కాకరకాయ జీడిపప్పు వేపుడు | కాకరకాయ వేపుడు

కాకరకాయ జీడిపప్పు వేపుడు చేదు పిండేసిన కాకరకాయ ముక్కలని ఉల్లిపాయ ఇంకా జీడీపప్పు వెల్లులి ధనియాలు ఎండుమిర్చి వేసి వేపిన కారంలో వేసి చేసే ఈ వేపుడు అతి తక్కువ నూనెలతో తయారవ్వడంతో పాటు ఇంకా నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. 

సాధారణంగా కాకరకాయ వేపుడు అంటేనే కాస్త నూనెలుంటాయి ఇంకా కాస్త చేదుగా ఉంటుంది. కానీ ఈ తీరులో చాలా తక్కువ నూనెలతో తయారవ్వడమే కాకుండా జీడిపప్పు కమ్మదనంతో ఎంతో రుచిగా ఉంటుంది. 

ఈ కాకరకాయ వేపుడు వేడి అన్నం నెయ్యితో గొప్ప జోడీ!!!

టిప్స్

కాకరకాయ:

  1. కాకరకాయలని చెక్కు తీసి ఉప్పు పసుపు ఊరనిచ్చి గట్టిగా పిండితే కాకరకాయలోని చేదు పసరు దిగిపోతుంది. దీనితో చేదు చాలా వరకు తగ్గుతుంది.

  2. మీకు చేదు నచ్చితే ముక్కలని ఊరబెట్టడం పసరు పిండడం చేయకండి. 

నీటి పళ్లెం మీద మగ్గించడం:

  1. సాధారణంగా కాకరకాయని కాస్త ఎక్కువ నూనెలతో వేపుకుంటే చాలా రుచిగా ఉంటుంది, నిలవ ఉంటుంది. కానీ కాకరకాయ ముక్కల్ని వేపుకునేప్పుడు మూకుడు మీద నీరు పోసిన పళ్లెం పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే కాకరకాయలోని చేదు తగ్గడమే కాదు తక్కువ నూనెలతో కాకరకాయ మగ్గిపోతుంది. 

జీడిపప్పు:

  1. చేదుగా ఉండే కాకరకాయలో కమ్మని జీడీపప్పుతో చేస్తే గొప్ప రుచిగా ఉంటుంది. కాబట్టి జీడిపప్పుని మరీ మెత్తంగా పొడి చేయకుండా బరకగా పొడి చేసుకుంటే పప్పు పంటికింద నలిగి చాలా రుచిగా ఉంటుంది. 

ఆఖరుగా:

  1. సాధారణంగా కాకరకాయ వేపుడులో కాస్త తీపి వేస్తారు, మీకు నచ్చితే వేసుకోండి చాలా బాగుంటుంది లేదా వదిలేసేయండి. 

కాకరకాయ జీడిపప్పు వేపుడు | కాకరకాయ వేపుడు - రెసిపీ వీడియో

Bitter Gourd Cashew Fry | Bitter Gourd Fry | Bitter Gourd Kaju fry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 5 mins

కావాల్సిన పదార్ధాలు

  • 6 మీడియం సైజు కాకరకాయలు
  • 1 tsp ఉప్పు
  • 1 Tbsp పసుపు
  • జీడీపప్పు కారం కోసం:
  • 2 spoons నూనె
  • ⅓ cup జీడీపప్పు
  • 2 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 3-4 ఎండుమిర్చి
  • చింతపండు (చిన్న పిక్క)
  • 3 tbsp ఎండు కొబ్బరి
  • 12-15 cloves వెల్లులి
  • ఉప్పు (రుచికి తగినంత)
  • ¼ tsp పసుపు
  • 2 tsp కారం
  • వేపుడు కోసం:
  • ¼ cup నూనె
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • ⅓ cup ఉల్లిపాయ చీలికలు
  • 1 cup నీరు
  • 2 sprigs కరివేపాకు

విధానం

  1. కాకరకాయలని చెక్కుతీసి పావు అంగుళం మందాన ముక్కలు కోసుకోండి.
  2. కోసుకున్న ముక్కల్లో ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి అరగంట ఊరనిచ్చి ఆ తరువాత గట్టిగా పిండి పసరు తీసేయండి.
  3. జీడిపప్పు కారం కోసం నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రంగా వేపి తీసుకోండి.
  4. మిగిలిన నూనెలో మిగిలిన పదార్ధాలన్నీ ఒక దాని తరువాత ఆఖరుగా ఎండుకొబ్బరి వేసి ఎర్రగా వేగనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి.
  5. మిర్చిని మెత్తగా గ్రైన్డ్ చేసుకున్నాకా జీడిపప్పులో కొన్ని ఉంచి మిగిలినవన్నీ ఇంకా చింతపండు ఉప్పు కారం వేసి ఆపి ఆపి బరకగా గ్రైండ్ చేసుకోండి.
  6. వేపుడు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి వేపుకోండి.
  7. వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు పసరు పిండేసిన కాకరకాయ ముక్కలు కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి. మూత మీద కప్పు నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద కాకరకాయ మెత్తగా మగ్గేదాకా వేపుకోండి.
  8. సుమారుగా 20-25 నిమిషాలకి కాకరకాయ ముక్కలు మెత్తబడతాయ్ అప్పుడు గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు కారం వేపుకున్న జీడిపప్పు వేసి కలిసి ఒక్కటే నిమిషం వేపి దింపేసుకోండి. అంత కంటే వేగితే కారాలు మాడిపోతాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.