కాకరయకాయ పులుసు | అమ్మల కాలం నాటి స్టైల్
చేదుగా ఉండే కాకరకాయని ఇష్టంగా తినాలంటే ఆంధ్రుల కాకరకాయ పులుసు పర్ఫెక్ట్. రోజు చేసుకునే కూరలకి బెస్ట్ ఈ కాకరకాయ పులుసు. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
కాకరకాయ పులుసులు దక్షిణ భారత దేశం అంతటా చేస్తారు, ఒక్కవరిది ఒక్కో తీరు. నేను చేస్తున్న తెలుగు వారి కాకరకాయ పులుసు చెడు తక్కువగా తియ్యగా పుల్లగా కారంగా ఉంటుంది. భోజనంలోకి రోజు చేసుకునే కూరగా పర్ఫెక్ట్.
సాధారణంగా కాకరకాయ అంటే పెద్దగా ఇష్టత ఉండదు, ఇలా చేస్తే చేదు తక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ తప్పక నచ్చుతుంది.

టిప్స్
-
కాకరకాయ ముక్కల పైన చెక్కు తీసేస్తే చేదు కొంత వరకు తగ్గుతుంది. చేదు తినగలిగితే కాకరకాయ ఉడికించిన నీళ్ళు పులుసులో పోసుకోవచ్చు, లేదా కాకర ఉడికించిన నీళ్ళు వడకట్టి పులుసులో మంచి నీళ్ళు పోసుకోండి.
-
కాకరకాయ ముక్కలని ముందు నీళ్ళలో ఎక్కువగా ఉడికిస్తే పులుసులో ఉడికేపాటికి మెత్తగా గుజ్జులా అవుతాయ్. కాబట్టి కాకర ఉడుకుపట్టగానే దింపేయండి.
3.బెల్లం: ఈ పులుసుకి కాస్త బెల్లం ఎక్కువగా ఉంటే రుచి. ఎక్కువ బెల్లం ఉంటే పులుసు రుచిగా ఉంటుంది, చేదు తగ్గుతుంది. రుచి చూసి కావాలంటే బెల్లం తగ్గించుకోవచ్చు
-
పులుసు చిక్కదనానికి, కమ్మదనానికి శెనగపిండి వాడాను, ఉంటే నచ్చితే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు.
-
ఈ పులుసులో వెల్లులి నచ్చని వారు వదిలేవచ్చు.
కాకరయకాయ పులుసు | అమ్మల కాలం నాటి స్టైల్ - రెసిపీ వీడియో
Bitter Gourd curry | Kakarakaya Pulusu recipe | Karela Sabzi | How to make Bitter Gourd Recipe
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
కాకరకాయ ముక్కలు ఉడికించడానికి
- 250 gms కాకరకాయ ముక్కలు
- 1/2 liter నీళ్ళు
- ఉప్పు
- 1/4 tsp పసుపు
-
పులసుకి
- 3 tsp నూనె
- 1 tsp ఆవాలు
- 1/4 tsp ఆవాలు
- 1 రెబ్బ కరివేపాకు
- 1 tsp జీలకర్ర
- 2 ఎండు మిర్చి
- 5 వెల్లులి
- ఇంగువ – చిటికెడు
- 1/4 cup చింతపండు గుజ్జు
- 1/4 cup బెల్లం
- ఉప్పు
- 1.25 tsp కారం
- 2 చిటికెళ్లు పసుపు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 1/2 cup ఉల్లిపాయ సన్నని తరుగు
- 1 cup నీళ్ళు
- 2 tsp శెనగపిండి
విధానం
-
చెక్కు తీసి ¼ ఇంచ్ ముక్కలుగా చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు నీళ్ళు పోసి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-
ఉడికించుకున్న కాకరకాయ ముక్కలని వడకట్టి పక్కనుంచుకోండి.
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు జీలకర్ర వేసి మెంతులు ఎర్రగా బడే దాకా వేపుకోవాలి తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లులి, ఇంగువ వేసి వేపుకోవాలి.
-
తాలింపు వేగాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడి నూనె పైకి తేలేదాక దాకా వేపుకోవాలి.
-
ఉడికిన కాకరకాయ ముక్కలు వేసి 3-4 నిమిషాలు తాళింపులో వేగనివ్వాలి, వేగిన తరువాత నచ్చితే కాకరకాయ ఉడికించిన నీళ్ళు పోసుకోండి, చేదు తినలేరు అనుకుంటే మంచి నీళ్ళు 300ml, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు వేసి 15 నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనివ్వాలి.
-
పులుసు చిక్కబడ్డాక శెనగపిండి లో ½ కప్పు నీళ్ళు పోసి గడ్డలు లేకుండా కలిపి పులుసులో పోసి బాగా కలిపి మరో 10 నిమిషాలు ఉడికిస్తే పులుసు చిక్కబడుతుంది అప్పుడు దింపేసుకోండి.

Leave a comment ×
2 comments