బెంగాలీలు ఎంతో ఇష్టంగా తినే పూరీ రాధాభల్లభి. పేరు ఎంతో అందంగా ఉందో దీని రుచి కూడా అంత బాగుంటుంది బెంగాలీ స్టైల్ ఆలూర్ ధం తో. బెంగాలీలకి “వ" పదం లేకపోవటాన వారు దీన్ని “రాధాభల్లభి” అంటారు. ఇతర రాష్ట్రాల వారు రాధాభల్లవీ అనే అంటారు.

రాధభల్లభీ అంటే స్టఫ్ చేసిన పూరీ. స్టఫ్ఫింగ్ ఎక్కువగా మినపప్పు పిండితో పెళ్ళిళ్ళలో అయితే శెనగపప్పు పిండితో చేస్తారు. నాకు మినపపిండితో నచ్చుతుంది. ఈ పూరీ బెంగాలీల ఫేమస్ లూచి పూరీలో స్టఫ్ చేసిన సింపుల్ రెసిపీ.

రాధాభల్లభి స్ట్రీట్ ఫుడ్గా ఎక్కువగా దొరుకుతుంది బెంగాల్లో నిజానికి నాకు అలాగే తెలిసింది ఈ రెసిపీ. ఇంకా రాధాభల్లవీ దసరా దుర్గా పూజ చేసేప్పుడు, పెళ్ళిళ్ళలో తప్పక తింటారు. ఈ రెసిపీ నా బెంగాలీ ఫ్రెండ్ పెళ్లిలో దగ్గరుండి చూసి వంట వారిని అడిగి నేర్చుకున్నా.

Bengali special RADHABHALLABI | Bengali Stuffed Poori With Spiced Urad Dal

టిప్స్

పూరీ/లూచి:

  1. పూరీకి బెంగాలీల లూచికి కి చిన్న వ్యత్యాసం ఉంది. పూరీ గోధుమ పిండితో చేస్తారు ఇంకా ఎర్రగా వేపుతారు. లూచి కేవలం మైదాతో చేస్తారు, తెల్లగా వేపి తీస్తారు. ఇనాక్ పోండి కొంచెం పంచదార కూడా వేస్తారు.

స్టఫ్ఫింగ్:

  1. నేను మినపప్పు స్టఫ్ఫింగ్ వాడాను, నచ్చితే శెనగపప్పు స్టఫ్ఫింగ్ కూడా వాడుకోవచ్చు.

  2. మినపప్పు గట్టిగా మృదువుగా రుబ్బుకోవాలి, ఇంకా గట్టి ముద్ద అయ్యేదాక కలుపుతూ వేపుకుని తీసుకోవాలి

  3. నేను స్టఫ్ఫింగ్లో పంచదార వేయలేదు బెంగాలీలు తప్పక పంచదార వేస్తారు. మీరు నచ్చితే ½ tsp పంచదార వేసుకోండి

  4. స్టఫ్ఫింగ్లో కలోమ్జీ గింజలు వేశాను, సంప్రదాయ బెంగాలీ వంటకాల్లో ఉల్లి గింజలు కొద్దిగా వేస్తారు సువాసన కోసం. నచ్చని వారు వదిలేవచ్చు

  5. స్టఫ్ఫింగ్ గట్టిగా ముద్దగా అయ్యేదాక కలుపుతూ దగ్గరపడానివ్వాలి, అప్పుడే స్టాఫ్ చేసిన తరువాత పగలదు పూరీ.

రాధాభల్లభి పూరీ - రెసిపీ వీడియో

Bengali special RADHABHALLABI | Bengali Stuffed Poori With Spiced Urad Dal | How to Make Bengali Special Radhabhallabi

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 4 hrs
  • Cook Time 25 mins
  • Total Time 4 hrs 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • పూరీ/లూచి కోసం
  • 250 gms మైదా
  • 2 tsp నూనె
  • ఉప్పు
  • నీళ్ళు తగినన్ని
  • నూనె – లూచి వేపుకోడానికి
  • స్టఫ్ఫింగ్ కోసం
  • 1/2 cup మినపప్పు (4 గంటలు నానబెట్టినవి)
  • 2 tsp నూనె
  • 1/2 tsp ఉల్లి గింజలు
  • 1 tsp సొంపు
  • 1 ఇంచ్ అల్లం
  • 6-7 పచ్చిమిర్చి
  • ఉప్పు – కొద్దిగా
  • 1/4 tsp పసుపు
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి

విధానం

  1. మైదా పిండిలో నూనె ఉప్పు నీళ్ళు వేసి మెత్తని పిండిగా వత్తి 30 నిమిషాలు నానబెట్టుకోండి.
  2. మినపప్పుని నీళ్ళతో చిక్కగా మృదువుగా రుబ్బుకోండి.
  3. మిక్సీలో అల్లం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోండి.
  4. పాన్లో నూనె వేడి చేసి అందులో ఉల్లి గింజలు, సొంపు వేసి వేపుకోవాలి, తరువాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  5. తరువాత ఇంగువ, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేపి రుబ్బుకున్న మినపపిండి వేసి గట్టిగా ముద్దగా అయి పాన్ నుండి విడిపోయేదాక కలుపుతూ వేపుకోవాలి. వేగిన ముద్దని పూర్తిగా చల్లారచాలి
  6. నానిన పిండిని నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోండి. చల్లారిన మినపపిండి ని ఉసిరికాయంత ఉండలు చేసుకోండి
  7. మైదా పిండి ముద్దని అరచేతిలో పెట్టి వత్తి ఉసిరికాయ అంత పిండి ముద్దని లోపల పెట్టి మైదా పిండి ముద్దతో సీల్ చేసుకోవాలి. తరువాత కాస్త వత్తితే లోపలి స్టఫ్ఫింగ్ సమాంతరంగా స్ప్రెడ్ అవుతుంది.
  8. పొడి పిండి చల్లి పూరిలా మాదిరి వత్తి, పై పొడి పిండి దులిపి వేడి వేడి నూనె లో వేసి రాధాభల్లభి మీదికి నూనెని ఎగదోస్తుంటే పొంగుతుంది. పొంగానే తీసేయండి. రాధాభల్లభి తెల్లగా వేగాలి అప్పుడే మృదువుగా ఉంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • K
    Kaniz Fatima
    Recipe Rating:
    Wow super poori
  • S
    Sribala
    మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో చేయవచ్చా ? దయచేసి సమాధానం ఇవ్వగలరు.
Bengali special RADHABHALLABI | Bengali Stuffed Poori With Spiced Urad Dal