కేటరింగ్ స్టైల్ కొత్తిమీర రైస్

చేయడానికి ఎంతో తేలికగా తినడానికి మరింత ఇష్టంగా ఉండే రెసిపీ ఘుమఘుమలాడే కొత్తిమీర రైస్. ఈ సింపుల్ సౌత్ ఇండియన్ కేటరింగ్ స్టైల్ కొత్తిమీర రైస్ వీకెండ్స్కి స్పెషల్ డేస్కి లేదా మాంచి స్పైసీ కర్రీతో జోడీగా భలేగా ఉంటుంది.

సాధారణంగా వెరైటీ రైస్ అంటే దాదాపుగా చిన్న చిన్న మార్పులతో ఒకేలా ఉంటాయి. ఈ కొత్తిమీర రైస్లో వేసే పదార్ధాలు కూడా దాదాపుగా అంతే!! కానీ.. చేసే తీరు కాస్త భిన్నం. ఈ రైస్లో ఫ్లేవర్స్ అన్నీ తెలిసేలా ఉంటుంది, మసాలాలా ఘాటు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చల్లని రైతాతో లేదా ఘాటైన కర్రీతో ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

ఈ సింపుల్ కొత్తిమీర రైస్ చేసే ముందు జస్ట్ ఒక్క సారి టిప్స్ చూసి చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది.

Catering Style Green Coriander Rice

టిప్స్

రైస్:

  1. నేను బాస్మతి బియ్యంతో చేశాను మీరు మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. కానీ మామూలు బియ్యం అయితే ½ కప్పు నీళ్ళు ఎక్కువ పోసుకోండి

  2. నేను కొత్తిమీరా రైస్ విడిగా చేశాను మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అప్పుడు బాస్మతి రైస్కి కప్పుకి 1.1/2 కప్పుల నీళ్ళు మామూలు బియ్యనికి కప్పుకి 2 కప్పుల నీళ్ళు ఉండాలి.

మసాలాలు:

  1. ఈ రైస్లో మసాలా దినుసులు కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే కమ్మని కొత్తిమీర సువాసనని డామినేట్ చేస్తాయ్ మసాలాలు

కారం:

  1. ఈ రైస్లో కారం అంతా పచ్చిమిర్చి నుండే రావాలి. కాబట్టి ఎండు కారం వేయకండి

కేటరింగ్ స్టైల్ కొత్తిమీర రైస్ - రెసిపీ వీడియో

Catering Style Coriander Rice | Kothimeera Rice Recipe How to Make Green Coriander Rice

Flavored Rice | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 25 mins
  • Total Time 27 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కొత్తిమీర పేస్ట్ కోసం
  • 150 gms కొత్తిమీర
  • 75 gm పుదీనా
  • అల్లం – ఇంచ్ ముక్కలు
  • 10 - 12 వెల్లులి
  • 1 ఉల్లిపాయ
  • పసుపు – కొద్దిగా
  • నీళ్ళు
  • రైస్ కోసం
  • 2 cups బాస్మతి బియ్యం
  • 50 ml నూనె
  • 1 tbsp నెయ్యి
  • 10 -15 జీడిపప్పు
  • 2 బిర్యానీ ఆకు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 4 - 5 లవంగాలు
  • 1 tbsp నిమ్మరసం

విధానం

  1. కొత్తిమీర పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. కొత్తిమీర పేస్ట్ ని ఒక బట్టలో వేసి రసాన్ని అంతా పిండేయండి. పిప్పిని పడేయండి.
  3. బాస్మతి బియ్యంలో కొత్తిమీర రసం పిండిన నీరు 4 కప్పులు ఉప్పు వేసి గంట సేపు నానబెట్టుకోండి (మామూలు బియ్యంతో వందలిస్తే టిప్స్ చూడండి).
  4. గిన్నెలో నెయ్యి నూనె వేసి వేడి చేసి జీడిపప్పు వేసి నురగ వచ్చేదాకా వేపుకోండి.
  5. జీడిపప్పు వేగిన తరువాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేపుకోవాలి.
  6. ఆ తరువాత నానిన బియ్యం కొత్తిమీర నీళ్ళతో సహా వేసి నెమ్మదిగా కలిపి హై ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి.
  7. అన్నం ఊదుకుపట్టిన తరువాత బియ్యం మీద పగుళ్ళవస్తాయ్ అప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి మూతపెట్టి కొద్దిగా నీరు మిగిలేదాక వండుకోవాలి.
  8. 80% పైన ఉడికిన తరువాత నిమ్మరసం వేసి కలిపి సిమ్లో మరో 7-8 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేస్తే ఘుమఘుమలాడే కొత్తిమీర రైస్ రెడీ!
  9. ఈ రైస్ చల్లని రైతా లేదా స్పైసీ కర్రీతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • N
    Nuvvula Anjali
    Amma kalayana madapam
  • N
    Nagamani
    Recipe Rating:
    First of all Thank you so muchSir mi recipes chala bagunnay . Really love it. And miru cheppina kolathalatho perfect ga unnay. Nice inka chala recipes kavali maku. Ma husband kuda miku thanks cheppali annaru.
  • S
    Sarvanibhagavatula
    Recipe Rating:
    It's very nice
Catering Style Green Coriander Rice