చేమగడ్డ వేపుడు | కరకరలాడే చేమగడ్డ వేపుడు
చారు పప్పుచారు సాంబార్ ఏది చేసినా నా స్టైల్ చేమగడ్డ వేపుడు నంజుడుగా ఉంటే తృప్తిగా భోజనం చేస్తారు. కరకరలాడే చేమగడ్డ వేపుడు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది.
చేమగడ్డ వేపుడు దుంపల వేపుడు అంత ఇష్టంగా తినరు చాలా మంది, కానీ ఈ పద్ధతితో చేస్తే ఎప్పుడూ ఇదే కావాలని చేయించుకుని తినేంత రుచిగా ఉంటుంది.
చేమదుంపల వేపుడు రెసిపీ అనగానే దుంపని కొద్దిగా ఉడికించి వేపి ఉప్పు కారం చల్లి చేస్తారు! కానీ ఈ స్టైల్ లో మరింతగా కరకరలాడుతూ కొంచెం కొత్తగా రుచిగా ఉంటుంది.
నా స్టైల్ చేమదుంప వేపుడు నెయ్యి అన్నంలో గాని పప్పుచారు మిరియాల చారు లో గాని తింటే రుచి చాలా బావుంటుంది.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరకరలాడే చేమదుంప వేపుడు చేయడం లో తిరుగుండదు.

టిప్స్
• దుంపలని ఎక్కువగా ఉడికిస్తే ముద్దగా అవుతుంది. కాబట్టి ఓ విసిల్ సరిపోతుంది.
• దుంపలు పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే నెమ్మదిగా బియ్యం పిండి పట్టించండి. వేడి మీద పిండి కలిపితే దుంపలు నీరు వదిలి పిండి చల్లితే ముద్ద అవుతుంది. పొడి పిండి రెండు సార్లు పట్టించడం వల్ల మరింత కరకరలాడుతూ వస్తాయి.
• ఆమ్చూర్ పొడి వేస్తే పుల్లపుల్లగా చాలా బావుంటై దొరక్కపోతే వదిలేయండి
• నూనె బాగా వేడెక్కకుండా దుంపలు వేస్తే నూనె బాగా పీల్చేస్తాయి, కాబట్టి నూనె బాగా వేడెక్కాక ఫ్లేం ని మీడియం లోకి పెట్టి ముక్కలు వేసి వేపుకోండి
• దింపే ముందు వేసే సాంబార్ కారం చాల మంచి రుచినిస్తుంది.
• దుంపలని వేపి తీసాక మూత పెట్టకుండా పైన ఓ పేపర్ నాప్కిన్ గాని లేదా క్లాత్ గాని కప్పి ఉంచితే గంటల తరువాత కూడా కరకరలాడుతూ ఉంటాయి.
చేమగడ్డ వేపుడు | కరకరలాడే చేమగడ్డ వేపుడు - రెసిపీ వీడియో
Colocasia Arvi Fry | Chemadumpa Vepudu | How to make Colocasia Fry
Prep Time 1 min
Cook Time 20 mins
Total Time 21 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 250 gms చేమదుంపలు
- 3 tbsp బియ్యం పిండి
- 1/4 spoon పసుపు
- 1 tsp కారం
- ఉప్పు
- 1/2 tsp ఆమ్చూర్ పొడి
- నూనె- వేయించడానికి సరిపడా
-
తాలింపుకి
- 2 tsp నూనె
- 3 దంచినవి వెల్లూలి
- కరివేపాకు- ఓ రెబ్బ
- 1/2 tsp ఆవాలు, జీలకర్ర, మినపప్పు
- 2 ఎండు మిర్చి
- 1 tsp సాంబార్ కారం/కూర కారం
విధానం
- చేమదుంపల్ని కడిగి కుక్కర్ లో పెట్టి హై ఫ్లేమ్ మీద ఒకే విసిల్ రానిచ్చి పొట్టు తీసి ఉంచుకోండి
-
ఉడికిన్చుకున్న దుంపల్ని అర అంగుళం ముక్కలు గా ( చక్రాల్లా) కట్ చేసుకోండి
-
వెడల్పాటి గిన్నె దుంప ముక్కల్ని వేసి సగం బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ఆంచూర్ పొడి వేసి చిదిరిపోకుండా నెమ్మదిగా పట్టించండి ముక్కలు
-
మిగిలిన బియ్యం పిండి, కొద్దిగా నూనె వేసి దుంపలకి మళ్ళీ పట్టించండి. దీని వల్ల మరింత కరకరలాడుతూ వస్తాయి
-
వేడి వేడి నూనె లో చేమగడ్డ ముక్కలు వేసి కదపకుండా 2 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత నెమ్మదిగా కదుపుతూ మీడియం ఫ్లేం మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి.
-
ఆ తరువాత హై ఫ్లేం మీద ఎర్రగా కరకరలాడేలా బంగారు రంగు వచ్చేదాకా వేపుకుంటే చాలు.
-
ఆఖరుగా తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు సామానంతా వేసి వేయించుకుని వేపుకున్న దుంపలు వేసి పైన సాంబార్ కారం వేసి బాగా పట్టించి దింపేసుకోండి.

Leave a comment ×
3 comments