బటర్ చికెన్ | చికెన్ మఖాని

వరల్డ్ ఫేమస్ అల్టిమేట్ బటర్ చికెన్ రెసిపీ ఎప్పుడు చేసినా 100% బెస్ట్ టెస్ట్తో కావాలంటే నా స్టెప్స్ టిప్స్ ఫాలో అవ్వండి. బటర్ చికెన్ తందూర్ లేకుండా కూడా అదే రుచి వస్తుంది. బెస్ట్ బటర్ చికెన్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి

“బటర్ చికెన్” అనగానే ఎవ్వరికైనా ప్రాణం లేచోస్తుంది. ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా నా టిప్స్తో చేయలేగాని బెస్ట్ బటర్ చికెన్ గారంటీ. నా రెసిపీ రెస్టారంట్ స్టైల్ కంటే బెటర్ టెస్ట్ వస్తుంది అని కచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే ప్రస్తుతం రెస్టారెంట్స్లో సంప్రదాయ పద్ధతిలో చేసే బటర్ చికెన్ చేయడం మానేశారు కాబట్టి. మిగిలిన గ్రిల్ చికెన్లో లేదా తందూర్లో చికెన్ని గ్రిల్ చేసి బటర్ చికెన్ గ్రేవీ వేసి హై ఫ్లేమ్ మీద ఉడికించి పైన బటర్ వేసి ఇస్తున్నారు కాబట్టి. ఈ పద్ధతి వల్ల ఫ్లేవర్స్ అంత బాగా ఇంకవు చికెన్కి.

నిజానికి బటర్ చికెన్ కోసం చికెన్ గ్రిల్ తందూర్లోనే చేయాలి, అప్పుడు బటర్ చికెన్ స్మోకీ ఫ్లేవర్తో ప్రేత్యేకమైన రుచితో ఉంటుంది. ఒవెన్స్లో గ్రిల్ మోడ్లో కూడా చికెన్ గ్రిల్ చేసి బటర్ చికెన్ చేసుకోవచ్చు, కానీ తందూర్లో చికెన్ గ్రిల్ చేస్తే వచ్చే స్మోకీ ఫ్లేవర్ రాదు. నేను పాన్ మీద చేస్తూనే సంప్రదాయ పద్ధతిని పాడుచేయకుండా బెస్ట్ బటర్ చికెన్ రెసిపీ చెప్తున్నా. చేసే ముందు టిప్స్ని స్టెప్స్ని ఫాలో అవుతూ చేయండి, బెస్ట్ బటర్ చికెన్ ఎంజాయ్ చేయండి.

Butter Chicken Recipe | Murgh Makhani | How to make Chicken Makhani

టిప్స్

చికెన్:

  1. బటర్ చికెన్కి బోన్- బోనలేస్స్ చికెన్ ఏదైనా వాడుకోవచ్చు. నేను బోన్లెస్ చికెన్ వాడాను.

  2. చికెన్కి మసాలాలు పట్టించి రాత్రంతా ఫ్రిజ్లో ఉంచితే చికెన్ మసాలాలని పీల్చి చాలా రుచిగా ఉంటుంది కర్రీలో చికెన్. కూరని వారు కనీసం నాలుగు గంటలైనా ఉంచాలి ఫ్రిజ్లో

గ్రిల్:

  1. సంప్రదాయ పద్దతిలో బటర్ చికెన్ కోసం బోన్స్ చికెన్ని తందూర్లో గ్రిల్ చేసి వాడతారు, మీకు నచ్చితే బోన్లెస్ చికెన్ వాడుకోవచ్చు

  2. నేను చికెన్ని గ్రిల్ చేయడానికి గ్రిల్ పాన్ వాడాను, గ్రిల్ పాన్ మీద కూడా చికెన్ పాన్ మీద వేసి కదపకుండా వదిలేస్తే 5 నిమిషాలకి చికెన్ ఒక వైపు చక్కగా గ్రిల్ అవుతుంది, తారువాత మరో వైపు తిప్పి 80% గ్రిల్ చేసుకోవాలి లో-ఫ్లేమ్ మీదే. బోన్లెస్ గ్రిల్ అవ్వడానికి టైమ్ పడుతుంది, అందుకే లో ఫ్లేమ్ మీదే గ్రిల్ చేసుకోవాలి. 80% గ్రిల్ అవ్వడం అంటే ఫోఏక గుచ్చి చూస్తే తెలుస్తుంది చికెన్ లోపలికి ఫోర్క్ సులభంగా దిగుతుంది. చికెన్ గ్రిల్ చేసిన తరువాత ముక్కలు కొస్తే చికెన్లో నీరు ఉండాలి. నీరు అంతా ఇగిరిపోయేదాక గ్రిల్ చేస్తే ముక్కలు గట్టిగా అవుతాయ్, అప్పుడు చికెన్కి గ్రేవీ ఫ్లేవర్స్ ఏవి పట్టవు.

