మినపప్పు పచ్చడి | ఇడ్లి అట్టులోకి అన్నం లోకి ఈ పచ్చడి తింటే కొబ్బరి పచ్చడి పనికిరాదు
చేసే పచ్చడి టీఫిన్కి, భోజనానికి అని కాకుండా ఒకే పచ్చడి ఎందులోకైనా సరిపోయేదాని కోసం చూస్తున్నారా? అయితే తెలుగు వారి మినపప్పు పచ్చడి చేయండి. ఘుమఘుమలాడే ఈ మినపప్పు పచ్చడి స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
మినపప్పు పచ్చడి! ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన పచ్చడి. ఇది గుంటూరు జిల్లా నుండి నెల్లూరు జిల్లా వరకు చాలా ఎక్కువగా చేస్తుంటారు. కాని నెల్లూరు జిల్లా వారు కొంచెం భిన్నంగా చేస్తారు. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నం లో, ఇడ్లి, అట్టు, గారే ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఫ్రిజ్ లో పెట్టుకుంటే కనీసం వారం పాటు నిలవుంటుంది కూడా.

టిప్స్
మినుములు:మినప్పు పచ్చడి పొట్టు పప్పుతో చేస్తే ఒక రుచి, పొట్టు లేని పప్పుతో మరో రుచి. నేను పొట్టు మినపప్పుతో చేస్తున్నా. పొట్టు పప్పు రుచి చాలా బాగుంటుంది.
బెల్లం: పచ్చడికి బెల్లం రుచి బాగుంటుంది. నచ్చని వారు వదిలేవచ్చు. వేసే బెల్లం కూడా కారానికి తగినట్లు వేసుకోవాలి. ఎండు మిర్చి కారం ఎక్కువగా ఉంటే కొంచెం బెల్లం వేసుకోండి.
చింతపండు:చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి వాడుకోండి, అప్పుడు గుజ్జు ఎక్కువ వస్తుంది. చింతపండు మిరపకాయల కారాన్ని బట్టి రుచి చూసి పెంచుకోండి. అలాగే పులుపుని బట్టి ఉప్పు కూడా సరి చూసి వేసుకోవాలి.
పచ్చడి:
-
పొట్టు పప్పు కారణంగా పచ్చడి కొంచెం జిగురు ఉంటుంది, కాబట్టి కొంచెం పల్చగా చేసుకుంటే సమయం గడుస్తున్నా కొద్ది గట్టి పడుతుంది.
-
పచ్చడి మరీ మెత్తగా కాక కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకుంటే రుచి బాగుంటుంది.
-
వేడి నీళ్ళతో రుబ్బి ఎక్కువ నూనెతో తాలింపు పెట్టుకుంటే వారం పైన నిలవుంటుంది ఫ్రిజ్ లో.

మినపప్పు పచ్చడి | ఇడ్లి అట్టులోకి అన్నం లోకి ఈ పచ్చడి తింటే కొబ్బరి పచ్చడి పనికిరాదు - రెసిపీ వీడియో
Black Gram Chutney | Minapappu Pacchadi | How to make Urad Dal Chutney
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup పొట్టు మినుములు
- 8 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 1 tsp మెంతులు
- చింతపండు- నిమ్మకాయంత
- 1 tbsp బెల్లం
- 1 tsp ఆవాలు
- 1 రెబ్బ కరివేపాకు
- 2 tbsp నూనె
విధానం
-
1 tbsp నూనె వేడి చేసి అందులో మినుములు వేసి కేవలం లో-ఫ్లేం మీదే మాంచి సువాసనోచ్చేదాక వేపుకోవాలి. ఇది వేగి మాంచి సువాసన రావడానికి కాస్త టైం పడుతుంది.
-
మంచి సువాసన రాగానే తీసి పక్కనుంచుకోండి.
-
ఇప్పుడు మెంతులు వేసి ఎర్ర గా వేపుకోండి, వేగాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేపుకుని తీసుకోండి.
-
ఇప్పుడు వేపుకున్న సామానంతా మిక్సీ జార్ లో వేసుకుని అందులోనే వెల్లూలి, బెల్లం ఉప్పు, చింతపండు వేసి వేడి నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి.
-
ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటమనిపించి కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేపి పచ్చడి లో కలిపేయండి.

Leave a comment ×