రాయలసీమ వంకాయ పల్లీల పులుసు
అనుకుంటాం కానీ, రుచి కోసం ఏవేవో వేయక్కర్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు చేసే వంటకాలు తింటే చాలు రుచి ఆరోగ్యం తృప్తి. అలాంటి వెనుకటి కాలం రెసిపీనే “రాయలసీమ వంకాయ పల్లీల పులుసు” తృప్తినిచ్చే ఈ వంకాయ పులసు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
అన్నంతో రాగి సంగటి జొన్న రొట్టెలలోకి మాంచి వెజ్ రెసిపీ కావాలంటే రాయలసీమ వంకాయ పల్లీల పులుసు చేయండి, చాలా బాగుంటుంది. ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతంలోని చిత్తూర్, కర్నూల్ జిల్లాల ప్రాంతంలో ఎక్కువగా చేస్తుంటారు ఈ పులుసు.
ఈ వంకాయ పులుసు నేను రాయలసీమ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ బామ్మ చేసి పెట్టారు, అడిగితే బోలెడన్ని వివరాలు చెప్పారు. ఆ వివారాలు టిప్స్తో ఈ రెసిపీ ఉంది చూడండి.

టిప్స్
-
వేరుశెనగ కాయలు: నిజానికి రాయలసీమ ప్రాంతం లో పచ్చి శెనక్కా యలు వేసి చేస్తారు. అవి అందరికీ దొరకవు కాబట్టి నేను మామూలు శెనక్కాయలని నానబెట్టి వాడాను. ఇక్కడ మీరు వేరుశెనగకి బదులు పచ్చి అలసందలు కూడా వాడుకోవచ్చు. లేదా రాత్రంతా నానబెట్టి వాడుకోవచ్చు.
-
ఈ పులుసుకి రాయలసీమలో ముళ్ళ వంకాయలు వాడతారు, హైదరాబాదులో నాకు ముళ్ళ వంకాయలు దొరకలేదు కాబట్టి ముదురు నీలం రంగు వంకాయలు వాడాను.
-
ఈ పులుసులో తెల్ల వంకాయ ముక్కలు గుజ్జుగా అయి పులుసు చిక్కగా ముద్దకూరలా చేస్తుంది. అప్పుడు పులుసు చాలా బాగుంటుంది.
-
నిజానికి ఈ రెసిపీ ని కూర అనే అనాలి, చాలా తక్కువ మోతాదులో పులుసు ఉంటుంది, ఇంకా చిక్కగా ఉంటుంది కూడా. ఈ కర్రీలో నచ్చితే ఉసిరికాయ సైజు చింతపండు నుండి తీసిన పులుసు పోసుకుని చేసుకోండి, లేదా నాలా 2 tbsp నిమ్మరసం పిండుకుని చేసుకోండి.
రాయలసీమ వంకాయ పల్లీల పులుసు - రెసిపీ వీడియో
Brinjal Peanut Stew | Brinjal Peanut Pulusu | How to prepare Vankaya Pallila Pulusu at home
Prep Time 5 mins
Soaking Time 2 hrs
Cook Time 20 mins
Total Time 2 hrs 25 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 6 నీలం రంగు వంకాయలు
- 4 తెల్ల వంకాయ (సన్నని తరుగు)
- వేరుశెనక్కాయలు – పిడికెడు (కనీసం 2 గంటలు నానాబెట్టాలి)
- 3 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 2 చీరిన పచ్చిమిర్చి
- 2 రెబ్బలు కరివేపాకు
- 2 ఉల్లిపాయ (మీడియం సైజు)
- 1/8 tsp పసుపు
- 2 tbsp కారం
- 2 tsp ధనియాల పొడి
- కొత్తిమీర – చిన్న కట్ట
- 2 tbsp నిమ్మ రసం
- 4 టొమాటో
- 5 వెల్లులి
- 1 tbsp బెల్లం ముక్క
- 400 ml నీళ్ళు
- ఉప్పు
విధానం
-
టొమాటోలని వెల్లులిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
-
నూనె వేడి చేసి అందులో 4 గాట్లు పెట్టిన వంకాయలు వేసి 50% వేపుకుని తీసుకోండి (వంకాయ మగ్గి మెత్తబడాలి)
-
అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ సన్నని తరుగు, ఉప్పు వేసి ఉల్లిపాయ రంగు మారి మెత్తబడే దాకా మూతపెట్టి వేపుకోవాలి.
-
ఉల్లిపాయ రంగు మారాక రెండు గంటలు వేడి నీళ్ళలో నానబెట్టిన పల్లీలు వేసి 3 నిమిషాలు వేపుకోవాలి. తరువాత తెల్ల వంకాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి 2 నిమిషాలు వంకాయ ముక్కలు వేపుకోవాలి
-
2 నిమిషాలకి కారం వేగుతుంది అప్పుడు 100 ml నీళ్ళు పోసి బాగా కలిపి మూతపెట్టి వంకాయ మెత్తగా గుజ్జుగా మగ్గనివ్వాలి
-
మగ్గిన వంకాయలలో టొమాటో పేస్ట్, 300 ml నీళ్ళు పోసి సన్నని సెగ మీద 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి.
-
15 నిమిషాల తరువాత చిన్న బెల్లం ముక్క, నిమ్మరసం వేపుకున్న నీలం రంగు వంకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి 15 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించి దింపేసుకోండి.

Leave a comment ×
8 comments