బోర్న్వీటా కలాకండ్
పలు పంచదార కలిపి చేసే స్వీట్స్ కొన్ని వందల రకాలున్నాయి అందులో మరో స్పెషల్ రెసిపీ బోర్న్వీటా కలాకండ్. ఇదీ చూడడానికి చేయడానికి కలాకండ్ లాగే అనిపిస్తుంది. కానీ రుచి భిన్నంగా ఉంటుంది.
ఇతర రాష్ట్రాలలో నేను అంత ఎక్కువగా చూడలేదు కానీ తెలుగు రాష్ట్రాలలో ఇంకా తమిళనాడు ఈ స్వీట్ దాదాపుగా ప్రతీ స్వీట్ షాప్స్లో దొరుకుతుంది. నా చిన్న తనంలో పెళ్ళిళ్ళలో కూడా పెట్టేవారు.
రెసిపీ పేరు రూపం చూసి చాలా కష్టం అనుకుంటాం కానీ ఎంతో సులభం బోర్న్వీటా కలాకండ్. కాస్త ఓపికతో చేస్తే చాలు, స్వీట్ షాప్ టెస్ట్ వస్తుంది. కానీ కొన్ని టిప్స్తో బెస్ట్ బోర్న్వీటా కలాకండ్ వస్తుంది, కాబట్టి కింద టిప్స్ చూసి చేయండి.

టిప్స్
పాలు:
-
చిక్కని గేదె పాలతో కమ్మని పూసలతో ఉండే కలాకండ్ వస్తుంది
-
కలాకండ్కి వాడే పాలు చిక్కనివి అంటే వెన్నశాతం ఎక్కువగా ఉన్న పాలు వాడాలి అప్పుడే ఎక్కువ పూసలు వస్తాయి
ముకుడు:
- కలాకండ్ చేసే ముకుడు పాలకి 3 ఇంతలు ఉండాలి అంటే లీటర్ పాలకి మూడు లీటర్ల మూకుడు ఉండాలి. అప్పుడు పాలని వేగంగా కలపడానికి వీలవుతుంది. పాలు కింద పడవు
పర్ఫెక్ట్ కాలకాండ్కి కొన్ని టిప్స్:
-
కలాకండ్ రుచి అంతా కాలకాండ్లో ఉండే పూసలలో ఉంటుంది. కాబట్టి పూసలు గట్టి పడకుండా మృదువుగా ఉన్నప్పుడే దింపుకోవాలి
-
పూసలు ఏర్పడడానికి కొద్దిగా నిమ్మ ఉప్పు లేదా నిమ్మరసం చాలు. వేసిన ఆ కొద్ది నిమ్మఉప్పు చాలా కొద్దిగా పాలని విరుపుతుంది. ఆ విరుగు కూడా మజ్జిగలోని తరకలుగా ఉండాలి పనీర్లా కాదు. ఆ విరుగుని ఆపకుండా కలుపుతుంటే పూసలుగా ఏర్పడుతుంది. ఆ మృదువైన పూసలలోనే ఉండి కలాకండ్ రుచి
-
కాలకండ్ దింపేటప్పుడు కాస్త పలుచగానే దింపాలి అంటే మరీ గట్టిగా ముద్దగా అయ్యేదాక కాదు. పలుచగా దింపితే చల్లారేపాటికి కలాకండ్ నీరుని పీల్చి గట్టి పడుతుంది. అప్పుడు సరైన మృదుత్వంతో ఉంటుంది. లేదా గట్టిగా అవుతుంది కలాకండ్
-
బోర్న్వీటా కలాకండ్కి పంచదార చాలా కొద్దిగా అవసరమవుతుంది. ఎందుకంటే బోర్న్వీటాలో కూడా తీపి ఉంటుంది కాబట్టి
బోర్న్వీటా కలాకండ్ - రెసిపీ వీడియో
Bournvita Kalakand | How to make Juicy Bournvita Kalakand
Prep Time 1 min
Cook Time 1 hr 15 mins
Total Time 1 hr 16 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
వైట్ కలాకండ్ కోసం
- 2 liters చిక్కని పాలు
- 1 tbsp పంచదార
- 2 చిటికెళ్లు నిమ్మ ఉప్పు (నిమ్మరసం అయితే ½ tsp)
- 1 tsp నెయ్యి
-
బోర్న్విటా కలాకండ్ కోసం
- 1 liter చిక్కని పాలు
- 1/4 cup బోర్న్వీట (50 gm)
- 2 చిటికెళ్లు నిమ్మ ఉప్పు (నిమ్మరసం అయితే ½ tsp)
- 1 tbsp నెయ్యి
విధానం
-
బోర్న్వీట కలాకండ్ చిక్కని పాలు పోసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ మరిగించాలి.
-
పాలు పొంగువచ్చాక పంచదార నిమ్మ ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద 20 నిమిషాలు కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది ఇంకా కాస్త నీరుగా ఉంటుంది అప్పుడు బోర్న్వీటా నెయ్యి వేసి 3 నిమిషాలు బాగా కలిపి దింపేసుకోవాలి.
-
వైట్ కలాకండ్ కోసం చిక్కని పాలు పంచదార వేసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ మరిగించాలి. పాలు బాగా దగ్గర పడ్డాక నెయ్యి వేసి కలిపి దింపేసుకోవాలి.
-
నెయ్యి రాసిన ప్లేట్లో ముందు వైట్ కలాకండ్ వేసి నున్నగా సమానంగా చేసుకోవాలి, ఆ పైన బోర్న్వీట కలాకండ్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఈ ట్రేని కనీసం 6 గంటలు లేదా రాత్రంతా క్లాత్ కప్పి గాలికి వదిలేస్తే పర్ఫెక్ట్గా బిగుసుకుంటుంది.
-
తరువాత నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి.

Leave a comment ×