Curries
4.3 AVERAGE
3 Comments

ధం ఆలూ ఉత్తర భారత దేశంలో రాష్ట్రానికి ఒక్కో తీరుగా చేస్తారు. కానీ నాకు బెంగాలీలు చేసే ఆలూర్ ధం రెసిపీ చాలా నచ్చుతుంది. ప్రేత్యేకించి లూచి, రాధాభల్లభితో ఎంతో రుచిగా ఉంటుంది. ఆలూర్ ధం బెంగాళీలు పెళ్ళిళ్ళలో కూడా ప్రేత్యేకించి వడ్డిస్తారు!

ఆలూ ధం రెసిపీ చేసిన రోజున ఒక్కొరూ రెండింతలు తింటారు పూరీలు.

Bengali Style Aloor dum |  Aloo Dum Recipe | Bengali Style Potato Curry

టిప్స్

ఆలూ:

• ఆలూని 4 సగాలుగా చేసి కుక్కర్లో ఒకే కూత రానిచ్చి తీసి గాలికి పూర్తిగా చల్లారచాలి.

• ఆలూ ఎక్కువగా ఉడికితే కూర తయారయ్యే పాటికి చిదురు అయిపోతుంది

• ఆలూని నూనెలో ఎర్రగా వేపుకుంటే కర్రీ రుచి చాలా బాగుంటుంది

కర్రీ:

  1. బెంగాలీ స్టైల్ ఆలూ ధం కాస్త ముద్దగా ఉంటుంది. జారుగా చిక్కని ఎక్కువ గ్రేవీతో ఉండదు.

  2. కర్రీకి ఆవా నూనె వాడతారు బెంగాలీలు, దొరకని వారు నచ్చని వారు మరింక ఏదైనా నూనె వాడుకోవచ్చు.

  3. కూరలో వేసే అల్లం పచ్చిమిర్చి ముద్ద తాజాగా దంచినది ఎంతో రుచి, పరిమళం

  4. పెరుగు కచ్చితంగా చిలికినది వేసి బాగా కలుపుతూనే ఉండాలి అప్పుడే కూరలో కలుస్తుంది లేదంటే తరకలుగా ఉండిపోతుంది.

  5. బెంగాలీలు కూరలో కొంచెమైన పంచదార వేస్తారు, నేను వేయలేదు మీకు నచ్చితే ఉల్లిపాయలు వేగిన తరువాత వేసుకోండి

బెంగాలీ స్టైల్ ఆలూ ధం - రెసిపీ వీడియో

Bengali Style Aloor dum | Aloo Dum Recipe | Bengali Style Potato Curry | How to Make Bengali Style Aloo Dum

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • దుంపలు ఉడికించడానికి
  • 300 gms చెక్కు తీసిన ఆలూ
  • 2 చిటికెళ్లు పసుపు
  • ఉప్పు
  • నీళ్ళు – తగినన్ని
  • నూనె – వేపుకోడానికి
  • కూర కోసం
  • 1 ఇంచ్ అల్లం
  • 5 - 6 వెల్లులి
  • 3 పచ్చిమిర్చి
  • 3 tbsp ఆవ నూనె
  • 3 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 1 బిరియానీ ఆకు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 ఉల్లిపాయ చీలికలు
  • 2 చిటికెళ్లు పసుపు
  • 3/4 tsp ధనియాల పొడి
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp కారం
  • ఉప్పు – రుచికి సరిపడా
  • 1/2 cup చిలికిన పెరుగు
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 1/4 tsp గరం మసాలా

విధానం

  1. కుక్కర్లో చెక్కు తీసిన ఆలూ పసుపు ఉప్పు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక కూత వచ్చే దాకా హై-ఫ్లేమ్ మీద కుక్ చేసి స్టీమ్ పోయాక తీసి పూర్తిగా చల్లారచాలి.
  2. చల్లారిన ఆలూని నూన్ వేసి ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
  3. రోట్లో అల్లం వెల్లులి పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కనుంచుకోండి.
  4. మూకుడులో ఆవా నూనె పోసి పొగలు వచ్చే దాకా వేడి చేసుకోవాలి, పొగలు వచ్చాక ఎండుమిర్చి జీలకర్ర బిరియానీ ఆకు, దాల్చిన చెక్క, వేసి జీలకర్ర చిటచిట అనే దాకా వేపుకోవాలి.
  5. వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తరువాత దంచుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  6. నూనె పైకి తేలాక పసుపు, ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు వేసి వేపుకోవాలి.
  7. మసాలాలు వేగిన తరువాత చిలికిన పెరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి.
  8. పెరుగు కూరలో కలిసి నూనె పైకి తేలాక వేపుకున్న ఆలూ వేసి నెమ్మదిగా కలుపుకోండి ఆ తరువాత నీళ్ళు పోసి కలిపి సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక మూత పెట్టి ఉడికించుకోవాలి.
  9. నూనె పైకి తేలాక కొత్తిమీర తరుగు, గరం మసాలా చల్లి దింపేసుకుని వేడిగా లూచి, పూరీ చపాతీతో ఎంజాయ్ చేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • E
    escort at guwahati
    Recipe Rating:
    | call girl service in guwahati | call girls service in guwahati
  • E
    escort at guwahati
    Recipe Rating:
    call girl guwahati | escort service in guwahati | call girl guwahati | escort service in guwahati | call girl guwahati | escort service in guwahati
  • B
    bal
    Recipe Rating:
    super recipe bro
Bengali Style Aloor dum |  Aloo Dum Recipe | Bengali Style Potato Curry