సెనగపిండి హల్వా | besan హల్వా

సెనగపిండి నెయ్యి పంచదార వేసి చేసే ఈ హల్వా మా ఫ్యామిలీ ఫెవరెట్ రెసిపీ. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ హల్వా తినడానికి చేసుకోడానికి ఒక శుభకార్యం సందర్భం అవసరం లేదు. ఈ బేసన్ హల్వా చేసిన రోజే పండుగలా అనిపిస్తుంది.

మృదువైన ఈ హల్వా కొలతలు చాలా సులభం, సరిగ్గా ఎంత పిండికి ఎంత నెయ్యి, పంచదార అనేది. దీనివల్ల మీరు ఏ కొలతకైనా సులభంగా చేసుకోవచ్చు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు బాదాం హల్వా

ఈ కమ్మని బేసన్ హల్వా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో ఎంతో వివరంగా ఉంది చుడండి.

టిప్స్

సెనగపిండి:

  1. సెనగపిండి నెయ్యిలో సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. లేత బంగారు రంగు రాగానే పంచదార వేసుకోవాలి. సెనగపిండి క్షణాల్లోనే మాడిపోతుంది. అందుకే కలుపుతూ దగ్గరుండి వేపుకోవాలి.

నెయ్యి:

  1. సెనగపిండి నెయ్యి సమానం, ఏ కొలతకి చేసినా. నేను మాత్రం ¾ కప్పు వాడాను. నచ్చితే మీరు సమానంగా వేసుకోవచ్చు, లేదా సెనగపిండికి సగమే వేసుకోవచ్చు.

  2. నెయ్యి మాత్రం ఒకే సారిగా వేయడం కాకుండా కొద్దీ కొద్దిగా వేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు సెనగపిండి చక్కగా వేగుతుంది, గుల్లగా ఉంటుంది హల్వా.

పంచదార:

  1. సెనగపిండికి సగం ఉండాలి పంచదార. సగం పంచదార తీపి సరిపోను ఉంటుంది. మీకు నచ్చితే తీపి తినే వారైతే ఇంకొంచెం పెంచుకోండి

రంగు:

  1. నేను చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ చెంచాడు నీళ్లలో వేసి పోశాను. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండాలని రంగు వేశాను, వేయకున్నా పర్లేదు. పరిమళం కోసం కావాలనుకుంటే కొద్దిగా కుంకుమపువ్వు అయినా వేసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్:

  1. నేను బాదం పలుకులు వేశాను. మీరు జీడిపప్పు, కర్బూజా గింజలు ఇలా ఏవైనా వేసుకోవచ్చు.

ఆఖరుగా:

  1. ఈ బేసన్ హల్వా 3-4 రోజులు నిలవ ఉంటుంది. కానీ ఎంత నెయ్యి వేసి చేసినా సెనగపిండి పీల్చేస్తుంది, కాబట్టి చల్లారిన తరువాత ముద్దలుగా ఉంటుంది హల్వా. అలా ముద్దగా ఉంటె మైక్రోవేవ్లో 30 సెకన్లు వేడి చేస్తే మృదువుగా నెయ్యి పైకి తేలి ఎంతో రుచిగా ఉంటుంది.

సెనగపిండి హల్వా | besan హల్వా - రెసిపీ వీడియో

Besan Halwa | How to Make Besan Halwa with Tips

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 25 mins
  • Total Time 26 mins
  • serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 Cup సెనగపిండి
  • 3/4-1 Cup నెయ్యి
  • 1/2 Cup పంచదార
  • 2 tbsp బొంబాయ్ రవ్వ
  • 1 Cup వేడి నీళ్లు
  • 1 tbsp ఆరెంజ్ రంగు
  • 1/4 tbsp యాలకల పొడి
  • 1/2 Cup బాదం పలుకులు

విధానం

  1. పావు కప్పు నెయ్యి లో సెనగపిండి వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ జీడిపప్పు వేగిన పరిమళం వచ్చేదాకా వేపుకోవాలి
  2. వేగుతున్న సెనగపిండిలో రవ్వ ఇంకో 2 tbsp నెయ్యి వేసి కలుపుతూ మాంచి పరిమళం వచ్చేదాకా వేపుకోవాలి
  3. సెనగపిండి వేగిన తరువాత పంచదార వేసి కలిపి వేడి నీళ్లు దగ్గర పడేదాకా కలుపుతూ ఉడికించుకోండి
  4. హల్వా దగ్గర పడ్డాకా రంగు మిగిలిన నెయ్యి యాలకులపొడి బాధామ పలుకులు వేసి నెయ్యి పైకి తేలేదాక కలుపుతూ వేపుకుని దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.