కారంగా ఘాటుగా తెలిసితెలియనంత తీపితో ఉండే తమిళనాడు ఫేమస్ చికెన్ సుక్కా వీకెండ్స్కి బెస్ట్ చాయిస్ అవుతుంది. సుక్కా అంటే డ్రై అని అర్ధం. అంటే పొడి పొడిగా ఉండే చికెన్ వేపుడు లేదా పొడి వేసి చేసే చికెన్ వేపుడు. ఉల్లిపాయలోని నీరు చికెన్లో నీరుతో మగ్గి సుక్కా మసాలాతో వేగే చికెన్ సుక్కా కారంగా ఘాటుగా అన్నంతో కలుపుకుని తినేలా చాలా రుచిగా ఉంటుంది.

చికెన్ సుక్కా తమిళనాడు, కేరళా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు. కానీ రాష్ట్రానికి ఒక్కో తీరుగా చేస్తారు. తమిళనాడు కేరళా తీరు చాలా దగ్గరగా ఉంటుంది, కర్ణాటకలో మంగుళూరు తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. తమిళనాడులో రెస్టారెంట్స్లో ఎక్కువగా ఆర్డర్ చేసే రెసిపీస్లో చికెన్ సుక్కా కూడా ఒకటి.

ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నా రెసిపీ చేతికి ఇంటికి ఊరికి మారిపోతుంది. అలాగే ఈ చికెన్ సుక్కా కూడా. నేను కొన్ని నెలల క్రితం కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో తిన్న చికెన్ సుక్క చాలా నచ్చేసింది. ఫ్లేవర్స్ని ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసిన తీరు ఇంకా నచ్చేసింది. నాకు సర్వ్ చేసిన చెఫ్ని రెసిపీ అడిగితే ఇది అందరూ చేసే తీరేనండి కాకపోతే ఆఖరున వేసే కొద్దిగా బెల్లంలోనే ఉంది అసలైన రుచి అన్నారు. ఆయాన చేసిన అద్భుతమైన చికెన్ సుక్కా రెసిపీనే మీతో షేర్ చేస్తున్నా!

బెస్ట్ చికెన్ సుక్కా కోసం వివరంగా రాసిన టిప్స్ ఎంతో సాయపడతాయి!

Chicken Chukka recipe | Tamilnadu style chicken sukka

టిప్స్

చికెన్:

  1. మీడియం సైజ్ కట్ చికెన్ ఉండే ముక్క వేగిన తరువాత మరీ చిన్నదిగా ఎవ్వదు. చికెన్ని వేపడానికి ముందు కడిగి 2 tsp ఉప్పేసినా నీళ్లలో కనీసం అరగంట ఉంచితే ముక్కలు మృదువుగా అవుతాయి

  2. చికెన్ని నూనెలో వేసాక ముందు హాయ్ ఫ్లేమ్ మీద నీరు వదిలేదాకా వేపితే ముక్కలు మృదువుగా ఉంటాయి. సన్నని సెగ మీద వేపితే గట్టి పడతాయ్ ముక్కలు

సుక్కా మసాలా పొడి:

  1. సుక్కా మసాలా పొడి రుచంతా బ్యాడిగీ మిరపకాయలలో పరిమళంలో ఉంది. ఇవి సుక్కాకి మాంచి రంగు రుచి పరిమాలాన్నిస్తుంది. బ్యాడిగీ కాశ్మీరీ మిరపకాయాలు ఏవైనా వాడుకోవచ్చు. రెండూ దాదాపుగా ఒక్కటే అనిపిస్తాయి నాకు. కానీ తేడా ఉంది అంటారు కొందరు.

  2. తెలుగు వారికి కారం ఘాటు ఉండాలి అందుకే 2-3 గుంటూరు మిరపాకాయలు వాడాను. ఇవి మాంసానికి సరిపోను కారాన్నిస్తుంది. గుంటూరు మిరపకాయలకి బదులు మరింకేదైనా కారం మిరపకాయలు కూడా వాడుకోవచ్చు మీరు.

