వంకాయ మెంతి కూర ఫ్రై
తెలుగు వారికి వంకాయ- గోంగూర అంటే పిచ్చీ అనే అనాలి. అందుకే ఎన్ని రకాలో వంకాయ గోంగూరతో. తెలుగిళ్ళలో వంకాయ గోంగూర లేకుండా ఏ శుభకార్యం జరగడం నేను చూడలేదు. లేత వంకాయలు ఉత్తినే ఉప్పు కారం వేసి ఉడకబెట్టినా రుచిగానే ఉంటుంది తెలుగు వారికి.
వంకాయ వేపుడు అందరికీ తెలిసినదే అయినా ఇంకా ఏదో కొత్తగా కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు నా స్టైల్ వంకాయ మెంతి కూర వేపుడు ట్రై చేయండి. ఎప్పుడూ తినేంత రుచిగా ఉంటుంది.
వంకాయ మెంతికూర వేపుడు మా ఇంట్లో చేస్తూనే ఉంటాము. అది పూర్తిగా తెలుగు వారి తీరులో ఉంటుంది.
కానీ ఈ రెసిపిలో నేను కొద్దిగా వాము వేశాను. అది మాత్రం ముంబైలోని నా ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను. మహరాష్ట్రాలో కూడా అచ్చం ఇలాగే చేస్తారు. కానీ వారు కొద్దిగా వాము వాడతారు. వాము ఫ్లేవర్ నాకు చాలా నచ్చింది. అందుకే ఇందులో వాము వేసి చేశాను. ట్రై చేయండి, అన్నం, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
వంకాయలు:
వంకాయలు పొడవుగా నీలం రంగుతో ఉండేవి ఎంతో రుచిగా ఉంటాయ్. తెల్లవి లేదా ముదురు నీలం రంగులో వాటి కంటే కూడా.
మెంతి కూర:
మెంతి కూర పెద్ద ఆకులు ఉన్నవి వాడను. ఆ ఆకు చేదు వేగిన తరువాత తినేట్లుగా ఉంటుంది. చిన్న మెంతి ఆకు కూడా వేసుకోవచ్చు. చేదు ఇష్టపడే వారు చిన్న ఆకుల మెంతి కూర వేసుకోండి.
నూనె:
వంకాయ అంటేనే కాస్త నూనె ఉండాలి. నూనె తక్కువగా వేసి కూడా చేయవచ్చు కానీ అంత రుచిగా ఉండదు.
అల్లం వెల్లూలి:
ఈ వంకాయ వేపుడులో అల్లం వెల్లూలి వాడను. నచ్చకుంటే వదిలేవచ్చు.

వంకాయ మెంతి కూర ఫ్రై - రెసిపీ వీడియో
Brinjal Fenugreek Fry | Brinjal Methi Fry Recipe | Baingan Methi Fry | How to Make Brinjal Methi Fry
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/2 kg లేత పొడవు వంకాయలు
- 150 gms మెంతి కూర (3 కట్టలు)
- 4 tbsps నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- ఇంగువ చిటికెడు
- 1/4 tsp వాము
- 1 tsp అల్లం తరుగు
- 1 tbsp వెల్లూలి
- 1 cup ఉల్లిపాయ తరుగు
- 2 టొమాటో
- 2 పచ్చిమిర్చి తరుగు
- 1/2 tsp పసుపు
- 1 tsp ధనియాల పొడి
- ఉప్పు
- 1 tbsp కారం
విధానం
-
నూనె వేడి చేసి 2 అంగుళాల సైజు వంకాయ ముక్కలు వేసి రంగు మారి 80% మగ్గేదాకా వేపుకోవాలి, వేపుకున్న వంకాయ ముక్కలని పక్కకు తీసుకోవాలి .
-
అదే నూనె లో ఆవాలు, జీలకర్ర, ఇంగువా, అల్లం వెల్లూలీ తరుగు వేసి వేపుకోవాలి.
-
ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపి, టొమాటో, పచ్చిమిర్చి తరుగు వేసి టొమాటో గుజ్జుగా అయ్యేదాకా వేపుకోవాలి .
-
పసుపు ధనియాల పొడి ఉప్పు కారం వేసి వేపుకోవాలి.
-
మెంతి కూర సన్నిని తరుగు వేసి ఆకు మాగీ నూనె పైకి తేలే దాకా వేపుకోవాలీ .
-
ఆకు వేగిన తరువాత వేపుకున్న వంకాయ ముక్కలు వేసి మరో 3 నిమిషాలు వేపి దింపేసుకోండి.

Leave a comment ×
2 comments