ఉదయాన్నే ఎప్పుడూ తినే టిఫిన్స్ కాకుండా కొత్తగా సులభంగా అయిపోయే రుచికరమైన రెసిపీ చేద్దామనుకుంటే బెస్ట్ ఈ చాకోలెట్ ఓట్స్. ఇందులో వేసేవి నాలుగైదు పదార్ధాలే!!! ఓట్స్ పాలు నీళ్లు కోకో పొడి, తేనె నచ్చిన డై ఫ్రూట్స్ అంతే!!!

ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే సులభమైన రెసిపీ ఈ చాకోలెట్ ఓట్స్!!!

ఈ చాకోలెట్ ఓట్స్ డైట్ చేసే వారికి సరిపోయేలా తయారు చేశాను, కాబట్టి రోజూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంకా ఇదే రెసిపీ పిల్లలు తినేలా ఎలా చేసుకోవాలి. లేదా డెసర్ట్గా ఎలా మార్చుకోవచ్చో ఎన్నో మార్పులతో రెసిపీ వివారాలు టిప్స్లో ఉన్నాయ్ చుడండి.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుటమాటో మసాలా ఓట్స్

టిప్స్

కోకో పొడి:

  1. నేను ప్యూర్ కోకో పొడి వాడాను. దీని వాళ్ళ మాంచి రంగు రుచి వస్తుంది.

  2. మీరు మీకు నచ్చిన అందుబాటులో ఉన్న కోకో పొడి వాడుకోవచ్చు. ఇంకా నచ్చితే సెమి స్వీట్ చాకోలెట్ పొడి కూడా దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు డెసర్ట్లా తినాలనుకున్నప్పుడు.

పాలు:

  1. ఓట్స్ అచ్చంగా పాలల్లో ఉడికిస్తే చాలా త్వరగా గట్టిగా అయిపోతుంది. అందుకే నేను కొద్దిగా నీళ్లు పాలు కలిపి ఉడికించాను.

తీపి కోసం ఇలా చేసుకోండి:

  1. నేను తీపి కోసం ఆఖరున స్టవ్ ఆపేసి తేనె వేశాను. తేనె ఆయుర్వేదం పరంగా వేడి చేస్తే విషం అవుతుంది. అందుకే స్టవ్ ఆపేసి తేనె వేశాను. తేనె సరిపోకపోతే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. తీపి తగ్గితే ఓట్స్ చాకోలెట్ పొడి కారణంగా చేదుగా ఉంటాయి.

  2. మీరు హెల్తీ కాదు డెసర్ట్లా తినాలనుకుంటే పంచదార కొంచెం ఎక్కువగా వేసుకోండి. లేదా సెమి స్వీట్ చాకోలెట్ కరిగించి కూడా కలుపుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఆఖరున కొన్ని చాకోలెట్ చిప్స్ చల్లుకోవచ్చు.

  3. నేను తేనె మితంగా వేసి అరటిపండు పండు ఖర్జూరంతో తీపిని బాలన్స్ చేశాను. అందుకే తేనె తగ్గించాను. కోకో పొడి ఎక్కువ అయితే చేదుగా ఉంటాయి ఓట్స్, కాబట్టి తరువాత అయినా మీరు తేనెతో సరి చేసుకోవచ్చు.

కొబ్బరి పలుకులు:

  1. వేపిన యందు కొబ్బరి తురుము లేదా పలుకులు అక్కడక్కడా తగులుతూ ఓట్స్ చాలా రుచిగా ఉంటాయి. నచ్చితే మీరు తాజా కొబ్బరి తురుముని కూడా వేపి చల్లుకోవచ్చు.

ఇంకా కొన్ని విషయాలు:

  1. నేను బాదాం పలుకులు వేపి చల్లుకున్నాను. మీకు నచ్చితే నానబెట్టిన బాదాం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా నానబెట్టిన పుచ్చ గింజలు, నానబెట్టిన ప్రొద్దుతిరుగుడు గింజలు, వేపిన వాల్నట్ పలుకులు కూడా చల్లుకోవచ్చు.

పండ్లు:

  1. నేను అరటి పండు వేశాను, మీకు పులుపులేని ఎలాంటి పండు అయినా వేసుకోవచ్చు. అంటే ఆపిల్, కర్బూజ ఇలాంటివి.

చాకోలెట్ ఓట్స్ - రెసిపీ వీడియో

Chocolate oats | Healthy Chocolate Oats | How to make chocolate oats with tips

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 15 mins
  • Total Time 16 mins
  • Serves 2

కావాల్సిన పదార్ధాలు

  • 1 Cup ఓట్స
  • 400 ml పాలు
  • 1/2 Cup నీళ్లు
  • 3 tbsp కోకోపొడి
  • 2 tbsp తేనె
  • 1/2 tbsp వెనీలా
  • 1/4 Cup ఎండు కొబ్బరి తురుము
  • 2 tbsp బాదాం పలుకులు
  • 1 అరటిపండు ముక్కలు
  • 3 ఖర్జూరం

విధానం

  1. ఎండు కొబ్బరి తురుముని లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసుకోండి
  2. అదే మూకుడులో నీళ్లు పాలు పోసి పొంగనివ్వాలి.
  3. పొంగుతున్న పాలల్లోంచి కొన్ని పాలు తీసి కోకోపొడిలో వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి
  4. పొంగిన పాలల్లో ఓట్స్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన ఓట్స్లో కలిపి ఉంచుకున్న చాకోలెట్ మిక్స్ వేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి(మరీ చిక్కగా దగ్గరగా ఉడికించకండి)
  5. స్టవ్ ఆపేసిన తరువాత వెనీల ఎసెన్స్, ఉప్పు, తేనె వేసి కలుపుకోండి.
  6. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొబ్బరి పొడి అరటిపండు, బాదాం, ఖర్జూరం ముక్కలు పైన వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.