కమ్మని వెన్న బియ్యం పిండి వేసి చేసే మురుకులు తినడానికి సమయం ఆకలితో పనిలేదు. అలా తినడం మొదలెడితే ఎన్ని తిన్నా తింటూనే ఉండేంత రుచిగా ఉంటాయి తెలుగు వారి వెన్న మురుకులు. బయట మరింత కరకరలాడుతూ లోపల గుల్లగా నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయేలా ఉంటాయి.

బియ్యం పిండి లో వెన్న వేసి చేసే మురుకులు దక్షిణ భారతదేశం అంతటా చేస్తారు. కానీ రాష్ట్రానికి తగినట్లు చిన్న మార్పులతో ఉంటాయి. ఈ వెన్న మురుకులు మా ఇంటి తీరు. ఇదే వెన్న మురుకులు తమిళులు బియ్యం పిండితో పాటు సెనగపిండి వేసి చేస్తారు. తెలుగు వారు అచ్చంగా బియ్యం పిండితో చేస్తారు.

మురుకులు సాధారణంగా బియ్యం పిండితో ఎక్కువుగా చేస్తారు, సెనగపిండితో చాలా తక్కువగా చేస్తారు దక్షిణాది వారు. సాధారణంగా ఏ మురుకులలో అయినా కాసింత వెన్న వేస్తారు. కానీ వెన్న మురుకుల్లో వేసే వెన్న మోతాదు ఎక్కువ ఇంకా కారం వేయరు. ఇవి వాము ఘాటుతో తెల్లగా ఉంటాయి.

ఈ సింపుల్ మురుకులు ఎ కొలతకి చేసినా పర్ఫెక్ట్గా ఎలా వేపాలి లాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయ్ చేసే ముందు తప్పక టిప్స్ చూసి చేయండి.

టిప్స్

బియ్యం పిండి:

బియ్యం పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి. బజార్ నుండి తెచ్చినఆ లేదా మర ఆడించి పట్టించినా కచ్చితంగా బాగా జల్లించండి. అప్పుడు పిండి రవ్వగా లేకుండా ఉంటుంది.

వెన్న:

నేను ఇంట్లో పెరుగు మీద తీసిన మీగడని చిలికిన వెన్న వాడాను. నిజానికి పాకెట్లో దొరికే ప్రోస్డ్ వెన్న కంటే తెల్ల వెన్న రుచిగా ఉంటుంది. ఒక వేళా మీ దగ్గర ఇంట్లో చేసిన వెన్న లేనట్లయితే పాకెట్స్లో దొరికే తెల్ల వెన్న అయినా వాడుకోండి.

½ కిలో పిండికి సుమారు 80-100 వెన్న సరిపోతుంది. ఇంత కంటే వెన్న ఎక్కువ వేస్తే ఎక్కువ గుల్ల ఏర్పడి నూనెలో మురుకులు పడగానే విరిగిపోతాయి

కారం:

ఈ మురుకుల్లో ఎండు కారం వేయరు. కమ్మని వాము ఘాటే!!! కారం కావాలనుకుంటే పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసి బట్టలో వేసి గట్టిగా పిండి ఆ నీళ్ళని వాడుకుంటే మురుకులు తెల్లగా ఉంటాయి రంగుతో ఎలా ఉన్నా పర్లేదంటే యందు వేసుకోండి

నీళ్లు:

మురుకుల గుల్ల అంతా నీళ్లతో పిండిని తడపడంలోనే ఉంది. ఇది చాలా ముఖ్యం పిండిలో కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎక్కువ సేపు పిండిని వత్తుకోవాలి. అప్పుడు మురుకులు చాలా గుల్లగా వస్తాయ్. నీరు ఎక్కువైతే నూనె లాగేస్తాయ్, తక్కువైతే ఎండిపోయినట్లుగా అంత రుచిగా ఉండవు మురుకులు.

వేపే తీరు:

మురుకులు ఎప్పుడు బాగా వేడెక్కిన నూనెలో వత్తి మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి బుడగలు తగ్గేదాకా వేపుకోవాలి.

హై ఫ్లేమ్ మీద వేపితే త్వరత్వరగా రంగొచ్చేస్తాయ్, కానీ లోపల గుల్ల ఏర్పడదు మెత్తగా ఉంటాయి మురుకులు. అందుకే మీడియం ఫ్లేమ్ మీద వేపితే నెమ్మదిగా వేగి కరకరలాడుతూ ఉంటాయి మురుకులు.

వేపిన తరువాత ఏ కారణం చేతనైనా మురుకులు మెత్తగా అనిపిస్తే, మరేం పర్లేదు వేడెక్కిన నూనెలో మెత్తబడిన మురుకులు వేసి మరో సారి వేపితే కరకరలాడుతూ వస్తాయ్.

వెన్న మురుకులు - రెసిపీ వీడియో

Butter Murukku | Venna murukulu | Crunchy Andhra Snack | How to Make Crunchy Andhra Snacks

Snacks | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Total Time 30 mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 450 gms బియ్యం పిండి - మూడు కప్పులు
  • 80 - 100 తెల్ల వెన్న
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 2 tsp నువ్వులు
  • 1 tsp వాము
  • 425 ml నీళ్లు
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. బియ్యం పిండిలో వెన్న వేసి బాగా రుద్దాలి.
  2. తరువాత మిగిలిన సామాగ్రీ అంతా వేసి కలుపుకోవాలి.
  3. పిండిలో కొద్దికొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మెత్తగా తడుపుకోవాలి. పిండి ఎంత ఎక్కువసేపు వత్తితే అంత బాగా వస్తాయ్ మురుకులు.
  4. నూనె బాగా వేడి చేసి మురుకుల గొట్టంలో పిండి పెట్టి వత్తేయండి.
  5. పిండి వత్తిన తరువాత మీడియం ఫ్లేమ్ మీద బుడగలు తగ్గేదాక వేపుకోవాలి.
  6. నూనెలో మురుకులు పైన బుడగలు తగ్గాక తీసి బుట్టలో వేసి గాలికి చల్లారనివ్వాలి, ఆ తరువాత గాలి చొరని డబ్బాలో ఉంచితే 15 రోజులు తాజాగా ఉంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

Butter Murukku | Venna murukulu | Crunchy Andhra Snack