చట్పటా పుచ్చకాయ స్లష్ | పుచ్చకాయ స్లష్ రెసిపీ
చట్పటా పుచ్చకాయ స్లష్ గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలని ఫ్రీజ్ చేసి అందులో చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి పుదీనా వేసి బ్లెండ్ చేసి కొంచెం జ్యూసీగా మరికొంత ఐసు ముక్కలుగా ఉంటూ పళ్ళకి జివ్వుమనిపిస్తూ గొప్ప కిక్కునిచ్చే పుచ్చకాయ స్లష్ గొప్ప సమ్మర్ డ్రింక్.
నిజానికి పుచ్చకాయ జ్యూస్కి పుచ్చకాయ స్లష్కి వ్యత్యాసం ఉందండి. పుచ్చకాయ స్లష్ గడ్డ కట్టించిన పుచ్చకాయ ముక్కలని క్రష్ చేసిన ఐసుముక్కలతో ఇంకొంత జ్యూస్ తో ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ కేవలం పంచదార వేసి పుచ్చకాయ ముక్కలని గ్రైండ్ చేసి వడకట్టి ఇచ్చేది. స్లష్ తాగితే వచ్చే కిక్కు జ్యూస్తో రాదు.

టిప్స్
పుచ్చకాయ:
-
బాగా తీపున్న పుచ్చ ముక్కలు తీసుకోండి. పుచ్ఛముక్కల నుండి గింజలు తీసేయండి.
-
ఒక వేళ పుచ్ఛముక్కలు తీపి తక్కువగా ఉంటె పంచదార పొడి లేదా తేనె మోతాదు కాస్త పెంచుకోండి.
చట్పటా పుచ్చకాయ స్లష్ | పుచ్చకాయ స్లష్ రెసిపీ - రెసిపీ వీడియో
Chatpata Desi Style Watermelon Slush | Watermelon Slush | Watermelon Recipe
Summer Recipes
|
vegetarian
Prep Time 10 mins
Resting Time 2 hrs
Total Time 2 hrs 10 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 4 cups గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు
- 6-7 ఐసు ముక్కలు
- ½ tsp చాట్ మసాలా
- ¼ tsp బ్లాక్ సాల్ట్
- ¼ tsp ఉప్పు
- 2-3 tbsp తేనె
- 1 tbsp నిమ్మరసం
- 20 పుదీనా ఆకులు
విధానం
-
ముందుగా బాగా పండిన పుచ్చకాయని ముక్కలుగా కోసి గింజలు తీసేయండి.
-
గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలని డీప్ ఫ్రీజర్లో 2 గంటలు ఉంచండి.
-
రెండు గంట తరువాత ఐసుముక్కలు ఫ్రీజ్ చేసుకున్న పుచ్చ్కాయ ముక్కలు చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, సాల్ట్, తేనె నిమ్మరసం పుదీనా ఆకులు బ్లెండర్లో వేయండి.
-
సెమీ స్మూత్ మరియు స్లషీ అయ్యే వరకు హై స్పీడ్ మీద బ్లెండ్ చేయండి.
-
రెఫ్రెషింగ్ స్లష్ ను వెంటనే సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి.

Leave a comment ×