వంకాయ కందిపప్పు ఇగురు

వంకాయ ముక్కలు మెత్తగా ఉడికించి అందులో నానబెట్టిన కందిపప్పు పచ్చిమిర్చి కొబ్బరి ముద్ద వేసి తాలింపు పెట్టె కమ్మని ఆంధ్రుల రెసిపీ వేడి అన్నంతో గొప్పగా ఉంటుంది.

ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఉల్లి వెల్లులి లేదు. కాబట్టి పండుగలకు కూడా చేసుకోవచ్చు.

కూరల్లో రారాజు వంకాయ అంటారు తెలుగు వారు. తెలుగు వారికి వంకాయ గోంగూరా ఉంటె ఆ రోజు ప్రేత్యేకమే!!!

ఈ వంకాయ కందిపప్పు ఇగురు కూర దాదాపుగా తెలుగు వారు మరిచిపోయారు. ఇది వెనుకటి కాలం తీరు. ఈ కమ్మటి వంకాయ కూర నాకు 85 సంవత్సరాల బామ్మగారు నేర్పారు, ఇది వారి అత్తగారి స్పెషల్ రెసిపీ అని నాకు నాకు చెప్పారు. నేను వారింటికి వెళ్ళినప్పుడు భోజనానికి బీరకాయ పచ్చడితో పాటు ఈ కూర వడ్డించారు, నాకు చాలా నచ్చేసింది, వెంటనే ఎలా చేశారు ఈ కమ్మటి కూర అని అడిగి తెలుసుకున్నాను, ఆ రెసిపీనే మీకు పోస్ట్ చేస్తున్నాను.

ఈ వంకాయ కూర తెలిసీతెలియని పులుపుతో, కమ్మని కొబ్బరి, పచ్చిమిర్చి ఘాటుతో చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఎండు కారం లాంటివి వేయరు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్ వంకాయ మెంతి కూర ఫ్రై

టిప్స్

వంకాయలు:

  1. ఈ కూరకి నీలం రంగు పొడవు వంకాయల రుచి చాలా బాగుంటుంది. ఇవి మూళ్ళ వంకాయలు అని కూడా అంటారు. ఇవి దొరకనట్లైతే తెల్లవి పొడవు వంకాయలైన వాడుకోండి కానీ ముదురు నీలం రంగులో ఉండే గుత్తి వంకాయలు వాడకండి. ముదురు నీలం రంగు వంకాయలు కాస్త వగరుగా ఉంటాయి.
  2. వంకాయ ముక్కలు 80% చింతపండు నీళ్లలో ఉడికితే చాలు, పూర్తిగా మెత్తగా ఉడికితే కూర తయారయ్యే పాటికి గుజ్జుగా అయిపోతుంది.
  3. వంకాయలు లేతగా ఉంటె గింజలు తక్కువగా ఉంటాయి వంకాయ మీగడలా కరిగిపోతుంది నోట్లో.

కందిపప్పు:

  1. కడిగిన కందిపప్పు గంటకు పైగా నానబెట్టినవి వాడుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ మీరు కందిపప్పుకి బదులు పెసరపప్పు, పచ్చిశెనగపప్పు లేదా ఉడికించుకున్న అలసందలు కూడా వాడుకోవచ్చు.

వంకాయ కందిపప్పు ఇగురు - రెసిపీ వీడియో

Brinjal and Pigeon Pea (Tur Dal) dry curry | How to Make Brinjan and Tur Dal Curry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 25 mins

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kg లేత నీలం రంగు పొడవు వంకాయలు
  • 1/2 Cup చింతపండు నీళ్లు (ఉసిరికాయంత చింతపండు నుండి తీసినది)
  • 6-7 పచ్చిమిర్చి
  • 1/2 Cup పచ్చికొబ్బరి
  • 2 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp మినపప్పు
  • 2 Springs కరివేపాకు
  • కొత్తిమీర తరుగు (కొద్దిగా)
  • 400 ml నీళ్లు
  • 1 tbsp పచ్చిశెనగపప్పు

విధానం

  1. నీళ్లలో రెండు అంగుళాల పొడవు ముక్కలుగా తరుక్కున్న వంకాయ ముక్కలు చింతపండు పులుసు పోసి వంకాయ ముక్కలని 80% ఉడికించుకోండి
  2. మెత్తగా ఉడికిన వంకాయ ముక్కలని వడకట్టి చల్లారనివ్వండి
  3. మిక్సీలో పచ్చిమిర్చి కొబ్బరి వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
  4. నూనె వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు సెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోండి, తరువాత కరివేపాకు వేసి వేపండి.
  5. వేగిన తాలింపులో ఉడికించున్న వంకాయ ముక్కలు, నానబెట్టుకున్న కందిపప్పు వేసి కలిపి 3 నిమిషాలు మగ్గనివ్వాలి
  6. మూడు నిమిషాల తరువాత పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉప్పు వేసి కలిపి కందిపప్పు మెత్తబడే దాకా ఉడికించుకోండి. (మధ్య మధ్యన కలుపుతుండాలి లేదంటే అడుగుపెట్టేస్తుంది)
  7. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. ఈ కూర వేడి అన్నం నెయ్యి కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.