సొరకాయ కొబ్బరి పాల కూర | సొరకాయ కూర చాలా కమ్మగా తిన్నతరువాత కూడా పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది
కారం తక్కువగా తినాలనుకునే వారికి, ఇంకా ఎప్పుడు చేసుకునే కూరలకి భిన్నంగా ఉండే కూర కావలయంటే ఈ సొరకాయ కొబ్బరి పాల కూర తిని చూడండి.
ఈ సొరకాయ కూర చాలా కమ్మగా తిన్నతరువాత కూడా పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది.
నిజానికి ఈ సొరకాయ కూర నేను తమిళనాడు కేరళ వారు చేసే ఆవియల్ ను చూసి చిన్న మార్పులతో చేస్తున్న రెసిపీ. ఈ రెసిపీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎక్కువగా టైమ్ కూడా పట్టదు.
సాధారణంగా పెద్దలు కూర ఎక్కువగా అన్నం తక్కువగా తినాలి అని అంటుంటారు, ఉప్పు కారాలు నూనెలుండే మామూలు కూరలు ఎక్కువగా తినలేము. కాని ఈ కూర ఎంతో హాయిగా ఎంతైనా తినేయొచ్చు. ఈ సొరకాయ కూర అన్నం, చపాతీ, రోటీ ల్లోకి చాలా రుచిగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారు, బీపి, షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా అసిడిటీ, అరికాళ్ళ మంటలు, గ్యాస్ ప్రాబ్లెం ఉన్న వాళ్ళు ఈ కూరలు తింటే మరింత హాయిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు!

టిప్స్
• ఈ కూరలో కారం, పసుపు అవసరం లేదు. నూనె 1 tsp చాలు.
• ఈ కూర కమ్మగా ఉంటుంది కారంగా ఘాటుగా ఉండదు
• నేను వేరుశెనగ నూనెతో తాలింపు పెట్టాను. కొబ్బరి నూనెతో పెట్టె తాలింపు రుచి చాలా గొప్పగా ఉంటుంది.

సొరకాయ కొబ్బరి పాల కూర | సొరకాయ కూర చాలా కమ్మగా తిన్నతరువాత కూడా పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది - రెసిపీ వీడియో
Bottle Gourd Curry in Coconut Milk | Kaddu Coconut milk Curry | Sorakaya Kobbari Pala Kura Recipe | How to make Bottlegourd curry
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/2 Kilo లేత సొరకాయ ముక్కలు (చెక్కు తీసినవి)
- 1/2 cup పెరుగు
- 200 ml నీళ్ళు
- 300 ml చిక్కటి కొబ్బరి పాలు
- 5 - 6 పచ్చిమిర్చి చీలికలు
- 2 కరివేపాకు రెబ్బలు
- సాల్ట్
-
తాలింపుకి
- 1 tsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp మినపప్పు
- 1/2 tsp జీలకర్ర
- 2 ఎండు మిర్చి
విధానం
-
పెరుగులో నీళ్ళు పోసి బాగా చిలిక్కుని అందులో సొరకాయ ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకోండి.
-
పచ్చి మిర్చి చీలికలు, కరివేపాకు రెబ్బలు, సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేం మీద మజ్జిగ ఇగిరిపోయేదాక ఉడికించుకోండి.
-
సొరకాయ ముక్కలు మగ్గాక కొబ్బరి పాలు పోసుకోండి. కొబ్బరి పాలు ఇంకా కొద్దిగా ఉండాగే దిమ్పెసుకోండి.
-
నూనె వేడి చేసి అందులో తాలింపు సామానంత వేసి వేయించుకుని కూరలో కలిపేసుకోండి

Leave a comment ×
1 comments