బీట్రూట్ హల్వా

Sweets
5.0 AVERAGE
1 Comments

బీట్రూట్ పాలు చెక్కరతో తయారయ్యే ఈసీ హల్వా రెసిపీ ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది. తాజా బీట్రూట్ కనిపిస్తే చాలు ఎవ్వరికైనా మీరు చేసిన హల్వా గుర్తుకొచ్చేటంత రుచిగా కుదురుతుంది రెసిపీ.

ఈ సింపుల్ బీట్రూట్ హల్వా రెసిపీ చేయడం చాలా సింపుల్. కాస్త ఓపిక ఉంటె చాలు. ఈ హల్వా కూడా దాదాపుగా కేరట్ హల్వా మాదిరే! జస్ట్ కేరట్ బదులు బీట్రూట్ మార్పు అంతే! కాకపోతే బీట్రూట్ హల్వాలో కేరట్ కంటే బీట్రూట్ ఎక్కువగా వేగుతుంది నెయ్యిలో. అలా వేగితే బీట్రూట్లోని వాసన తగ్గుతుంది.

బీట్రూట్ నెమ్మదిగా చిక్కని పాలల్లో మరిగిమరిగి కోవాలాంటి రుచితో మళ్ళీ మళ్ళీ తినిపిస్తుంది.

Beetroot halwa

టిప్స్

బీట్రూట్:

  1. బీట్రూట్ చెక్కు తీసి పెడా రంధ్రాలు ఉన్న వైపు తురుముకోండి. సన్న రంధ్రాల వైపు తురిమితే హల్వా పూర్తిగా పేస్ట్లా అయిపోతుంది.

  2. బీట్రూట్ నెయ్యిలో పసరు వాసనా పోయే దాకా వేగితేనే రుచిగా ఉంటుంది.

పాలు-నెయ్యి:

  1. ½ కిలో బీట్రూట్కి నేను లీటర్ పాలు వాడాను. మీరు కావాలంటే కాస్త తగ్గించుకోవచ్చు. లీటర్ పాలకి హల్వా చాలా కమ్మగా ఉంటుంది.

  2. నెయ్యి 100 గ్రాముల దాకా వాడాను. మీరు కావాలంటే తగ్గించుకోండి.

కోవా:

హల్వాలో వేసే ఆ కొద్దీ పచ్చికోవా రుచి చాలా బాగుంటుంది. అందుబాటులో లేని వారు వద్దనుకున్నా కావా వేయకపోయినా పర్లేదు.

బీట్రూట్ హల్వా - రెసిపీ వీడియో

Beetroot halwa | How to Make Beetroot Halwa with Tips

Sweets | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 40 mins
  • Total Time 45 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kg బీట్రూట్ తురుము
  • 1 liter పాలు
  • 75 - 100 gms నెయ్యి
  • 20 జీడిపప్పు
  • కిస్మిస్ - కొద్దిగా
  • 50 gms పచ్చి కోవా
  • 1 tsp యాలకులపొడి
  • 1/2 cup పంచదార

విధానం

  1. నెయ్యి కరిగించి జీడిపప్పు కిస్మిస్ వేసి కిస్మిస్ని పొంగనివ్వాలి.
  2. పొంగిన కిస్మిస్లో బీట్రూట్ తురుము వేసి 4 నిమిషాలు లేదా పసరు వాసన పోయేదాకా వేపుకోవాలి.
  3. వేగిన బీట్రూట్లో పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర కలుపుతూ దగ్గరపడనివ్వాలి.
  4. 20-30 నిమిషాలకి హల్వా దగ్గర పడుతుంది అప్పడు యాలకల పొడి పంచదార వేసి మరో 5 నిమిషాలు ఉడికిస్తే మరింత దగ్గరపడుతోంది.
  5. దింపే ముందు కోవా వేసి కలిపి దింపేయడమే. హల్వా వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

Beetroot halwa