బర్న్ట గార్లిక్ జీరా రైస్

Curries
5.0 AVERAGE
4 Comments

కొన్ని సార్లు బాగా తెలిసిన రెసిపీలో చేసే చిన్న మార్పులు అందరూ మెచ్చుకునేలా చేస్తుంది. అలాంటిదే ఈ బర్న్ట గార్లిక్ జీరా రైస్. జీరా రైస్ అందరికీ తెలిసనదే, ఎంతో ఇష్టంగా తినేదే! కానీ ఈ రెసిపీ వెల్లులి పరిమళంతో చాలా రుచిగా ఉంటుంది. చేయడం ఎంత తెలీకో చేసిన రెసిపీ కూడా అంతే త్వరగా ఖాళీ అయిపోతుంది.

ఈ బర్న్ట గార్లిక్ జీరా రైస్ రెసిపీలో పర్ఫెక్ట్గా పొడి పొడిగా రైస్ ఎలా వండుకోవాలో టిప్స్తో పాటు, జీరా రైస్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ కూడా ఉన్నాయ్ చూడండి.

టిప్స్

  1. జీలకర్ర నూనె మాంచి వేడి మీద ఉన్నప్పుడు వేస్తే జీలకర్ర నూనెలో వేగి చిట్లుతుంది. అలా వేగిన జీలకర్ర రుచి పరిమళం చాలా గొప్పగా ఉంటుంది.

  2. జీరా రైస్లో వేసిన వెల్లులి మంట తగ్గించి సన్నని సెగ మీద కలుపుతూ ఎర్రగా వేపుకుంటే వెల్లులి రుచి చాలా బాగుంటుంది.

  3. నేను బాస్మతి బియ్యం వాడాను. మీరు ఇంకేదైనా బియ్యం కూడా వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు.

బర్న్ట గార్లిక్ జీరా రైస్ - రెసిపీ వీడియో

Burnt Garlic Jeera Rice | Quick and Easy Jeera Rice | How to make Burnt Garlic Jeera Rice

Curries | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 5 mins
  • Total Time 6 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బాస్మతి బియ్యం (1 గంట నానబెట్టినవి)
  • 2 tsp ఉప్పు
  • జీరా రైస్ కోసం
  • 2 tsp నూనె
  • 1 tbsp నెయ్యి
  • 1 inch దాల్చిన చెక్క
  • 1 tbsp జీలకర్ర
  • 4 వెల్లులి ( సన్నని తరుగు)
  • 2 ఎండు మిర్చి
  • 2 పచ్చిమిర్చి (¼ ఇంచ్ ముక్కలు)
  • ఉప్పు – కొద్దిగా
  • 1/2 tsp మిరియాల పొడి
  • కొత్తిమీర తరుగు – చిన్న కట్ట

విధానం

  1. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద 90% ఉడికించుకోవాలి.
  2. 90% ఉడకడం అంటే మెతుకు మెదిపితే మెత్తగా నలిగి లోపల కొద్దిగా పలుకుగా ఉన్నది. ఆ స్టేజ్లో అన్నాన్ని తీసి వడకట్టి జల్లేడలో వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి. మిగిలిన 10% అన్నం చల్లారేలోగా ఉడికిపోతుంది.
  3. పాన్లో నూనె నెయ్యి వేసి బాగా వేడి చేసి అందులో దాల్చిన చెక్క, జీలకర్ర వేసి జీలకర్ర చిటచిటలాడించాలి.
  4. జీలకర్ర చిట్లిన వెంటనే మంట తగ్గించి వెల్లులి, ఎండుమిర్చి వేసి వెల్లులి బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  5. వెల్లులి వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి 30 సెకన్లు వేపుకోవాలి.
  6. తరువాత చల్లారిన అన్నం వేసి అందులో మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి హై-ఫ్లేమ్ మీద అట్లకాడతో టాస్ చేస్తే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది రైస్కి.
  7. టాస్ చేసిన రైస్ని వేడివేడిగా చోలే మసాలా, దాల్ తడ్కా, లేదా పనీర్ కర్రీతో సర్వ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments