సొరకాయ చపాతీ | దూది కంటే మెత్తని సొరకాయ చపాతీ

దూది కంటే మెత్తని చపాతీ తినాలంటే నా స్టైల్ సొరకాయ చపాతీ చేయండి. కమ్మని పెరుగు చాలు ఈ మెత్తని మృదువైన చపాతీ కోసం. సొరకాయ చపాతీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.

చపాతీ అనగానే దానితో నంజుడు ఏమిటి? అనే మాట వస్తుంది, కానీ ఈ సొరకాయ చపాతీకి కమ్మని చల్లని పెరుగు చాలు. మామూలు చపాతీలు టైమ్ గడుస్తున్నా కొద్దీ మృదుత్వం కోల్పోయి, గట్టి పడతాయ్. అలా అవ్వకూడదు అంటే నూనె ఎక్కువ వేసి కాల్చాలి. కానీ ఈ సొరకాయ చపాతీకి కొద్దిగా నూనె వేస్తే చాలు గంటల తరువాత కూడా మెత్తగా ఉంటాయ్. సొ లంచ్ బాక్సులకి కూడా తీసుకెళ్లవచ్చు.

Bottle Gourd Chapati | Lauki Chapathi | Sorakaya Chapathi | How to make Bottle Gourd Chapathi

టిప్స్

  1. సొరకాయ తురుము పిండిలో వేసి బాగా కలిపిన తరువాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మెత్తగా వత్తుకోవాలి.

  2. నేను పచ్చిమిర్చి సన్నని తరుగు వేశాను, మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు.

  3. చపాతీ సరైన షేప్లో రాదు అక్కడక్కడా రంధ్రాలు, ఇంకా ఎగుడుదిగుడుగా ఉంటుంది.

  4. ఏ కారణం చేతనైన పిండి జారుగా అయితే పొడి పిండి కలుపుకోండి.

సొరకాయ చపాతీ | దూది కంటే మెత్తని సొరకాయ చపాతీ - రెసిపీ వీడియో

Bottle Gourd Chapati | Lauki Chapathi | Sorakaya Chapathi | How to make Bottle Gourd Chapathi

Healthy Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 1/2 cup గోధుమ పిండి
  • 2 cups సొరకాయ తురుము
  • ఉప్పు
  • 1/2 tsp గరం మసాలా
  • 1 tsp పచ్చిమిర్చి తరుగు
  • 1/2 tsp మిరియాల పొడి
  • ఇంగువ – చిటికెడు
  • నీళ్ళు తగినన్ని
  • 2 tbsp నూనె (పిండిలో కలపడానికి)
  • నూనె కాల్చుకోడానికి

విధానం

  1. పిండి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి గట్టిగా కలుపుకోవాలి.
  2. నీళ్ళు చిలకరించి పిండిని మృదువుగా వత్తుకోండి. ఆఖరున నూనె వేసి కలుపుకుని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి
  3. 15 నిమిషాల తరువాత పెద్ద నిమ్మకాయ సైజు పిండి ముద్దని పొడి పిండి చల్లి నెమ్మదిగా వత్తుకోవాలి
  4. వత్తుకున్న రొటీని వేడి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చి తరువాత tsp నూనె వేసి కాల్చుకుని తీసుకోండి.
  5. ఇవి చల్లని కమ్మని పెరుగుతో చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • R
    Raja
    Recipe Rating:
    Superb
  • S
    Seetha
    Recipe Rating:
    Superb recipe thanks a lot to vismai food teja paruchuri I have been searching a perfect recipe since so many days .And you came with a wonderful recipe .This helped me a lot in reducing my weight.👏👏👏👏👏👏👏👏🤗
Bottle Gourd Chapati | Lauki Chapathi | Sorakaya Chapathi | How to make Bottle Gourd Chapathi