కేరట్ మెంతికూర పచ్చడి
వేడిగా అన్నం, చపాతీ దోశా ఇడ్లీతో రుచిగా ఉంటుంది క్యారెట్ మెంతికూర పచ్చడి. భోజనంలో ఏది ఉన్నా లేకున్నా పచ్చడితో నాలుగు ముద్దలు తిన్నా అదో తృప్తి!
క్యారెట్ పచ్చడి కాస్త తియ్యగా కారంగా చాలా బాగుంటుంటుంది. మములుగానే రుచిగా ఉండే క్యారెట్ పచ్చడికి మెంతి కూర చేర్చి చేసే పచ్చడి చిరు చేదుగా ఇంకా బాగుంటుంది. కావలసినవి తగరిగి ఉంచుకుంటే 15 నిమిషాల్లో పచ్చడి తయార్!
ఈ పచ్చడి నేను తిరుపతి వెళుతున్నప్పుడు ఒంగోల్లో మా బందువుల ఇంటికి వెళ్ళినప్పుడు రుచి చూసా, కాకపోతే వారు ఇదే పచ్చడిలో ఒక టొమాటో, ఉల్లిపాయ కూడా వేశారు, నేను వేయలేదు.

టిప్స్
-
తాలింపు ఎర్రగా మాంచి సువాసన వచ్చేదాకా వేపితే పచ్చడికి రుచి సువాసన. తాలింపు ముందు కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి
-
నేను పెద్ద ఆకుల మెంతికూర వాడాను. ఇది చేదు తక్కువగా ఉంటుంది.
-
నచ్చితే రెండు రెబ్బల చింతపండు కూడా వేసుకోవచ్చు. బెల్లం వేయకపోయినా పర్లేదు.
-
మెంతికూర పసరు వాసన పోయేదాకా వేపాలి అప్పుడే రుచి. కేరేట్ తురుము పచ్చి వాసన పోయే దాకా వేపితే చాలు.
-
వెల్లులి తినని వారు వదిలేవచ్చు.
కేరట్ మెంతికూర పచ్చడి - రెసిపీ వీడియో
Carrot Fenugreek Leaves Chutney | Carrot Methi Chutney | Carrot Chutney | Carrot Pachadi | How to Make Carrot Chutney
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
తాలింపు
- 2 tbsp నూనె
- 1 tsp జీలకర్ర
- 10 వెల్లులి
- 1 tbsp పచ్చి శెనగపప్పు
- 1 tbsp మినపప్పు
- 1 tsp ఆవాలు
- 3 ఎండుమిర్చి
-
పచ్చడి కోసం
- 250 gms క్యారెట్ తురుము
- 3 పచ్చిమిర్చి
- 2 మెంతి కూర ఆకులు – చిన్నవి రెండు కట్టలు
- 2 tsp నూనె
- ఉప్పు
- 1 tsp బెల్లం
విధానం
-
నూనె వేడి చేసి తాలింపు సామాను అంతా వేసి ఎర్రగా వేపుకోవాలి.
-
వేగిన తాళింపుని తీసి బరకగా రుబ్బుకోవాలి.
-
మిగిలిన నూనెలో క్యారెట్ తురుము పచ్చిమిర్చి వేసి వేపుకుని తీసుకోండి.
-
ఇంకొంచెం నూనె వేసి మెంతి కూరని బాగా వేపుకుని తీసుకోండి.
-
మిక్సీలో వేపుకున్న క్యారెట్ తురుము, వేపిన మెంతి కూర, గ్రైండ్ చేసుకున్న తాలింపు, ఉప్పు, బెల్లం వేసి బరకగా రుబ్బుకుని తీసుకోండి (నచ్చితే కొద్దిగా చింతపండు వేసుకోండి).

Leave a comment ×