బెండకాయ సాంబార్ | సాంబార్ రెసిపీ
బెండకాయ సాంబార్- ఉల్లి, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు మగ్గించి అందులో ఎర్రగా వేపుకున్న బెండకాయ ముక్కలు ఉప్పు, కారం, సాంబార్ పొడి, చింతపులుసు పోసి మరగ కాచి చేసే సాంబార్ ఇల్లు దాటి వీధిలోకి తన్నుకెళుతుంది పరిమళం!!!
ఈ సింపుల్ బెండకాయ సాంబార్ మాములుగా అన్ని కాయకూరలు వేసి చేసుకునే సాంబార్లా అనిపించినా చిన్న వ్యత్యాసం ఉందండి. రుచి భిన్నంగా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు ఒకే తీరు సాంబార్ కాకుండా ఈ సారి ఇది ప్రయత్నించండి తప్పక వేళ్ళు జుర్రుకుంటూ ఆశ్వాదించేస్తారు!!!

టిప్స్
కందిపప్పు:
- కందిపప్పు కచ్చితంగా బాగా కడిగి కనీసం గంటసేపు నానబెట్టుకుంటే అప్పుడు పప్పు మెత్తగా ఉడుకుతుంది.
సాంబార్ రుచి అమోఘంగా ఉండాలంటే:
-
సాంబార్ కచ్చితంగా నిదానంగా సన్నని సెగ మీద మరగ కాగాలి అప్పుడే సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది.
-
మరుగుతున్న సాంబార్ని ప్రతీ ఐదు నిమిషాలకోసారి అడుగు నుండి కలుపుకోవాలి, అప్పుడే సాంబార్ అడుగుబట్టదు.
ఇంకా ఇలా కూడా సాంబార్ చేసుకోవచ్చు:
- ఇదే తీరులో మీరు మునక్కాడ, క్యారెట్ బీన్స్, అచ్చంగా ఉల్లిపాయ, సొరకాయ తో కూడా సాంబార్ చేసుకోవచ్చు.
బెండకాయ సాంబార్ | సాంబార్ రెసిపీ - రెసిపీ వీడియో
Bendakaya Sambar | Bhindi Sambar Recipe | Sambar Recipe
Sambar - Rasam Recipes
|
vegetarian
Prep Time 5 mins
Cook Time 30 mins
Total Time 35 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- ¾ cup కందిపప్పు
- 2 cups నీరు
- పసుపు - కొద్దిగా
-
సాంబార్ కాయడానికి:
- 3 tbsp నూనె
- 200 gms బెండకాయ ముక్కలు
- 1 cup ఉల్లిపాయ చీలికలు
- 2 slits పచ్చిమిర్చి చీలికలు
- 1 టమాటో
- 1 tbsp కారం
- 1.5 tbsp సాంబార్ పొడి
- 1 tbsp ధనియాల పొడి
- ఉప్పు (రుచికి సరిపడా)
- పసుపు - కొద్దిగా
- 2 sprigs కరివేపాకు
- 1 tbsp బెల్లం
- కొత్తిమీర (కొద్దిగా)
- 50 gms చింతపండు (50 గ్రాముల చింతపండు నుండి తీసినది)
- 600 ml నీరు
-
తాలింపు కోసం:
- 2 tbsp నూనె
- 2 ఎండు మిర్చి
- 10 cloves దంచిన వెల్లుల్లి
- 1 sprig కరివేపాకు (1 రెబ్బ)
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 2 pinches ఇంగువ (2 చిటికెళ్లు)
విధానం
-
నానబెట్టిన కందిపప్పుతో నీరు, పసుపు వేసి మెత్తగా ఉడికించుకుని ఎనిపి పక్కనుంచుకోండి.
-
కొద్దిగా నూనె వేడి చేసి అందులో బెండకాయ ముక్కలు వేసి బెండకాయ ముక్కల మీద నల్లని మచ్చలు ఏర్పడే దాకా వేపుకుంటే బెండకాయలోని జిగురు పోతుంది. వేపుకున్న బెండకాయ ముక్కలని పక్కనుంచుకోండి.
-
నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ఒక దాని తరువాత ఒకటి వేసి టమాటో పైన తోలు ఊడే దాకా వేపుకుంటే సరిపోతుంది.
-
టమాటో తరువాత బెండకాయ ముక్కలు చింతపండు పులుసు పోసి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించండి.
-
తరువాత ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి ఉడికించుకున్న పప్పు, నీరు, బెల్లం, కరివేపాకు కొత్తిమీర తరుగు వేసి కలిపి సాంబార్ని 20 నిమిషాలు తగ్గకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోండి.
-
20 నిమిషాల తరువాత నూనె వేడి చేసి అందులో తాలింపు సామాగ్రీ ఒక దాని తరువాత ఒకటి వేసుకుంటూ తాలింపు గుభాళించేట్టు వేపుకోండి.
-
ఎర్రగా వేగిన తాలింపుని మరుగుతున్న సాంబారులో పోసి కలిపి రెండు పొంగులు రానిచ్చి దింపేసుకుంటే వేళ్ళు జుర్రుకుని తినేంత గొప్ప బెండకాయ సాంబార్ తయారు.

Leave a comment ×