కోడి గుడ్డుతో ఏ రెసిపీ చేసినా ఆ పూట తృప్తిగా అనిపిస్తుంది, నాలాగే మీలో చాలా మందికి అనిపిస్తుండవచ్చు. వేడి అన్నం తో ఈ శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ సింపుల్ రెసిపీ హైదరాబాదీ ముస్లిమ్స్ ఎక్కువగా చేస్తుంటారు. వ సారి రంజాన్ మాసంలో అమీనా ఆంటీ ఇఫ్తార్లో పార్టీలో ఈ కూర సర్వ్ చేశారు, నాకు చాలా నచ్చేసింది. కొన్ని రెసిపీస్ అంతే చూడడానికి చేయడానికి చాలా సింపుల్, ఇంకా వేసేవి నాలుగైదు పదార్ధాలే అయినా ఎంతో ప్రేత్యేకంగా అనిపిస్తుంది.

ఈ రెసిపీ బ్యాచిలర్స్కి ఇంకా గుడ్డుతో ఏదైనా ప్రేత్యేకంగా చేయాలనుకుంటే పర్ఫెక్ట్!!!

టిప్స్

ఆమ్లెట్:

  1. ఆమ్లెట్ కాలడానికి కాసింత నూనె ఎక్కువగా ఉంటే బాగా పొంగుతుంది, రుచిగా ఉంటుంది. లేదా ఎండిపోయినట్లుగా ఉంటుంది.

  2. పాన్లో ఆమ్లెట్ వేశాక 90% కాలనిచ్చి మధ్యకి మడిచి తీసేస్తే చాలు, ఇంకా చెమ్మగా ఉండే గుడ్డు మిగిలిన వేడికి మగ్గిపోతుంది. గుడ్డు ఎక్కువగా కాలిస్తే తేమ ఆరిపోయి రుచిగా ఉండదు.

శెనగపప్పు:

  1. శెనగపప్పు కడిగి గంట నానబెట్టి ఉడికిస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది అప్పుడు రుచిగా ఉంటుంది కర్రీ. లేదంటే పలుకుగా తగులుతుంది.

ఇంకొన్ని విషయాలు:

  1. కర్రీ ఆమ్లెట్ ముక్కలు వేసి 2-3 నిమిషాలు ఉడికించి దింపేస్తే చాలు. ఎక్కువగా ఉడికిస్తే వేడి మీద పర్లేదు కానీ చల్లారుతున్న కొద్దీ గట్టిగా పప్పులా అయిపోతుంది. గుడ్డు శెనగపప్పు కూరలోని తేమని పీలచేస్తుంది.

  2. ఏ కారణం చేతనైనా కూర దగ్గర పడితే మరిగే నీళ్ళు కలిపి పలుచన చేసి కాసింత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది.

  3. నచ్చితే 2 tbsp చింతపండు పులసు కూడా వేసుకోవచ్చు.

శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ - రెసిపీ వీడియో

Bengal Gram Omelette Curry | Omelette Chanadal Curry | Omelette Curry | How to Make Bengal Omelette Curry

Curries | nonvegetarian|eggetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • కర్రీ కోసం
  • 1 cup పచ్చి శెనగపప్పు
  • 3 cups నీళ్ళు
  • 2 tbsp నూనె
  • 1/2 inch దాల్చిన చెక్క
  • 1/2 బిరియానీ ఆకు
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • 1 tsp జీలకర్ర
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1/4 cup టొమాటో ముక్కలు
  • 3 - 4 పచ్చిమిర్చి ముక్కలు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1 tsp కారం
  • 1/2 tsp మిరియాల పొడి
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 1/4 cup ఆఖరున వేసే టొమాటో ముక్కలు
  • 1/2 tsp గరం మసాలా
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • ఆమ్లెట్ కోసం
  • 4 గుడ్లు
  • 1/2 tsp మిరియాల పొడి
  • ఉప్పు
  • 2 Pinches పసుపు
  • 2 tbsp టొమాటో తరుగు
  • 2 tbsp ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 2.5 tbsp నూనె

విధానం

  1. కుక్కర్లో నూనె వేడి చేసి అందులో బిరియానీ ఆకు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేపుకోవాలి.
  2. ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత టొమాటో అల్లం వెల్లులి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోండి.
  3. టొమాటో మెత్తబడ్డాక ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
  4. తరువాత నానబెట్టిన పచ్చిశెనగపప్పు వేసి 2 నిమిషాలు వేపుకుని నీళ్ళు పోసి ఒక విసిల్ హై ఫ్లేమ్ మీద, 2 విసిల్స్ లో ఫ్లేమ్ మీద రానిచ్చి స్టెమ్ పోయే దాకా వదిలేయండి.
  5. గుడ్లులో ఆమ్లెట్కి కావాల్సిన పదార్ధాలన్నీ వేసి బాగా ఎక్కువ సేపు బీట్ చేసుకోండి. పాన్లో నూనె వేసి కాస్త మందంగా ఆమ్లెట్ వేసి 90% కాల్చుకోవాలి (పర్ఫెక్ట్ ఆమ్లెట్ కోసం టిప్స్ చూడండి)
  6. ఆమ్లెట్ ని ముక్కలుగా కట్ చేసుకోండి
  7. స్టీమ్ పోయిన శెనగపప్పుని హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మరుగుతున్న పప్పులో టొమాటో ముక్కలు, గరం మసాలా కొత్తిమీర తరుగు ఆమ్లెట్ వేసి 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Bengal Gram Omelette Curry | Omelette Chanadal Curry | Omelette Curry