సొరకాయ పచ్చడి
సొరకాయ పచ్చడి కమ్మగా కారంగా పుల్లగా ఉండే ఆంధ్రుల స్పెషల్ పచ్చడి. ఈ పచ్చడి వేడిగా నెయ్యి అన్నంతో పాటు ఇడ్లీ అట్టు చపాతీతో చాలా రుచిగా ఉంటుంది.
నేను ఎప్పుడు చెప్పేదే తెలుగు వారు పచ్చళ్ళ ప్రియులు, వారు దొరికిన ప్రతీ కాయ కూరతో పచ్చడులు చేస్తారు. తెలుగు వారి భోజనం అంటే మొదటగా పచ్చడి అందులోకి నెయ్యి ఉండాలి ఆ తరువాత మిగిలినవి.
నిజానికి ఈ సొరకాయ పచ్చడి తీరులోనే అన్నీ కాయకూరలతో చిన్న మార్పులతో పచ్చడి చేయోచ్చ్చు. ఈ సొరకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే 5 రోజులు బయట ఎండాకాలంలో అయితే ఒక రోజు చలికాలంలో అయితే 2 రోజులు నిల్వ ఉంటుంది.

టిప్స్
సొరకాయ:
నేను చెక్కు ఇంకా గింజలు తీసేసిన సొరకాయ ముక్కలు వాడాను. మీరు నచ్చితే చెక్కు తీయకుండా అయినా వాడుకోవచ్చు.
పచ్చిమిర్చి:
తెలుగు వారి కారం మోతాదు కాస్త ఎక్కువ కాబట్టి ఈ మాత్రం మిరపకాయలు పడతాయ్. మీరు మీకు తగినట్లుగా మిరపకాయలు వేసుకోండి.
నిల్వ ఉంచుకోదలిస్తే:
పచ్చడి ఎక్కువ మోతాదులో చేసుకుని నిల్వ ఉంచుకోదలిస్తే నూనె ఎక్కువగా ఉండాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటె పచ్చడి ఫ్రిజ్లోకి చేరితే చాలు చెప్పదనం వస్తుంది పచ్చడికి.
సొరకాయ పచ్చడి - రెసిపీ వీడియో
Bottlegourd Chilli Chutney | Sorakaya Greenchilli Chutney | How to Make Bottlegourd Chutney
Prep Time 2 mins
Cook Time 18 mins
Total Time 20 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 3 cups సొరకాయ ముక్కలు
- 2 టమాటో
- 15 పచ్చిమిర్చి
- కొత్తిమీర - చిన్న కట్ట
- చింతపండు - చిన్న ఉసిరికాయంత
- 2 tbsp నూనె
- ఉప్పు
- 1/4 tsp పసుపు
-
తాలింపు కోసం
- 2 tbsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 1/2 tsp మినపప్పు
- 1/2 tsp పచ్చిశెనగపప్పు
- 2 ఇంగువ - చిటికెలు
- 1 రెబ్బ కరివేపాకు
- 1 ఎండుమిరపకాయ ముక్కలు
విధానం
-
పాన్లో నూనె వేడి చేసి అందులో సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి మూతపెట్టి సొరకాయ ముక్కలు మెత్తబడి దాకా మగ్గనిస్తే చాలు.
-
మగ్గిన సొరకాయ ముక్కల్లో టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపి టమాటో పైన తోలు ఊడే దాకా మగ్గించాలి.
-
మగ్గిన టొమాటోలో కొత్తిమీర చింతావులందు వేసి ఒకే నిమిషం కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలలతో మొదలెట్టి మిగిలిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి పచ్చడిలో కలిపేసుకోండి.

Leave a comment ×