ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి

ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే రెసిపీ ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

తెలుగు వారు పచ్చళ్ల ప్రియులు, కొన్ని వందల రకాల పచ్చళ్లు ఉన్నాయి. అందులో ఈ చికెన్ పచ్చడి ఒకటి. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చికెన్ పచ్చడి. ఏ కూర వండాలో తెలియనప్పుడు చికెన్ పచ్చడి ఒక ఆమ్లెట్, పెరుగు ఉంటే చాలు ఆ పూట భోజనాన్ని తృప్తిగా ముగించొచ్చు.

తెలుగు వారు చికెన్ పచ్చడి ఇంటికో తీరుగా పెడతారు, నేను నా పద్ధతితో పాటు ఇంకే పద్ధతిలో పెట్టుకోవచ్చో కూడా టిప్స్లో ఉంచాను చూడండి.

టిప్స్

చికెన్:

  1. ఈ పచ్చడికి బ్రాయిలర్ చికెన్ అయితేనే బాగుంటుంది, నాటు కోడి కంటే. నాటు కోడి వాడితే పచ్చడిలో కండ తక్కువ ఎముకలు ఎక్కువగా ఉన్నట్లుగా ఉంటుంది పచ్చడి.

  2. చికెన్లోని నీరు ఇగిరిపోయేదాక నాన్ స్టిక్ కాడాయి లేదా కుక్కర్లో అయితే రెండు విసిల్స్ హై-ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలోని నీరు ఇగిరిపోఏ దాకా ఉడికిస్తే చాలు. ఎక్కువగా ఉడికిస్తే ముక్క రుచి తగ్గుతుంది ఇంకా చిదురైపోతుంది వేగాక

  3. చికెన్ ముక్కలు మరీ ఎక్కువగా వేపితే గట్టిగా అవుతాయ్, అంత రుచిగా ఉండదు పచ్చడి.

  4. పచ్చడి పెట్టిన వెంటనే కూడా తినవచ్చు, కానీ నాలుగో రోజుకి ముక్క మెత్తబడుతుంది, ఉప్పు కారం నూనె ముక్క పీల్చి

ఉప్పు- కారం :

½ కిలో కి ఉప్పు కారం సమానం, నేను కారం పచ్చళ్ల కారం వాడాను, నచ్చితే మీరు మామూలు కారం వాడుకోవచ్చు, మామూలు కారం వాడితే ఇంకొంచెం కారం పట్టవచ్చు. పచ్చళ్ల కారం మాంచి రంగు కారంగా ఉంటుంది. ఇది రేడీమేడ్గా దొరుకుతుంది.

గరం మసాలా:

కొందరు పచ్చడి లో గరం మసాలా కొద్దిగా వేస్తారు, లేదా చెక్క లవంగాలు కొద్దిగా వేసి నూనెలో వేపుతారు. నేను ఈ రెండూ వాడలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు.

ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి - రెసిపీ వీడియో

Chicken Pickle | Murgh ka Achaar | Chicken Avakaya – Kodi Pachadi | Chicken Pachadi Andhra Style

Pickles & Chutneys | nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Resting Time 3 hrs
  • Total Time 3 hrs 30 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1 kilo బ్రాయిలర్ చికెన్
  • 400 ml నూనె
  • 5 tbsp అల్లం వెల్లులి పేస్ట్ (60 gm)
  • 50 gm ఉప్పు
  • 50 gm పచ్చళ్ల కారం
  • 1 tsp మెంతి పొడి
  • 3 tbsp నిమ్మరసం
  • 1 tsp పసుపు

విధానం

  1. నాన్స్టిక్ పాన్లో చికెన్లో ఉప్పు పసుపు వేసి నీరు ఇగిరిపోయే దాకా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి
  2. నూనె వేడి చేసి అందులో ఉడికించుకున్న చికెన్ వేసి చికెన్ లోని నీరు ఇగిరిపోయి ఎర్రగా అయ్యేదాక వేపుకుని తీసుకోవాలి (టిప్స్ చూడండి).
  3. తరువాత వేపగా మిగిలిన నూనెలో అల్లం వెల్లులి ముద్ద వేసి పచ్చి వాసన పోయేదాక వేపుకోవాలి
  4. తరువాత అల్లం వెల్లులి ముద్దలో వేపుకున్న చికెన్ మెంతి పొడి, ఉప్పు కారం వేసి కారం ఒక పొంగు వచ్చేదాకా వేపి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లరనివ్వాలి (నచ్చితే కారం తో పాటు 1 tsp గరం మసాలా వేసుకోవచ్చు).
  5. 3-4 గంటలకి పచ్చడి పూర్తిగా చల్లారి నూనె పైకి తేలుతుంది అప్పుడు నిమ్మరసం కలిపి సీసాలోకి తీసుకోవాలి. పచ్చడి 3 రోజులు ఊరనిస్తే ముక్క మెత్తబడి ఉప్పు కారం పులుపు ముక్కకి పడుతుంది.
  6. పచ్చడి పెట్టిన వెంటనే కూడా తొనవచ్చు కానీ ముక్క గట్టిగా ఉండి ఉప్పు కారం ముక్కకి పట్టదు. ఈ పచ్చడి ఫ్రిజ్లో అయితే 3 నెలలు, బయట అయితే 2 నెలలు ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

  • J
    Jhansi
    Hi
  • M
    Meganjoli hajong
    Tasty recipe so yum*
  • R
    Rachamallu Akhila
    Recipe Rating:
    Very tasty
  • B
    buy chicken pickle online
    I must say, this is a nice blog. I really appreciate your blog. I learned something helpful from your blog. you wrote blog on chicken pickle its helpful to me. chicken pickle achar chicken avakaya pickle
  • M
    Manjula
    Nicely given recipie with grams in measurement. Instead of cup if the recipie given in grams and ml the recipe will be more perfect.
  • S
    Surendra
    Mee channel ki nenu pedha fan anna naaku cooking ante chala istam meeru nerpistha ante meeru ekkada unte akkadiki vachi nerchukunta plzzzzzzzz naaku edhina chance unte cheppandi...!
Chicken Pickle | Murgh ka Achaar | Chicken Avakaya – Kodi Pachadi | Chicken Pachadi Andhra Style