కేటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ | క్యాబేజీ పకోడి రెసిపీ | క్యాబేజీ పకోడీ

కేటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ- క్యాబేజీ తరుగుతో ఉప్పు, పసుపు వేసి నీరు పిండి అస్సలు నీరు వేయకుండా శెనగపిండి కారం ఇతర మసాలాలు వేసి కలిపి నూనెలో ఎర్రగా వేపి తీసే కేటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ పప్పు అన్నం చారన్నంతో నంజుడుకీ గొప్ప జోడీ. 

కరకరలాడుతూ తిన్నకొద్దీ ఇంకా తినాలనిపించే క్యాబేజీ పకోడీ ఏమంత ప్రత్యేకమైన వంటకమేమి కాదు అన్నీ పకోడీలు చేసినట్లే శనగపిండి, బియ్యం పిండి కలిపి చేయడమే!!! కానీ ఈ క్యాబేజీ పకోడీ మామూలు పకోడీలు వేపినట్లు వేపితే అంత రుచి రాదు మెత్తగా ఉంటాయి అవి అంత గొప్ప పకోడీ కాదంటారు తెలుగు వారు. 

చక్కని ఎర్రని కరకరలాడే క్యాబేజీ పకోడీకి పిండి కలిపే తీరు వేపే తీరు అన్నింటి దగ్గర కొన్ని చిట్టి చిట్కాలు గొప్ప రెసిపీకీ తోడ్పడతాయి. అవేంటో చాలా వివరంగా కింద టిప్స్లో ఉంచాను చూడండి. 

టిప్స్

క్యాబేజీ:

  1. క్యాబేజీ మధ్యలో గట్టిగా ఒక దుంపలా ఉంటుంది దాన్ని తీసేయండి. ఆ దుంప వేస్తే పకోడీలో మిగతా అంతా వేగినా ఆ దుంప ముక్కలు కారకరలాడేట్టు వేగవు. మీకు నచ్చితే వేసుకోండి. నిజానికి కర్రీ పాయింట్స్ వారు కేటర్ర్స్ అందరూ దుంపని కూడా తరిగి వేసేస్తారు.

  2. క్యాబేజీ మరీ పెద్దగా కాకుండా సన్నని తరుగు ఉండేటట్టు చూసుకోండి. కాస్త పెద్దగా తరుక్కుంటే ఆకు కరకరలాడేట్టు వేగడానికి చాలా సమయం పడుతుంది.

ఇలా వేపితే పకోడీ కరకరలాడేట్టు వస్తుంది:

  1. పకోడీ పిండిలో నీరు వేయకుండా గట్టిగా అంటే తడిపొడిగా ఉండేట్టు పిండిని కలుపుకుని పకోడీ వేసుకుంటే చాలా కరకరలాడేట్టు వస్తాయి.

  2. పిండి ఎప్పుడూ తడిపొడిగా ఉండాలి. పిండి అంతా నీటితో తడిచి జారుగా ఉండకూడదు. అలా జారుగా ఉన్న పిండితో వేసే పకోడీలు మెత్తగా వస్తాయి.

కేటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ | క్యాబేజీ పకోడి రెసిపీ | క్యాబేజీ పకోడీ - రెసిపీ వీడియో

Catering Style Cabbage Pakodi | Cabbage Pakodi | Cabbage Pakoda Recipe

Street Food | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 350 gms క్యాబేజీ
  • 2 పచ్చిమిర్చి
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • ¼ tsp పసుపు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • ½ tsp జీలకర్ర పొడి
  • 1 cup శెనగపిండి
  • 2 tbsp బియ్యం పిండి
  • 2 sprigs కరివేపాకు (2 రెమ్మలు)
  • నూనె (వేపుకోడానికి)

విధానం

  1. క్యాబేజీ మధ్యన ఉన్న దుంపని తీసేయండి. తరువాత సన్నగా తరుక్కుని పక్కనుంచుకోండి.
  2. తరుక్కున్న కేబేజీలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 30 నిమిషాలు వదిలేస్తే క్యాబేజీ లోంచి నీరు దిగుతుంది.
  3. నీరు వదిలిన క్యాబేజీ ని గట్టిగా పిండి నీరంతా తీసేయండి.
  4. నీరు పిండిన క్యాబేజీ లో ముందుగా మసాలా పొడులు, ఉప్పు ,అల్లం వెల్లులి ముద్దా వేసి కలుపుకుంటే కాస్త నీరు వస్తుంది.
  5. కొద్దిగా నీరు వదిలిన క్యాబేజీలో శెనగపిండి, బియ్యం పిండి, కరివేపాకు వేసి గట్టిగా పిండుతూ కలుపుకోకుండా పిండిని ఒక దగ్గరికి చేర్చుతున్నట్లుగా తడిపొడిగా కలుపుకోవాలి.
  6. తడిపొడిగా పిండి కలుపుకున్న తరువాత మరిగే వేడి నూనె లో పిండిని చిన్న గోలీ సైజు ఉండలుగా వేసుకోండి.
  7. పకోడీ నూనెలో వేశాక ఒక నిమిషం వదిలేయండి, అప్పుడు పకోడీ గట్టిపడుతుంది, ఆ తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకుంటే కరకరలాడుతూ ఉండే పకోడీ వస్తుంది.
  8. వేపుకున్న పకోడీని జల్లెడలో వేసి జాలి కాస్త చల్లారనిస్తే గట్టిపడి కరకరలాడుతూ వస్తాయి పకోడీలు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • F
    Frances Martin 12
    Recipe Rating:
    彡[𝐇𝐨𝐰 𝐓𝐨 𝐌𝐚𝐤𝐞 𝐄𝐱𝐭𝐫𝐚 𝐈𝐧𝐜𝐨𝐦𝐞 𝐅𝐫𝐨𝐦 𝐇𝐨𝐦𝐞]彡★ Im making over $25k a month working part time. i kept hearing other people tell me how much money they can make online so i decided to look into it. well, it was all true and has totally changed my life. this is what i do.