కాజు పకోడీ | జీడిపప్పు పకోడీ చాలా మాంచి టైం-పాస్ స్నాక్

Snacks
5.0 AVERAGE
2 Comments

స్వీట్ షాప్ తీరులో జీడిపప్పు పకోడీ రెసిపీ స్పెషల్ టిప్స్తో . 100% పక్కా రెసిపీ నా స్టైల్ జీడిపప్పు పకోడీ. జీడిపప్పు పకోడీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

“కాజు పకోడీ” చాలా మాంచి టైం-పాస్ స్నాక్! ఇదంటే అందరికి ఇష్టమే, కాని ఇంట్లో చేస్తే స్వీట్ షాప్స్ అంత పర్ఫెక్ట్ గా రానే రాదు. అలా రాకపోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోవడమే కారణం ! ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయ్ నా టిప్స్ కొలతల్లో చేస్తే! ఇవి కనీసం 10 రోజులు నిలవుంటాయ్ కూడా!

టిప్స్

జీడిపప్పు: జీడిపప్పు గుండ్ల కంటే బద్దలు పర్ఫెక్ట్ ఈ పకోడీకి. పప్పు 2 గంటలు నానితే చాలు మరీ ఎక్కువగా నానబెట్టకండి.

అల్లం వెల్లులి ముద్ద: ఇది పూర్తిగా ఆప్షనల్, నకచకుంటే వదిలేవచ్చు.

డాల్డా: పిండిలో డాల్డా వేస్తే కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి, ఇష్టం లేకపోతే మరుగుతున్న నెయ్యి, లేదా నూనె వేసుకుని కలుపుకోండి.

వేపే టిప్స్: పకోడీ వేసేప్పుడు నూనె వేడిగా ఉండాలి, అప్పడు మంట లో - ఫ్లేమ్లోకి పెట్టి పకోడీ అంతా వేసి తరువాత మీడియం – ఫ్లేమ్ మీద మాత్రమే ఎర్రగా వేపుకోవాలి. జీడిపప్పు పకోడీ ఎర్రగా వేగడానికి కొంచెం టైమ్ పడుతుంది. కాబట్టి ఓపికగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి.

కాజు పకోడీ | జీడిపప్పు పకోడీ చాలా మాంచి టైం-పాస్ స్నాక్ - రెసిపీ వీడియో

Cashew Pakodi | Kaju Pakoda | Perfect Kaju Pakodi with Tips | How to make Kaju Pakodi

Snacks | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 2 hrs
  • Cook Time 18 mins
  • Total Time 2 hrs 23 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 100 gms జీడిపప్పు బద్దలు
  • 150 gms సెనగపిండి
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1 tsp కారం
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp అల్లం వెల్లూలి పేస్టు
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1 tsp ధనియాలు (నలిపినవి)
  • 4 Spoons నీళ్ళు
  • 1 tbsp డాల్డా/నెయ్యి/నూనె
  • నూనె వేపకానికి సరిపడా

విధానం

  1. జీడిపప్పు బద్దలని నీళ్ళు పోసి 2 గంటలు నాననివ్వండి
  2. 2 గంటల తరువాత పప్పుని వడకట్టి అందులో సెనగపిండి ఇంకా మిగిలిన సామానంతా వేసి బాగా పొడి పొడిగా కలుపుకోండి.
  3. ఇప్పుడు చాలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి.
  4. బాగా మరిగిన నూనెలో పకోడీని పొడి పొడిగా వేసుకుంటూ మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకోండి
  5. ఇవి సరిగా లోపలిదాకా ఎర్రగా వేగడానికి కనీసం 12- 15 నిమిషాల టైం పడుతుంది
  6. సెనగపిండి ఎర్రగా రంగు మారేదాకా వేపుకుని తీసుకోండి. పూర్తిగా చల్లారాక మాత్రమే డబ్బాలో పెట్టుకుంటే కనీసం 10 రోజులు నిలవుంటాయ్.
  7. ఇవి వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయ్, చల్లారక క్రిస్పీ గా ఉంటాయ్

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • B
    Bindu
    Recipe Rating:
    Super recipe
  • P
    Padmapadmapv
    Recipe Rating:
    ధన్యవాదాలు vismai!.చాలా సార్లు ప్రయత్నించిన, e,వంటకం సర్రిగా రాలేదు. ఈ టిప్స్ తో,try చేస్తున్నా, ఇప్పుడు.. thankyou