బొప్పాయి క్యాబేజీ సలాడ్ | మంచి స్కిన్, వెయిట్ లాస్ కోసం
బరువు తగ్గాలనుకున్నా, పొట్టకి హాయిగా ఉండే ఆహారం ఏదైనా తినాలనుకుంటే కేబేజ్ బొప్పాయ్ సలాడ్ ట్రై చేయండి. ఈ సింపుల్ సాలాడ్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది.
ఈ సింపుల క్యాబేజ్ సాలాడ్ చాలా హేల్తి, చాలా టేస్టీ. ఏదైనా లైట్ గా తినాలనిపించినా, డైటింగ్ లో ఉన్నా ఇది పర్ఫెక్ట్.
జస్ట్ 5 నిమిషాల్లో రెడీ. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా, లేదా డైటింగ్ లోని వారు లంచ్ కి లేదా డిన్నర్ గా తీసుకోవచ్చు.
 
 
 
    టిప్స్
• బొప్పాయి, క్యాబేజీ తురుము పూర్తిగా కుక్ చేయకూడదు, జస్ట్ 2-3 నిమిషాలు చేసుకోవాలి • మీకు నచ్చితే మిర్చికి బదులు మిరియాల పొడి వాడుకోవచ్చు • పల్లీల పొడి కాస్త పలుకుగా ఉండేలా చుస్కుంటే తినేప్పుడు చాలా బావుంటుంది
బొప్పాయి క్యాబేజీ సలాడ్ | మంచి స్కిన్, వెయిట్ లాస్ కోసం - రెసిపీ వీడియో
Cabbage Papaya Salad | Best food for Weight Loss | Quick and Healthy Cabbage Papaya Salad Recipe | Salads for Weight Loss
      Healthy Recipes 
       | 
      vegetarian
          
        - Prep Time 5 mins 
- Cook Time 7 mins 
- Total Time 12 mins 
- Servings 2 
కావాల్సిన పదార్ధాలు
- 3/4 cup చెక్కు తీసుకున్న పచ్చి బొప్పాయి తురుము
- 3/4 cup క్యాబేజీ తురుము
- 1 పచ్చిమిర్చి
- 2 tbsp వేయించిన పల్లీల పొడి
- 3/4 tsp ఆవాలు
- 1 tbsp నూనె
- 1/2 cup దానిమ్మ గింజలు
- 1 tbsp నిమ్మ రసం
- 2 tbsp కొత్తిమీర
విధానం
- 
          
           
            నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటమన్నాక చీరిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి
           
                      
- 
          
           
            ఆ తరువాత  పచ్చి బొప్పాయి తురుము, క్యాబేజీ తురుము సాల్ట్  వేసి 2-3 నిమిషాలు లో ఫ్లేం మీద ఫ్రీ చేసుకోండి
           
                      
- 
          
           
            తరువాత స్టవ్ ఆఫ్ చేసి దానిమ్మ గింజలు, వేయించిన పల్లీల పొడి, నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి కలుపుకుని సర్వ్ చేసుకోండి
           
                      
 
 
 రెసిపీ ప్రింట్ చేయడానికి
రెసిపీ ప్రింట్ చేయడానికి 
Leave a comment ×
2 comments