చెట్టినడు చికెన్ బిర్యానీ
స్పైసీ చికెన్ బిర్యానీ అది కూడా చాలా సులభంగా చేసెట్టు ఉంటే ఎవరు చేయకుండా ఉంటారు చెప్పండి. స్పైసీ చికెన్ బిర్యానీ అంటే చెట్టినడు చికెన్ బిర్యానీనే! వీకెండ్స్ లేదా పార్టీలప్పుడు పెద్ద హైరానా పడిపోకుండా సులభంగా చేసుకునే బిర్యానీ. ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది.
చికెన్ బిర్యానీలు దేశమంతటా ఉన్నా ప్రాంతాన్ని బట్టి రుచి మారిపోతుంది. చెట్టినాడు చికెన్ బిర్యానీ రెసిపీ మామూలు ధం బిర్యానీల కంటే కాస్త కారంగా ఘాటుగా ఇంకాస్త రుచిగా ఉంటుంది.
చెట్టినడు చికెన్ బిర్యానీ ఎంత సులభమంటే మసాలాలలో చికెన్ వేపి ఎసరు మరిగించి బియ్యం వేసి వండితే చాలు ఘుమఘుమలాడే చెట్టినాడు చికెన్ బిర్యానీ తయార్!

టిప్స్
బియ్యం:
-
నేను ఈ బిర్యానీకి బాస్మతి బియ్యం వాడాను, మీరు సంప్రదాయ చెట్టినాడు పద్దతిలో చేయాలంటే జీరా సాంబా బియ్యం వాడుకోండి. లేదా సోనా మసూరి అయినా పర్లేదు
-
జీరా సాంబా లేదా సోనా మసూరి అయితే కప్ కి 21/4 కప్పుల నీళ్ళు అవసరమవుతాయ్
-
బియ్యం కచ్చితంగా గంట సేపు నానాలి. ఇంకా ఎసరు బాగా మరిగాక మాత్రమే బియ్యం వేసుకోవాలి
చికెన్:
- చికెన్ మామూలు కర్రీ కట్ కాకుండా బిర్యానీ కట్ అయితే బిర్యానీ తయారయ్యాక మరీ చిన్నవిగా అయిపోవు
మసాలా పేస్ట్:
-
చెట్టినాడు చికెన్ బిర్యానీ రుచి అంతా మసాలా పేస్ట్లో ఉంది. మసాలా పేస్ట్ బాగా మెత్తగా గరియాండ్ చేసుకోవాలి
-
మసాలా పేస్ట్ నూనెలో నిదానంగా వేగాలి అప్పుడు మసాలా పేస్ట్ మాంచి ముదురు ఎర్రని రంగులోకి వచ్చి బిర్యానీకి రంగు రుచినిస్తుంది
-
ఈ బిర్యానీలో కారమంతా ఎండు మిరపకాయల నుండే వస్తుంది. ఒక వేళ మీకు ఎసరు రుచి చూసినప్పుడు కారం తక్కువగా అనిపిస్తే కొద్దిగా కారం వేసుకోవచ్చు
నూనె:
- బిర్యానీలకి నూనెలు ఉండాలి అప్పుడే రుచి లేదంటే చల్లారాక మరీ బిరుసెక్కినట్లుగా అవుతుంది, రుచిగా కూడా ఉండదు.
చెట్టినడు చికెన్ బిర్యానీ - రెసిపీ వీడియో
Chettinad Chicken Biryani | Chettinadu Chicken Dum Biryani | How to Make Chettinad Chicken Biryani
Prep Time 5 mins
Cook Time 30 mins
Baking Time 20 mins
Total Time 55 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
మసాలా పేస్ట్ కోసం
- 1 జాపత్రి
- 1 అనసాపువ్వు
- 1 నల్ల యాలక
- 1 బిరియానీ ఆకు
- 5 యాలకలు
- 5 లవంగాలు
- 1 tsp గసగసాలు
- 2 tbsp ధనియాలు
- 1 1/2 ఇంచులు దాల్చిన చెక్క
- 1 tsp జీలకర్ర
- 1 tsp సొంపు
- 12 - 15 ఎండు మిర్చి
- 100 gms సాంబార్ ఉల్లిపాయలు
- 1 1/4 tsp మిరియాలు
- 10 వెల్లులి
- 1 అల్లం- ఇంచు
- 1/4 tsp పసుపు
-
బిర్యానీ కోసం
- 3 cups బియ్యం ( గంట సేపు నానబెట్టినవి) (185 gms)
- 175 ml నూనె
- 2 మీడియం ఉల్లిపాయ చీలికలు
- 2 టొమాటో ముక్కలు
- చిన్న కట్ట పుదీనా
- చిన్న కట్ట కొత్తిమీర
- 750 gm బిర్యానీ కట్ చికెన్
- 3/4 cup చిలికిన పెరుగు
- 1 నిమ్మకాయ
- 5 cups నీళ్ళు
- ఉప్పు
- 4 పచ్చిమిర్చి చీలికలు
విధానం
-
చెట్టినాదు మసాలా కోసం ఉంచిన పదార్ధాలు అన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
-
అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
ఉల్లిపాయ బంగారు రంగులోకి వేగాక టొమాటో ముక్కలు, పుదీనా కొత్తిమీర వేసి టొమాటో ముక్కలు మగ్గి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
-
వేగిన మసాలాలో మసల పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద అడుగు పట్టకుండా నూనె పైకి తేలి ముదురు ఎరుపు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
మగ్గిన టొమాటోలో చికెన్ ముక్కలు చిలికిన పెరుగు లో మసాల పేస్ట్ వేసి కలిపి చికెన్లో పోసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ రసం పిండి చికెన్ల్కి మసాలాలు పట్టించి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికిస్తే 50% ఉడికిపోతుంది.
-
50% ఉడికిన చికెన్లో నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి. ఉడుకుతున్న ఎసరులో ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు గంటసేపు నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషఅలౌ ఉడికిస్తే 60% ఉడుకుతుంది.
-
60% ఉడికిన అన్నాన్ని నెమ్మదిగా మెతుకు విరగకుండా కలిపి మూతపెట్టి సన్నని సెగ మీద 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేస్తే చాలు. ఘుమఘుమలాడే స్పైసీ చెట్టినడు చికెన్ బిర్యానీ తయారు.
-
చెట్టినాడు చికెన్ బిర్యానీ ఉడికిన కోడి గుడ్డు, చల్లని రైతాతో ఎంతో రుచిగా ఉంటుంది.

Leave a comment ×
3 comments