వంకాయ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర వేపి మెంతి కారంలో కలిపి చేసే తెలుగు వారి స్పెషల్ పచ్చడి వంకాయ టమాటో పచ్చడి. కారంగా ఘుమఘుమలాడిపోతూ ఉండే ఈ పచ్చడి వేడి అన్నంతో అట్టు ఇడ్లీతో కూడా చాలా రుచిగా ఉంటుంది.

అన్నం మొదటి ముద్ద నెయ్యేసుకుని పచ్చడి కలిపి తింటేగాని తెలుగు వారి భోజనానికి ఒక పరిపూర్ణత రాదు.

అందుకే తెలుగు వారి భోజనం అంటే పచ్చడి ఉండాల్సిందే, అది ఊరగాయ కావొచ్చు లేదా అప్పటికప్పుడు చేసుకునే ఇలాంటి ఇన్స్టంట్ పచ్చదులైనా అవ్వొచ్చు. ఏదైనా పచ్చడి ఉండాల్సిందే నెయ్యేసి కలపాల్సిందే!

పచ్చడులని తెగ ప్రేమించే తెలుగు వారు దాదాపుగా ప్రతీ కాయ, ఆకు కూరతో పచ్చడి చేస్తారు. అలా రెండు కాయ కూరలు కలిపి చేసే పచ్చడే వంకాయ టమాటో పచ్చడి.

సాధారణంగా పచ్చడి అంటే ఏ కాయో కూరలోనో పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టి కొద్దిగా చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తారు. నేను ఈ పచ్చడికి కాస్త గుబాళింపు తగిలించాను మెంతి కారంతో, చాలా బాగుంటుంది. చేసే ముందు కింద టిప్స్ చుడండి.

Brinjal Tomato Chutney | Vankaya Tomato Pachadi

టిప్స్

వంకాయ:

గుత్తి వంకాయలు కాకుండా లేత పొడవు నీలం రంగు వంకాయలు పచ్చడికి రుచిగా ఉంటాయి. వంకాయ ముదిరితే గింజలు ఏర్పడి వగరు వస్తుంది.

టమాటో:

వంకాయలో సగం టమాటో ఉండాలి. నచ్చితే మీరు టొమాటోలు సమానంగా తీసుకోవచ్చు. కానీ ఉప్పు పులుపు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి

టమాటో నాటువై అయితే పుల్లగా చాలా బాగుంటుంది. పుల్లని టమాటోలు కానట్లైతే కాస్త చింతపండు ఎక్కువ వేసుకోవాలి.

మెంతి కారం:

మెంతులు:

వేసే ఆ కొద్దీ మెంతులు ఎర్రగా వేగితే పచ్చడికి రుచి పరిమళం, లేదంటే చేదుగా ఉంటాయి.

ఆవాలు:

ఆవాల ఘాటు ఇష్టపడే వారు కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది, నేను మితంగా వేశాను

సెనగపప్పు- మినపప్పు:

ఇవి మితం చెంచా వేసుకుంటే చాలు, కేవలం పచ్చిడిని చిక్కబరచడానికి ఇంకా కమ్మదనం కోసం మాత్రమే! ఎక్కువగా వేస్తే పచ్చడిలో వంకాయ టమాటో కంటే పప్పుల పేస్ట్ ఎక్కువగా ఉంటుంది.

పచ్చిమిర్చి - ఎండుమిర్చి:

నచ్చితే అచ్చంగా పచ్చిమిర్చితోనే పచ్చడి చేసుకోవచ్చు, లేదా నాలా ఎండుమిర్చితో చేసుకోవచ్చు. ఇంకో తీరులో అంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు.

కొత్తిమీర:

ఈ పచ్చడికి పెద్ద పిడికెడు కొత్తిమీర ఉండాలి అప్పుడే రుచి, పరిమళం.

పచ్చడి గ్రైండ్ చేసే తీరు:

పచ్చడిని కేవలం పల్స్ మీద గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోకూడదు.

వంకాయ టమాటో పచ్చడి - రెసిపీ వీడియో

Brinjal Tomato Chutney | Vankaya Tomato Pachadi | How to Make Vankay Tomato Pachadi

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 18 mins
  • Total Time 20 mins
  • Servings 7

కావాల్సిన పదార్ధాలు

  • మెంతి కారం కోసం:
  • 1.5 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/2 tsp మెంతులు
  • 7 - 8 ఎండుమిర్చి
  • 4 - 5 పచ్చిమిర్చి
  • 1 tsp పచ్చిశెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • పచ్చడి కోసం:
  • 300 gms లేత వంకాయ ముక్కలు
  • 150 gms టమాటో ముక్కలు
  • 2.5 tbsp చింతపండు గుజ్జు
  • 1 bunch కొత్తిమీర
  • ఉప్పు
  • 3 tbsp నూనె
  • తాలింపు కోసం:
  • 1.5 tbsp నూనె
  • 2 pinches ఇంగువ
  • 1 ఎండుమిర్చి
  • 2 కరివేపాకు రెబ్బలు
  • 1/2 tsp జీలకర్ర

విధానం

  1. నూనే వేడి చేసి అందులో మెంతి కారం కోసం ఉంచిన పదార్ధాలు మెంతులతో మొదలెట్టి ఒక్కోటికా వేసుకుంటూ ఎర్రగా వేపుకుని తీసుకుని మెత్తని పొడి చేసుకోండి.
  2. పచ్చడి కోసం నూనె వేడి చేసి అందులో వంకాయ ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. మగ్గిన వంకాయలో టమాటో ముక్కలు వేసి మెత్తబడే దాకా కలుపుతూ మగ్గబెట్టుకోవాలి.
  3. టొమాటోలు మెత్తబడ్డాక పసుపు చింతపండు పులుసు మెంతి కారం వేసి బాగా కలుపుకోండి. ఆ తరువాత కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి.
  4. ఒక నిమిషం తరువాత మిక్సీలో వేసుకుకోండి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు మూడు సార్లు పల్స్ చేసుకోండి. తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలు వేసి ఎర్రగా వేపి పచ్చడిలో కలుపుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • Y
    Yandrapu Anantha lakshmi
    Recipe Rating:
    Anukokunda mi recipes ae recipe follow ai chesina,anni recipes super.
  • B
    BMadhavi
    Recipe Rating:
    The recipie is perfectly done
  • J
    Jasmin patan
    Recipe Rating:
    Very nice andi... Not only me all my family mem are following ur recepies... Thank you
Brinjal Tomato Chutney | Vankaya Tomato Pachadi