గుత్తి వంకాయ మలాయి కుర్మా | వంకాయ అంటే ఇష్టపడే వారు తప్పక రుచి చూడాల్సిన లక్నో స్పెషల్ వంకాయ మలాయ్ కుర్మా
వంకాయ అంటే ఇష్టపడే వారు తప్పక రుచి చూడాల్సిన లక్నో స్పెషల్ “వంకాయ మలాయ్ కుర్మా”. ఈ కుర్మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
వంకాయ కూరలు ప్రాంతానికి తగినట్లు భారత దేశమంతా చాలా రకాలుగా చేస్తారు, అందరూ ఇష్టంగా తింటారు. అందులో ఇదీ ఒకటి. ఈ వంకాయ మలాయ్ కుర్మా లక్నో స్పెషల్ రెసిపీ. కమ్మగా తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది.
రొటీలు, చపాతీ, పూరీతో లేదా బాగారా అన్నం తో మాంచి జోడీ ఈ వంకాయ మలాయ్ కుర్మా.

టిప్స్
-
వంకాయలు లేతగా ఉంటే కుర్మా రుచిగా ఉంటుంది.
-
నూనెలో చీరిన వంకాయలు 60% వేగితే చాలు, మిగిలినది కూర్మలో మగ్గిపోతుంది. అప్పుడే వంకాయకి ఫ్లేవర్స్ పడతాయ్.
-
ఈ కుర్మాలో వేసిన కొద్దిగా ఎండు కారం రంగు కోసం వాడాను. ఈ కూర్మకి ఎండు కారం కంటే పచ్చిమిర్చి కారం రుచిగా ఉంటుంది.
-
ఈ వంకాయ మలాయ్ కుర్మా నూనె, నెయ్యి కలిపి వాడితే చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే నూనె ఒక్కటే వేసుకోవచ్చు.
-
వంకాయ కూరకి నూనెలు ఉంటేనే రుచి.
-
నా దగ్గర వేపిన ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి కాబట్టి వాడాను, మీరు ఉల్లిపాయలని వేపుకుని ఆ నూనెలోనె మిగతా కూర చేసుకోవచ్చు.
గుత్తి వంకాయ మలాయి కుర్మా | వంకాయ అంటే ఇష్టపడే వారు తప్పక రుచి చూడాల్సిన లక్నో స్పెషల్ వంకాయ మలాయ్ కుర్మా - రెసిపీ వీడియో
Brinjal Malai Curry | Shahi Malai Baingan | Gutti Vankaya Gravy curry | How to make Shahi Malai Baingan at home
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 6 గుత్తి వంకాయలు
- 400 ml నీళ్ళు
- ఉప్పు
- కొత్తిమీర – కొద్దిగా
- 2 tbsp నెయ్యి
- 2 tbsp నూనె
- 1 బిర్యానీ ఆకు
- 4 యాలకలు
- 4 లవంగాలు
- 2 inches దాల్చిన చెక్క
- 1/2 tsp జీలకర్ర
- 1/2 tsp కారం
- 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- 1/2 tsp మిరియాల పొడి
- 1 tbsp బటర్
- 2 tbsp పాల మీగడ
-
మసాలా పేస్ట్
- 1 cup వేపిన ఉల్లిపాయలు
- 10 - 15 జీడిపప్పు
- 2 tsp కర్బూజ గింజలు
- 4 - 5 పచ్చిమిర్చి
- నీళ్ళు మెత్తగా గ్రైండ్ చేయండి
విధానం
-
వంకాయలని మధ్యకి చీరి నూనెలో 60% వేపి తీసుకోవాలి.
-
మిక్సీలో మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
-
పాన్లో నెయ్యి నూనె వేడి చేసి చెక్కా, లవంగాలు, యాలకలు, షాహీ జీరా , బిర్యానీ ఆకు అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి
-
ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి
-
గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక వేపిన వంకాయలు వేడి నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక మూతపెట్టి ఉడికించుకోవాలి.
-
నూనె పైకి తేలేక మిరియాలపొడి, బటర్, క్రీమ్ వేసి బాగా కలిపి దింపేసుకోండి.
-
ఈ కూర వేడి అన్నంలో, చపాతీ, పుల్కాలలోకి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
1 comments