గోరు చిక్కుడుకాయ పులుసు | గోరు చిక్కుడుకాయ రెసిపీ

గోరు చిక్కుడుకాయ పులుసు- తాలింపులో ఉల్లి, పచ్చిమిర్చి వేసి మగ్గించి ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కలు, ఉప్పు, కారం, బెల్లం, చింతపండు పులుసు, నువ్వుల పొడి వేసి కలిపి దింపేసే సింపుల్ తెలుగు వారి గోరుచిక్కుడు పులుసు తక్కువ సమయంలో అవ్వడమే కాదు ఎంతో రుచిగా ఉంటుంది. 

సాధారణంగా భోజనానికి ఏదో రకంగా పులుసులు చేసుకుంటుంటాము అందులో భాగంగా చిన్న మార్పుతో  ఈ గోరుచిక్కుడు పులుసు చేసి చూడండి అన్నం చపాతీ దేనితోనైనా చాలా రుచిగా ఉంటుంది. 

టిప్స్

గోరుచిక్కుడు:

  1. ఈనెలు తీసేసిన గోరుచిక్కుడు లేతవి అయితే చాలా రుచిగా ఉంటుంది కమ్మగా.

  2. ముదురు గోరుచిక్కుడుకాయలు అయితే కుక్కర్లో 2 కూతలు వచ్చేదాకా ఉడికించి దింపేసుకోండి.

  3. గోరుచిక్కుడుని మరీ మెత్తగా ఉడికించకండి, పులుసులో చిదురైపోతుంది.

నువ్వుల పొడి:

  1. పులుసు కమ్మదనానికి నేను వేపిన నువ్వుల పొడి వేశాను, మీరు ఇక్కడ శనగపిండి లేదా బియ్యం పిండిని నీటిలో గడ్డలు లేకుండా కలుపుకుని కూడా వాడుకోవచ్చు. 

గోరు చిక్కుడుకాయ పులుసు | గోరు చిక్కుడుకాయ రెసిపీ - రెసిపీ వీడియో

Cluster Beans Curry | Goruchikkudu Kaya Pulusu | Cluster Beans Curry Recipe

Bachelors Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms గోరుచిక్కుడు కాయలు
  • 3 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • ⅛ tsp మెంతులు
  • 1 tsp మినపప్పు
  • 2 ఎండుమిర్చి
  • ½ cup ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి
  • 2 sprigs కరివేపాకు (2 రెబ్బలు)
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • ½ tbsp కారం
  • ½ cup చింతపండు పులుసు (నిమ్మకాయంత చింతపండు నుండి తీసినది)
  • 1 tbsp బెల్లం
  • కొత్తిమీర (కొద్దిగా)
  • 2 tbsp వేపిన నువ్వుల పొడి

విధానం

  1. లేత గోరుచిక్కుడుల ఈనెలు తీసేసి అంగుళం పైన పెద్ద ముక్కలుగా తరుక్కోండి. తరుక్కున గోరుచిక్కుడు ముక్కల్లో నీరు పోసి ఉప్పు వేసి 80% ఉడికించుకోండి. (ముదురు గోరుచిక్కుడుకాయలు వాడితే కుక్కర్లో 2 కూతలు వచ్చేదాకా ఉడికించుకోండి.)
  2. నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు వేసి మెంతులని రంగు మారనివ్వండి. రంగుమారిన మెంతుల్లో ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపుని గుభాళించేలా వేపుకోండి.
  3. వేగిన తాలింపులో ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపుకోండి.
  4. మెత్తబడిన ఉల్లిలో ఉప్పు, కారం, పసుపు వేసి వేపండి ఆ తరువాత గోరుచిక్కుడుని ఉడికించుకున్న నీటితో సహా వేసి కలిపి మిగిలిన 20% ఉడికిస్తే పూర్తిగా ఉడికిపోతాయ్ గోరుచిక్కుడులు.
  5. ఆఖరుగా చింతపండు పులుసు, బెల్లం, నువ్వులపొడి వేసి 2-3 నిమిషాలు ఉడికిస్తే పులుసు చిక్కబడుతుంది.
  6. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.