క్యాబేజీ పరాటా రెసిపీ | క్యాబేజీ పరోటా రెసిపీ | విస్మయ్ ఫుడ్

క్యాబేజీ పరాటా రెసిపీ -క్యాబేజీ తురుముని గట్టిగా నీరు పిండేసి అందులో గోధుమ పిండి ఇంకొన్ని మసాలాలు కలిపి మెత్తగా వత్తి చేసే క్యాబేజీ పరాటా గంటల తరువాత కూడా ఎంతో మృదువుగా ఉంటుంది.

రోజూ త్వరగా అయిపోయే మాంచి లంచ్ బాక్సు రెసిపీ కోసం వెతికే వారికి పర్ఫెక్ట్ ఈ క్యాబేజీ పరాటా.

ఈ క్యాబేజీ పరాఠా రెసిపీకున్న గొప్ప విషయం ఏంటంటే దీనికి ప్రత్యేకించి ఎలాంటి సైడ్ డిష్ అవసరంలేదు, కమ్మని పెరుగు ఆవకాయ ఉంటె చాలు.

పరాటాలు చాలా ఉన్నాయ్ అన్నీ వేటికవే ప్రేత్యేకం అలాగే ఇది కూడా, క్యాబేజీ ఇష్టపడని వారు ఈ రెసిపీ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.

టిప్స్

క్యాబేజీ

• క్యాబేజీ ని మీడియం సైజు రంధ్రాలున్న వైపు తురుముకోండి. మరీ సన్నని రంధ్రాలున్న వైపు తురుమితే నీరు పిండాక ఇంకా రవ్వగా ఉన్నట్లుగా ఉంటుంది. 

క్యాబేజీకి బదులు ఇదే తీరులో ఇంకేమి చేసుకోవచ్చు:

• క్యాబేజీకి బదులుగా మీరు బ్రొకోలీ, కాలీఫ్లవర్, కేరట్ ఇదే తీరులో నీరు పిండేసి చేసుకోవచ్చు. 

పిండి వత్తుకునే తీరు:

• ఈ పరాటాకి నీరు ఎక్కువగా అవసరం అవ్వదు. ముందు క్యాబేజీలోని నీటిని పిండేయగా వచ్చిన నీటిని వాడుకుని ఆ తరువాత కొద్దిగా నీరు చెమ్చాలతో వేసుకోండి.

క్యాబేజీ పరాటా రెసిపీ | క్యాబేజీ పరోటా రెసిపీ | విస్మయ్ ఫుడ్ - రెసిపీ వీడియో

Cabbage Paratha Recipe | Easy Cabbage Parata for Lunch Box | Cabbage Parotta | Vismai Food

Breakfast Recipes | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 15 mins
  • Resting Time 30 mins
  • Total Time 55 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup క్యాబేజీ (తురుము)
  • ఉప్పు - రుచి కి తగినంత
  • 1/4 tsp జీలకర్ర
  • 1 tbsp కొత్తిమీర తరుగు
  • 1/2 tsp వెల్లులి తురుము
  • 1/2 tsp అల్లం తురుము
  • 1/2 tsp పచ్చిమిర్చి పేస్ట్
  • 1/2 tsp కారం
  • 1 tsp కరివేపాకు తరుగు
  • నీరు - కొద్దిగా
  • 2 cups గోధుమ పిండి
  • నూనె - పరాటా కాల్చుకోడానికి

విధానం

  1. క్యాబేజీని ఒక కప్పు తురుముకోండి. క్యాబేజీ తురుముతో ఉప్పు వేసి గట్టిగా నీరు పిండి, ఆ నీటిని పక్కనుంచుకొండి.
  2. క్యాబేజీ పిప్పిలో ముందు మసాలాలు కారాలు వేసి బాగా కలుపుకోండి.
  3. మసాలాలు బాగా కలిపినా తరువాత, గోధుమపిండి, క్యాబేజీని, పిండిన నీరు వేసి ముందు కలుపుకోండి, ఆ తరువాత తగినన్ని నీరు చిలకరించుకుని పిండిని నాలుగైదు నిమిషాలు బాగా వోత్తుకోవాలి.
  4. వోత్తుకున్న పిండి ఆరిపోకుండా, నూనె పూసి అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి.
  5. ముప్పై నిమిషాలు పిండి నానిన తరువాత సమానంగా ఉండలు చేసుకుని పొడి పిండి చల్లి వోత్తుకోవాలి.
  6. మీకు నచ్చితే ప్రతీ మడతలో, 4-5 బొట్లు నూనె వేసి వత్తుకోవచ్చు లేదా రోటీ మాదిరి మడత వేయకుండా వత్తుకోవచ్చు.
  7. వత్తుకున్న పరాటాని వేడి వేడి పెనం మీద హై ఫ్లేమ్ మీద రెండు వైపులా కాలనిచ్చి తరువాత నూనె వేసి కాల్చుకుని తీసుకోండి.
  8. ఈ పరాటాలు వేడి మీద చల్లగా ఎలా అయినా చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.