Curries
5.0 AVERAGE
3 Comments

ఇండో- చైనీస్ రెసిపీస్లో మరో ఫేమస్ రెసిపీ చిల్లీ పనీర్ గ్రేవీ! హక్కా నూడ్లుల్స్ లేదా ఫ్రైడ్ రైస్ తో బెస్ట్ గా ఉంటుంది ఈ గ్రేవీ. స్పైస్ని ఇష్టపడే వాళ్ళు తప్పక ఇది ఎంజాయ్ చేస్తారు. చిల్లీ పనీర్ గ్రేవీ రెసిపి వీడియో తో పాటు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ తో ఉంది.

Chilli Paneer Gravy | How to make Chilli Paneer Gravy recipe | Homemade Chilli Paneer

టిప్స్

• పనీర్ నీరుతో పల్చగా కోటింగ్ పట్టించాలి.

• కోట్ అయిన పనీర్ వేడి నూనె లో వేసి లైట్ గోల్డెన్ కలర్ లోకి వేగి కాస్త క్రిస్ప్ అవ్వాలి అందాక వేపాలి. మరీ ఎర్రగా వేపితే గట్టిగా ఉంటాయ్ పనీర్ ముక్కలు సాస్ లో వేసాక కూడా.

• కోటింగ్ లో మైదా, కార్న్ ఫ్లోర్ వాడాను. నన్ను అందరూ మైదా కి బదులు బియ్యం పిండి వాడుకోవచ్చా అని అడుగుతుంటారు. బియ్యం పిండి వాడితే పనీర్ని గట్టిగా అయ్యి సాస్లు లోపలి పోక గట్టిగా ఉండిపోతుంది పనీరు. కాబట్టి మైదా, కార్న్ ఫ్లోర్ వాడుకోండి.

• ఈ రెసిపీ లో చైనీస్ చిల్లి పేస్టు వాడాలి, లేదంటే షెజ్వాన్ సాస్ వాడాలి. షెజ్వాన్ సాస్ రెసిపీ నేను ఇది వరకే చేశా చుడండి

• సాసులకి బదులు కారం వాడకండి

• ఇందులో వేసే ఉల్లిపాయలు, కాప్సికం పాయలుగా వేసి హై-ఫ్లేం మీద ఫ్రై చేస్తే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది రెసిపీ కి.

• ఉల్లికాడలు 1 ఇంచ్ పొడవువి సన్నని తరుగు రెండూ వేస్తే రుచి బాగుంటుంది

• ఇందులో నేను ఆరోమేటిక్ పొడి వాడాను. ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇది అజినోమోటోకి బదులుగా వాడాను. దొరకకపోతే అజినోమోటో వాడుకోవచ్చు, లేదా వదిలేయోచ్చు

• ఇందులో ఇంకా రెండు చిటికెళ్ళ పంచదార వాడాను. ఆ కొంచెం ఫ్లేవర్స్ ని చాలా బాగా బేలన్స్ చేస్తుంది.

• మీరు పనీర్ కి బదులు తోఫూ కూడా వాడుకోవచ్చు

Chilli Paneer Gravy | How to make Chilli Paneer Gravy recipe | Homemade Chilli Paneer

చిల్లి పనీర్ గ్రేవీ - రెసిపీ వీడియో

Chilli Paneer Gravy | How to make Chilli Paneer Gravy recipe | Homemade Chilli Paneer

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • పనీర్ కోటింగ్ కి
  • 1 tsp మైదా
  • 1.5 tsp కార్న్ ఫ్లోర్
  • 1/4 tsp మిరియాల పొడి
  • 2 tsp నీళ్ళు
  • 200 gms పనీర్
  • నూనె -వేపుకోడానికి
  • గ్రేవీ కోసం
  • 2 tbsps నూనె
  • 1 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 4 పచ్చిమిర్చి ముక్కలు
  • 1.5 tsp వెల్లూలి తరుగు
  • 1 tsp అల్లం తరుగు
  • 2 tbsp ఉల్లిపాయ సన్నని తరుగు
  • చిన్న ఉల్లిపాయ పాయలు
  • 2 tbsps సన్నని ఉల్లికాడల తరుగు
  • 10-15 అంగుళం సైజు ఉల్లికాడల తరుగు
  • 10-15 కాప్సికం క్యూబ్స్
  • ఉప్పు
  • 1 tsp డార్క్ సోయా సాస్
  • 1.5 tsp గ్రీన్ చిల్లి సాస్
  • 1.5 tsp చిల్లి పేస్టు/షెజ్వాన్ సాస్
  • 1 tsp టమేటా సాస్
  • 1 tsp వైట్ పెప్పర్ పొడి
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1 tsp ఆరోమేటిక్ పౌడర్
  • 300 ml నీళ్ళు
  • 1 tbsp కార్న్ ఫ్లోర్
  • పంచదార- రెండు చిటికేళ్ళు

విధానం

  1. మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలుపుకుని పనీర్ ముక్కలు వేసి చెంచాతో పొడి పిండి పట్టించండి .
  2. తరువాత నీళ్ళు వేసి పనీర్ కి పిండి పెట్టేలా చెంచాతో లేదా గిన్నె తిప్పుతూ పట్టించండి.
  3. పనీర్ ముక్కలని వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద లైట్ గోల్డెన్ కలర్ ఇనాక్ పై పిండి క్రిస్ప్ అయ్యేదాకా వేపుకుని తీసుకోండి.
  4. పాన్లో నూనె వేడి చేసి అందులో వెల్లూలి, అల్లం, పచ్చిమిర్చి ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయల్ని మెత్తబడే దాక వేపుకోవాలి
  5. ఇప్పుడు ఉల్లిపాయ,కాప్సికం పాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి హై ఫ్లేం మీద 2-3 నిమిషాలు మగ్గనివ్వండి
  6. తరువాత మిగిలిన సాస్లు, పొడులు అన్నీ వేసి నూనె పైకి తేలేదాకా హై-ఫ్లేం మీద కలుపుతూ వేపుకోవాలి.
  7. నూనె పైకి తేలాక 300 ml నీళ్ళు పోసి అందులో హై-ఫ్లేం మీద తెర్ల కాగనివ్వాలి. 2-3 నిమిషాలు మరిగాక పనీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు మరనివ్వాలి.
  8. మరుగుతున్న గ్రేవీలో 1 tbsp కార్న్ ఫ్లోర్ లో 3 tbsps నీరు వేసి కలిపిన నీరు 1.5 tbsps పోసుకుని కలిపి రెండు నిమిషాలు హై ఫ్లేం మీద మరిగిస్తే చిక్కబడుతుంది గ్రేవీ.
  9. గ్రేవీ చిక్కబడగానే అంగుళం సైజు ఉల్లికాడల ముక్కలు వేసి మరో నిమిషం మరిగించి, ఆ తరువాత సన్నని ఉల్లికాడల ముక్కలు చల్లి దింపి సర్వ్ చేసుకోవడమే.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

Chilli Paneer Gravy | How to make Chilli Paneer Gravy recipe | Homemade Chilli Paneer