చీస్ బ్రేడ్ ఆమ్లెట్
టోస్ట్ చేసిన బ్రేడ్ని ఆమ్లెట్ మీద పెట్టి మధ్యన చీస్ పెట్టి ఇచ్చే చీస్ బ్రేడ్ ఆమ్లెట్ క్విక్ అండ్ ఈసీ టిఫిన్ ఇంకా స్నాక్. వేడి వేడిగా చీస్ బ్రేడ్ ఆమ్లెట్ టమాటో సాస్తో ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది.
స్ట్రీట్ ఫుడ్గా ఎంతో ఫెమస్ అయిన చీస్ బ్రేడ్ ఆమ్లెట్ రెసిపీ కూడా దాదాపుగా బ్రేడ్ ఆమ్లెట్ తీరులోనే ఉంటుంది. ఆమ్లెట్ మధ్యన చీస్ పెట్టడం ఒక్కటే మార్పు. కానీ ఈ రెసిపీలో నేను పర్ఫెక్ట్ బ్రేడ్ ఆమ్లెట్ ఎలా చేయాలి, ఎగ్ని ఎంత సేపు కుక్ చేయాలి లాంటి మరెన్నో టిప్స్ చెప్పాను.
వివరంగా ఉన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి బెస్ట్ బ్రేడ్ ఆమ్లెట్ని ఎంజాయ్ చేయండి.

టిప్స్
ఎగ్స్:
ఎగ్స్ని బాగా బీట్ చేయాలి అప్పుడే ఆమ్లెట్ పొంగుతుంది
నూనె/బటర్/నెయ్యి:
ఆమ్లెట్ బాగా పొంగి రావాలంటే కచ్చితంగా నూనె ఉండాలి. అప్పుడే బాగా పొంగుతుంది. స్ట్రీట్ ఫుడ్ బ్రేడ్ ఆమ్లెట్ అంత రుచి రావడానికి ప్రధాన కారణం అదే!!!
ఆమ్లెట్ కాల్చే విధానం:
ఎగ్ చాలా త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఇంకా కాస్త అంటే 10% నీరుగా ఉండగానే ఆమ్లెట్ మడిచి 10-15 సెకన్లు ఉంచి తీసేస్తే చాలు. ఆమ్లెట్ పూర్తిగా కుక్ చేస్తే ఆమ్లెట్లోని తేమ కోల్పోయి అంత రుచిగా ఉండదు.
బ్రేడ్:
బ్రేడ్ ఆమ్లెట్కి సాండ్విచ్ బ్రేడ్ లేదా మిల్క్ బ్రేడ్ ఏదైనా వాడుకోవచ్చు.
బ్రేడ్న్ ముందు బటర్ వేడి రెండు వైపు కాస్త క్రిస్పీ అయ్యేదాకా టోస్ట్ చేసి తీసుకోవాలి. నేను బటర్ వేసి కాల్చాను. మీరు నెయ్యి నూనె వేసి కాల్చుకోవచ్చు, లేదా టోస్టర్లో పెట్టి టోస్ట్ చేసీ తీసుకోవచ్చు.
టోస్ట్ చేసిన బ్రేడ్ని ఆమ్లెట్ ఉడకక ముందే ఆమ్లెట్ మీద పెట్టి రెండు వైపులా ఎగ్ని అంటించాలి. అప్పుడు మడిచినప్పుడు ఎగ్ బ్రేడ్ని అంటుకుని ఉంటుంది. లేదా బ్రేడ్కి బ్రేడ్ ఆమ్లెట్కి ఆమ్లెట్ విడిపోతుంది.
వెజ్జీస్:
ఆమ్లెట్లో వేసే కూరకాయ ముక్కలు ఎంత సన్నంగా ఉంటె అంత బాగుంటుంది. అన్నీ ఒకే తీరుగా సన్నంగా ఉండేలా తరుక్కోవాలి.
చీస్ బ్రేడ్ ఆమ్లెట్ - రెసిపీ వీడియో
Cheese Bread Omelette | How to Make Cheese Bread Omelette
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 6 గుడ్లు
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 2 సన్నని పచ్చిమిర్చి తరుగు
- 1/4 cup సన్నని టమాటో తరుగు
- 1/4 cup సన్నని కాప్సికం తరుగు
- ఉప్పు
- పసుపు
- 1/2 tsp మిరియాల పొడి
- 1 tsp చిల్లి ఫ్లెక్స్
- 6 బ్రేడ్ స్లైసెస్
- 6 చీస్ స్లైసెస్
- బట్టర్ - బ్రేడ్ టోస్ట్ చేసుకోడానికి ఇంకా ఆమ్లెట్ కాల్చడానికి
విధానం
-
కొద్దిగా బటర్ వేసి బ్రేడ్ని రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి.
-
ఎగ్స్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసి బాగా నురగగా వచ్చేదాకా బీట్ చేయాలి.
-
తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా బీట్ చేసుకోవాలి.
-
నాన్ స్టిక్ పాన్ మీద బటర్ కరిగించి పెద్ద గరిటెడు ఎగ్ మిశ్రా మిశ్రమాన్ని పోసి పెనం అంతా స్ప్రెడ్ చేయాలి.
-
వెంటనే పైన 2 టచ్ చేసిన బ్రేడ్ ఉంచి ఎగ్ మిశ్రమాన్ని రెండు వైపులా అంటించాలి.
-
30 సెకన్లు ఆమ్లెట్ని కాలనిచ్చి బ్రేడ్ మీద చీస్ స్లైసెస్ పెట్టి ఆమ్లెట్ అంచులని బ్రేడ్ మీదికి వేయాలి, తరువాత బ్రేడ్ ని మధ్యకి అంటే ఒకదాని మీదికి మరొకటి వేసేయాలి.
-
మధ్యకి మదించిన బ్రేడ్ ని రెండు వైపులా 30 సెకన్లు మాత్రమే కాల్చి తీసుకోవాలి. వేడి మీదే మధ్యకి కట్ చేసుకోవాలి.
-
వేడిగా టమాటో సాస్తో చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment ×
4 comments