ఇంకొన్ని టిప్స్:

  1. చికెన్ సుక్కా ఇనుప మూకుళ్లలో చేస్తేనే అసలైన రుచి. ఇనుప మూకుళ్ళతో అడుగుపడుతుంది, దాన్ని గీరాలి మళ్ళీ కలపాలి. ఇలా అడుగుపడుతున్న మాసాలని గీరి వేపడం వల్ల సుక్కాకి మాంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నాన్స్టిక్ ఇదేదీ ఉండదు, ఇంకా ఇనుప మూకుళ్లలో వేగితే వచ్చే మాంచి రంగూ రాదు.

  2. మాంసం కూరలకి కాస్త నూనెలుంటేనే రుచి.

  3. మసాలా పొడి నెమ్మదిగా కలుపుతూ వేపితేనే పప్పులోపలి దాకా వేగి రుచిగా ఉంటుంది.

  4. ఈ రెసిపీలో నేను ముందు చెప్పినట్లు ఆఖరున వేసే కొద్దిగా బెల్లం ఎంతో రుచినిస్తుంది, ఫ్లేవర్స్ ని చక్కగా బాలన్స్ చేస్తుంది. మీకు నచ్చకపోతే బెల్లాన్ని వేయకండి.

చికెన్ సుక్కా - రెసిపీ వీడియో

Chicken Chukka recipe | Tamilnadu style chicken sukka | How to Make Chicken Chukka

Starters | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Total Time 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kilo చికెన్
  • 1/4 cup నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • కరివేపాకు - రెబ్బ
  • 2 మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు
  • పచ్చిమిర్చి చీలికలు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tsp నిమ్మరసం
  • కొత్తిమీర - కొద్దిగా
  • 1/4 cup పెరుగు
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1/4 tsp బెల్లం
  • సుక్కా మసాలా పొడి కోసం
  • 1 tbsp పచ్చి సెనగపప్పు
  • 2 tsp ధనియాలు
  • 1/2 tsp సోంపు
  • 5 బ్యాడిగీ మిరపకాయలు
  • 2 గుంటూరు/కారం ఎండు మిరపకాయలు
  • 1/4 cup పచ్చి కొబ్బరి

విధానం

  1. సుక్కా మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటిగా వేసుకుంటూ మాంచి సువాసన వచ్చేదాకా మాడకుండా లో - ఫ్లేమ్ మీద వేపి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోండి.
  2. నూనె వేసి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. చిట్లుతున్న నూనెలో ఉల్లి చీలికలు, కరివేపాకు పచ్చి మిర్చి చీలికలు ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడేదాకా వేపుకోవాలి.
  3. మెత్తబడిన ఉల్లిపాయల్లో ఉప్పేసిన నీళ్లలో నానబెట్టిన చికెన్ వేసి కలిపి హాయ్ ఫ్లేమ్ మీద నీరు వదిలేదాకా వేపుకోవాలి.
  4. చికెన్ 10 నిమిషాలకి నీరు వదిలేసి నూనె తేలడం మొదలవుతుంది. అప్పుడు అల్లం వెల్లులి పేస్ట్ నిమ్మరసం వేసి బాగా అల్లం వెల్లులి ముద్దని వేపుకోండి.
  5. వేగిన చికెన్లో పొడి చేసి ఉంచుకున్న సుక్కా మసాలా పొడి బాగా కలపండి, ఆ తరువాత పసుపు పెరుగు వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేదాకా మీడియాయ్మ్ ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  6. ప్రతీ 3 నిమిషాలకి ఒక సారి మూత తీసి అడ్డుపడుతున్న మసాలాని గీరి కలిపి మూత పెట్టి వేపుకోవాలి.
  7. సుమారుగా సుక్కా మసాలా పొడి వేసిన 16 నిమిషాలు మూత పెట్టి వేపిన తరువాత చికెన్లోంచి నూనె పైకి తేలుతుంది. అప్పుడు కొద్దిగా బెల్లం, మిరియాల పొడి కొత్తిమీర వేసి కలిపి మరో 5 నిమిషాలు మూత తీసి వేపితే ఘుమఘుమలాడే తమిళనాడు స్టైల్ సుక్కా మసాలా తయార్.
  8. సుక్కా మసాలా స్టారర్గా లేదా సాంబార్, రసం అన్నంతో నంజుకు తినడానికి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Chicken Chukka recipe | Tamilnadu style chicken sukka