  3. ఓవెన్లో గ్రిల్ చేసే వారు 220 డిగ్రీస్ దగ్గర 20 నిమిషాలు గ్రిల్ చేసుకోండి చాలు

బటర్:

  1. వాస్తవానికి బటర్ చికెన్ కాస్త కేలరీస్ ఉన్న రెసిపీనే!!! ఎప్పుడైనా ఒక్కసారి తృప్తిగా మనసారా అసలైన రుచిని ఆస్వాదించాలంటే ఈ మాత్రం బటర్ వేసి చేయాలీ అప్పుడే రుచి.

తేనె:

  1. ఫ్లేవర్స్ ని బాలన్స్ చేయడానికి ఆఖరున కొద్దిగా తేనె వేస్తారు సంప్రదాయ పద్ధతిలో చేసే బటర్ చికెన్లో. తేనె నచ్చని వారు అందుబాటులో లేని వారు పంచదార వేసుకోవచ్చు. కానే తేనె రుచి తేనేదే!!!

స్మోక్ ఫ్లేవర్ కోసం:

  1. స్మోకీ ఫ్లేవర్ కోసం నేను కాల్చిన కొబ్బరి పెంకులు ఒక కప్పులో పెట్టి కూర మధ్యలో కప్పు ఉంచి దాని మీద నెయ్యి గరం మసాల చల్లి 3 నిమిషాలు ఉంచి తీసేశాను, ఇలా చేస్తే సంప్రదాయ పద్ధతిలో బటర్ చికెన్కి ఉండే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఉంటే మీరు బొగ్గు ముక్కలు కూడా వాడుకోవచ్చు, లేదా స్మోక్ గన్ మెషీన్తో కూడా స్మోక్ ఫ్లేవర్ ఇవ్వచ్చు.

ఆఖరుగా :

  1. నేను హెరిటేజ్ బ్రాండ్ వారి ప్రీమియం గడ్డ పెరుగు వాడాను కాబట్టి పెరుగుని బట్టలో వేసి 2 గంటలు వడకట్టకుండా వాడుకోవచ్చు. ఒక వేళ మీరు మామూలు పెరుగు వాడాలనుకుంటే కాటన్ బట్టలో పెరుగు వేసి మూట కట్టి జల్లెడలో పెట్టి ఫ్రిజ్లో 2-3 గంటలు వదిలేస్తే పెరుగులోని నీరు దిగి పనీర్ లాంటి గడ్డ పెరుగు వస్తుంది దాన్ని వాడుకోండి.

  2. బటర్ చికెన్ మామూలు మసాలా చికెన్ కర్రీలకి మల్లె ఘాటుగా కారంగా ఉండదు. ఎక్కువ ఫ్లేవర్స్తో కారం తక్కువగా వెన్న కమ్మదనంతో ఉంటుంది

Butter Chicken Recipe | Murgh Makhani | How to make Chicken Makhani

బటర్ చికెన్ | చికెన్ మఖాని - రెసిపీ వీడియో

Butter Chicken Recipe | Murgh Makhani | How to make Chicken Makhani

Restaurant Style Recipes | nonvegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 4 hrs
  • Cook Time 40 mins
  • Total Time 4 hrs 45 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ నానబెట్టడానికి
  • 350 gms బోన్లెస్ చికెన్
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/2 చెక్క నిమ్మరసం
  • ఉప్పు – కొద్దిగా
  • 2 tbsp ఆవ నూనె
  • 1/4 tsp నల్ల ఉప్పు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp కారం
  • 1 tsp కాశ్మీరీ కారం
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1/2 tsp కసూరి మేథి
  • 4 tbsp గడ్డ పెరుగు
  • 1/2 tsp యాలకల పొడి
  • 1/2 tsp ఆంచూర్ పొడి
  • గ్రేవీ కోసం
  • 4 టొమాటో (250 gms)
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • బిర్యానీ ఆకు – సగం
  • 1/2 ఇంచు అల్లం
  • 5 వెల్లులి
  • ఉప్పు
  • 1/4 tsp పంచదార
  • 15 జీడిపప్పు
  • 1/2 cup ఉల్లిపాయ చీలికలు
  • 3 tbsp హెరిటేజ్ బటర్
  • 4 కాశ్మీరీ మిరపకాయలు
  • 1/2 tsp మిరియాలు
  • 250 ml నీళ్ళు
  • చికెన్ గ్రిల్ చేయడానికి
  • 1 tbsp నూనె
  • 1 tsp బటర్
  • చికెన్ కర్రీ కోసం
  • 2 tbsp నూనె
  • 3 tsp బటర్
  • 1 tsp కాశ్మీరీ కారం
  • 1 tsp కారం
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 400 ml నీళ్ళు
  • సాల్ట్
  • 1 tsp కసూరి మేథి
  • 2 tsp బటర్
  • 3 tbsp ఫ్రెష్ క్రీమ్
  • 1 tbsp తేనె
  • కాల్చిన కొబ్బరి పెంకులు/ బొగ్గు ముక్కలు
  • 2 చిటికెళ్లు గరం మసాలా
  • 3 బొట్లు నెయ్యి

