లంచ్ బాక్సులకి, శ్రమలేకుండా త్వరగా అయిపోతూ అందరికి నచ్చే రైస్ తెలుగు వారి మినపప్పు అన్నం. వెనుకటి తెలుగు తమిళవారు ఈ రెసిపీ ఎక్కువగా ప్రసాదంగా చేసేవారు.

ఆ తరువాతి కాలంలో మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నారు. ఇప్పటి తరం దాదాపుగా మరిచిపోయారు. ఇంకా కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో ముఖ్యంగా ఉల్లి వెల్లులి తినని కుటుంబాల్లో చేసుకుంటున్నారు.

ఘుమఘుమలాడిపోతూ ఎంతో రుచిగా ఉండే ఈ మినపప్పు అన్నం సంప్రదాయ పద్ధతిలో చేయాలంటే ఉల్లి వెల్లులి వేయరు.

ఈ సింపుల్ రెసిపీ లంచ్ బాక్సులకి లేదా మిగిలిపోయిన అన్నంతో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ చాయిస్.

టిప్స్

మినపప్పు :

  1. ఈ అన్నానికి కచ్చితంగా పొట్టు మినపప్పు ఉంటేనే రుచి పరిమళం. లేనివారు పొత్తులేని పప్పు వాడుకోండి

  2. మినపప్పు కూడా సన్నని సెగమీద వేగాలి అప్పుడు పప్పు లోపలిదాకా వేగి రుచి సువాసన

కొబ్బరి:

పచ్చికొబ్బరి రుచి చాల బాగుంటుంది. లేని వారు నచ్చనివారు యందు కొబ్బరి వాడుకోవచ్చు. కానీ పచ్చికొబ్బరి రుచి చాలా బాగుంటుంది.

నెయ్యి:

నచ్చితే నెయ్యికి బదులు నూనె కూడా వాడుకోవచ్చు

ఉల్లి వెల్లులి

  1. సంప్రదాయ పద్ధతిలో చేసే తీరులో ఉల్లి వెల్లులి ఉండదు. వెల్లులి వేసుకోదలిస్తే పప్పులు గ్రైండ్ చేసేప్పుడు కొన్ని వేసుకోండి

  2. ఉల్లి వేసుకోదలిస్తే తాళింపులు వేగిన తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపుకుని పొడి వేసి ఒక నిమిషం వేపుకోవచ్చు

ఇంకా కొన్ని విధాలు:

తెల్ల అన్నానికి బదులు బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు ఇంకా మిల్లెట్స్ ఏదైనా వాడి చేసుకోవచ్చు.

మినపప్పు అన్నం - రెసిపీ వీడియో

Black Gram Rice | Urad dal Rice | Lunch box recipe | How to Make Black Gram Rice

Flavored Rice | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 10 mins
  • Total Time 12 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • మినపప్పు పొడి కోసం
  • 1/4 cup పొట్టు మినపప్పు
  • 1 tbsp ధనియాలు
  • 8 - 10 ఎండుమిర్చి
  • 1/4 cup పచ్చి కొబ్బరి ముక్కలు
  • చింతపండు - 2 రెబ్బలు
  • 1 tbsp నెయ్యి
  • అన్నం కోసం
  • 1 cup పొడిపొడిగా వండుకున్న అన్నం (185gm బియ్యంతో వండినది)
  • 2 tbsp నెయ్యి
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • ఉప్పు
  • ఇంగువ - కొద్దిగా

విధానం

  1. నెయ్యి వేడి చేసి మినపప్పు వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
  2. పప్పు వేగిన తరువాత మిగిలిన పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. వేగిన పప్పుని మిక్సీలో వేసుకోండి ఇంకా చింతపండు కూడా వేసి మెత్తని పొడి చేసుకోండి.
  4. నెయ్యి వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు ఒక్కోటి వేసి తాలింపుని ఎర్రగా వేపుకోవాలి.
  5. తాలింపు వేగిన తరువాత మినపప్పు పొడి ఉప్పు వేసి ఒక నిమిషం వేపుకోండి చాలు.
  6. పొడిపొడిగా వండుకున్న అన్నంలో వేపుకున్న పొడి వేసి బాగా కలిపితే ఘుమఘుమలాడే మినపప్పు అన్నం తయారు (ఉల్లి వెల్లులి వేసుకోదలిస్తే టిప్స్ చుడండి ).

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments