మెత్తగా ఉడికించిన అన్నంలో వెచ్చటి పాలు పోసి కొద్దిగా అమజ్జిగ చుక్కలు వేసి రాత్రంతా తోడుపెట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తినడం దక్షిణాది వారికి ఇంకా ఒరియా వారికి అనాదిగా వస్తున్న ఒక అలవాటు.

కాలం మారుతున్న కొద్దీ శరీరానికి ఎంతో మేలు చేసే ఈ చల్ది అన్నం పోయి ఇడ్లీ అట్టు గారే ఉత్తరాది నుండి వచ్చిన పూరి చేరాయి. నిజానికి ఉషణం ఎక్కువాగా ఉండే దక్షిణాది వారికి ఎంతో మేలు చేసే ఆహారం.

చల్ల( మజ్జిగ) అన్నం (తినడానికి వీలుగా మెత్తగా ఉడికించిన ధాన్యం). ఈ చల్ల అన్నం కాలక్రమేణా చద్దన్నంగా మారింది. ప్రాంతాన్ని బట్టి దాదాపుగా ఒకప్పుడు అందరూ ఉదయాన్నే తినే ఆహారం.

నింజానికి ఈ రెసిపీ చాలా మందికి తెలిసినదే, కొత్తగా నేను చెప్పేదేమీ లేదు. కానీ కాలక్రమేణా పేరులో మార్పు ఎలా వచ్చిందో చల్ది అన్నం చేసే తీరులోనూ చాలా మార్పులొచ్చాయి. అందుకే నేను వెనుకటి తీరుని పరిచయం చేయాలని ఈ రెసిపీని పోస్టు చేస్తున్నాను.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుసేమియా కర్డ్ బాత్

కింద టిప్స్ చూస్తే మీకు పెరుగుకి మజ్జిగకి ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది.

టిప్స్

అన్నం:

  1. ఇక్కడ మీరు మిగిలిన అన్నంతో పాటు మిల్లెట్స్ బ్రౌన్ రైస్ ఇంకా ఏదైనా వాడుకోవచ్చు. కానీ మెత్తగా ఉడికి ఉంటె చాలు.

పెరుగు వేడి తినకూడదు| మజ్జిగ:

చలువ ఎందుకో తెలియాలంటే కింద విశ్లేషణ చదవండి.

  1. అన్నం మునిగేలా పాలు పోసి మజ్జిగ చుక్కలు వేస్తే గట్టిగా హల్వాలా అన్నం తోడుకుంటుంది. ఆ అన్నంలో పాటకి మేలు చేసే బాక్టీరియాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ అన్నం గట్టి పెరుగుగా తీసుకుంటే మేలు చేయకపోగా శరీరానికి వేడి పెంచుతుంది.

  2. గడ్డగా పేరుకున్న పేరుగులో సమయం గడుస్తున్నా కొద్దీ పులియబెట్టే బ్యాక్తీరియా ఉంటుంది. అది మనకి అంత త్వరగా అరగదు. అలా త్వరగా జీర్ణం కానీ పెరుగు పొట్టలోకి చేరి పొట్టలోని ఆమ్లాలతో కలిసి పిలుస్తుంది, దానితో శరీరానికి వేడి చేస్తుంది. చలువ చేస్తుంది అని తీసుకున్న పెరుగు చలువ చేయకపోగా వేడిని పెంచుతుంది.

  3. అదే పెరుగుని పలుచన చేసి తీసుకుంటే పొట్టలోకి చేరి త్వరగా జీర్ణమైపోతుంది, పెరుగులో ఉండే బాక్టీరియా విచ్చిన్నమై ఉంటుంది, ఆ మజ్జిగ పులిసేలోగా అరిగిపోతుంది కూడా.

ఉల్లిపాయ:

  1. సాధారణంగా తోడుపెట్టుకున్న పాలల్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తే మరునాటికి ఉల్లిలోని ఘాటు తగ్గి సులభంగా కొరుక్కు తినేలా ఉంటుంది. నచ్చని వారు వదిలేయండి.

పెరుగు పులుపెక్కాడానికి కారణాలు:

  1. మొదటిది పాలు వేడి మీద తోడుపెడితే పెరుగు పులుపెక్కుతుంది.

  2. రెండవది తోడు అవసరానికి మించి వేసినా పులుపెక్కుతుంది పెరుగు

  3. మూడవది తోడుకి పుల్లని పెరుగు వేసినా పులుపెక్కుతుంది పెరుగు

చల్ది అన్నం - రెసిపీ వీడియో

Chaddi annam | Fermented Rice | How to Make Chaddi Annam

Breakfast Recipes | vegetarian
  • Prep Time 30 mins
  • Cook Time 20 mins
  • Resting Time 8 hrs
  • Total Time 8 hrs 50 mins
  • Serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 1.5 Cup ఉడికించిన అన్నం
  • 1 Cup వేడి నీరు
  • 1 Cup వేడి పాలు
  • 2 tbsp మజ్జిగ
  • 1 ఉల్లిపాయ
  • 2 పచ్చిమిర్చి
  • ఉప్పు (రుచికి సరిపడా)

విధానం

  1. ఉడికించిన అన్నంలో నీరు పాలు పోసి గోరువెచ్చగా అయ్యేదాకా అన్నాన్ని కలిపి వదిలేయండి
  2. అన్నం వేడి తగ్గాక మజ్జిగ చుక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కలిపి మూతపెట్టి రాత్రంతా వదిలేయండి
  3. మరునాటికి అన్నం తోడుకుంటుంది, పొట్టకి మేలు చేసే మంచి బాక్టీరియా ఉతపన్నం అవుతుంది. అప్పుడు రుచికి సరిపడా ఉప్పు కలిపి ఆశ్వాదించండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • R
    Roja Akula
    It's tooo good for health and tummy TQ brother malli elanti paata kalam recipe ni వెలుగు లోకి tiskichinaduku
  • R
    Rohini Inguva
    Recipe Rating:
    You are such an amazing person Teja garu. High respect and admiration to you from my side. Thank you for sharing the treasure with us.....
  • P
    pavan
    mobile lo open chesinapudu items featured images ravatam ledu and cache issue undi and loading akkuva sepu avutundi so aa three things check chesi sari cheyandi mobile viewers ki looking good ga untunadi its my suggestion