ఈసీ గోరుచిక్కుడు కాయ వేపుడు

Curries
5.0 AVERAGE
4 Comments

సహజంగా గోరుచిక్కుడు అనగానే పెద్ద వెరైటీ వంటకాలేమీ చేయరు, చాలా మంది పీచు పదార్ధాలతో ఉండేగోరుచిక్కుడు తినరు, ఇలా చేసి పెడితే తప్పక అడిగి మరీ చేయించుకుని తింటారు. ఈ రెసిపి చాలా సింపుల్. ఆఫీసులకి వెళ్ళేవారికి, బ్యాచిలర్స్ కి బెస్ట్. ఇంకా రోజూ వారీ కూరలు రుచిగా చేసుకోవాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఈ గోరుచిక్కుడు కాయ వేపుడు.

టిప్స్

  1. గోరుచిక్కుడు: లేత గోరుచిక్కుళ్ళు వాడితే కూర చాలా రుచిగా ఉంటుంది.

  2. నేను గోరుచిక్కుళ్ళు ఈనెలు తీయకుండా కాయలుగానే ఉడికించాను. ఈనెలు తీసి కూడా వండుకోవచ్చు, కానీ 80 % వాండాలి ఈ కూరకి అలాంటప్పుడు ముక్కలు త్వరగా ఉడికి వేపుడులో చిదురవుతాయ్. అందుకే కాయలు కాయలుగానే వండేశాను.

  3. గసగసాలు:కొన్ని దేశాలలో గసగసాలు అందుబాటులో ఉండవు, ఆలాంటి వారు వేపిన సెనగపప్పు వాడుకోవచ్చు. కానీ గసాల కమ్మదనం గసాలదే.

  4. గాసాలు వేశాక కూరని మధ్యమధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగుపట్టేస్తుంది.

  5. ఆప్షన్స్: ఇలాగే చిక్కుడుకాయలు, దొండకాయతో చేసుకోవచ్చు.

ఈసీ గోరుచిక్కుడు కాయ వేపుడు - రెసిపీ వీడియో

Easy Cluster Beans Fry | Gawar Ki Sabzi Recipe| Cluster beans recipe (Goruchikkudu recipe)

Curries | vegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms గోరుచిక్కుడు కాయలు
  • 1 tsp ఉప్పు
  • నీళ్ళు – ఉడికించుకోడానికి
  • గసాగసాల కారం కోసం
  • 7-8 ఎండుమిర్చి
  • 1 tbsp గసగసాలు
  • ఎండుకొబ్బరి
  • ఉప్పు
  • వేపుడు కోసం
  • 1/4 cup నూనె
  • 3/4 cup ఉల్లిపాయ తరుగు
  • 3 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 2 చిటికెళ్లు పసుపు
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • 2 చిటికెళ్లు గరం మసాలా
  • కొత్తిమీర – కొద్దిగా

విధానం

  1. గోరుచిక్కుడు కాయాల్లో నీళ్ళు ఉప్పు వేసి 80 % ఉడికించి నీళ్ళని ఓంపేసి చల్లరనివ్వాలి
  2. చల్లారిన గోరుచిక్కుడు కాయల ఈనెలు తీసేసి అంగుళం కన్నా కాస్త పెద్దగా ముక్కలు కోసుకోవాలి
  3. మిక్సీలో గసాల కోసం ఉంచిన సామానంతా వేసి మెత్తని పొడి చేసుకోవాలి
  4. ముకుడులో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మెత్తబడే దాక వేపుకోవాలి
  5. అందులో అల్లం- వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి
  6. ఈనెలు తీసేసిన గోరుచిక్కుడు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి 3-4 నిమిషాల పాటు చిక్కుడుకాయ లోని చెమ్మారే దాకా వేపుకోవాలి.
  7. 3-4 నిమిషాల తరువాత గసాల కారం, కొత్తిమీర తరుగు వేసి బాగా పట్టించి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి.
  8. దింపేముందు 2 చిటికెళ్ల గరం మసాలా వేసి కలిపి దింపేసుకోవాలి
  9. ఇది అన్నం చపాతీల్లోకి రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • D
    Deepa madhu
    Recipe Rating:
    Very tasty and easy recipe 😋. Thank you for your recipe.
  • S
    sowjanyap
    ur recipes for all kind of vegetable is awesome simply superb istam leni kuragaya kuda ruchi thepinchi vandetau chesaru sir i really like ur post
  • S
    sowjanyap
    ur recipes for all kind of vegetable is awesome simply superb istam leni kuragaya kuda ruchi thepinchi vandetau chesaru sir i really like ur post
  • D
    Deepthi Vasu
    Recipe Rating:
    Your recipes are so tasty and any one do it. sir your are showing easy and best methods Thank you sir for sharing the best methods
Easy Cluster Beans Fry | Gawar Ki Sabzi Recipe| Cluster beans recipe (Goruchikkudu recipe)