విధానం

  1. చికెన్ బ్రెస్ట్ని ¼ ఇంచ్ వెడల్పు 80% లోతుగా గాట్లు పెట్టుకోండి. గాట్లు పెట్టుకున్న చికెన్లో అల్లం వెల్లులి పేస్ట్ నిమ్మరసం, ఉప్పు వేసి బాగా రుద్ది పట్టించి పక్కనుంచుకోండి.
  2. మరి గిన్నెలో ఆవ నూనెలో కాశ్మీరీ కారం వేసి గడ్డలు లేకుండా బాగా కలిపి హెరిటేజ్ ప్రీమియం గడ్డ పెరుగు లేదా హంగ్ పెరుగుతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపండి.
  3. తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసిన చికెన్ వేసి మసాలాలు బాగా రుద్ది బాగా రాత్రంతా లేదా నాలుగు గంటలు ఫ్రిజ్లో ఉంచండి.
  4. గిన్నెలో గ్రేవీ కోసం ఉంచిన సామగ్రీ అంతా కలిపి ఒకే సారి వేసి కరిగిన బటర్లో 3 నిమిషాలు వేపుకోండి.
  5. వేగిన టొమాటోలో నీళ్ళు పోసి జీడీపప్పు మెత్తగా అయ్యేదాక సన్నని సెగ మీద మూతపెట్టి ఉడికించుకోండి. తరువాత వెన్నలాంటి పేస్ట్ చేసుకోండి.
  6. చికెన్ గ్రిల్ చేయడానికి గ్రిల్ పాన్ లేదా అట్ల పెనం మీద నూనె బటర్ వేసి కరిగించి నాలుగు గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్లో నానుతున్న చికెన్ ఉంచి హై ఫ్లేమ్ మీద కదపకుండా వదిలేయండి. బోన్లెస్ చికెన్ మాడదు.
  7. 5 నిమిషాల తరువాత చికెన్ తిరగతిప్పి మంట పూర్తిగా తగ్గించి 80% గ్రిల్ చేసుకోవాలి. (80% గ్రిల్ అవ్వడానికి 20 నిమిషాల టైమ్ పడుతుంది) చికెన్ పర్ఫెక్ట్ గ్రిల్ టిప్స్ చూడండి.
  8. గ్రిల్ అయిన చికెన్ని పెద్ద ముక్కలుగా కోసుకోండి.
  9. కర్రీ కోసం పాన్లో నూనె బటర్ వేసి కరిగించి అందులో కాశ్మీరీ కారం, వేయించిన జీలకర్ర పొడి వేసి వేపుకోవాలి.
  10. జల్లెడలో టొమాటో గుజ్జు వేసి వడకట్టి 400 ml నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద నురగ పైకి తేలేదాక ఉడకనివ్వాలి, పొంగుతున్న నురగని తీసేయాలి. తరువాత గ్రేవీని చిక్కబడనివ్వాలి.
  11. చిక్కబడ్డ గ్రేవీలో గ్రిల్ చేసుకున్న చికెన్ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బటర్ పైకి తేలేదాక సన్నని సెగ మీద ఉడికించుకోవాలి.
  12. బటర్ పైకి తేలాక కసూరి మేథి నాలిపి వేసుకోండి, ఇంకా 2 tsp బటర్, 3 tbsp ఫ్రెష్ క్రీమ్, తేనె వేసి బాగా కలిపి కూర మధ్యలో గిన్నె పెట్టి అందులో బొగ్గు ముక్క పెట్టి దాని మీద గరం మసాలా, నెయ్యి బొట్లు వేసి మూత పెట్టి సన్నని మంట మీద 3 నిమిషాలు ఉడికించి కప్ తీసేయండి.
  13. తరువాత వేడి వేడి బటర్ చికెన్ పైన కొద్దిగా క్రీమ్తో అలంకరించి రోటీ, నాన్తో సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

322 comments

Butter Chicken Recipe | Murgh Makhani | How to make Chicken Makhani