  6. 15-17 నిమిషాల తరువాత బాదం పేస్ట్ వేగి పచ్చి వాసన పోతుంది. అప్పుడు పంచదార కుంకుమపువ్వు పాలు వేసి పంచదార కరిగేదాకా కలుపుతూ ఉడికించాలి.
  7. పంచదార కరిగాక మిగిలిన నెయ్యి 2 tbsp చొప్పున మిగిలిన నెయ్యి బాదాం పలుకులు వేసి ప్రతీ 5 నిమిషాలకు సారి వేస్తూ వేపుకోవాలి.
  8. సుమారుగా 40 నిమిషాలకి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉంటె హల్వా లోంచి నెయ్యి పైకి తేలుతుంది. అప్పుడు దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Badam Halwa | Almond Halwa | Badam Ka Halwa