ఆలూ ఫ్రై | బంగాళాదుంప వేపుడు | సింపుల్ ఆలూ ఫ్రై రెసిపి కొత్తగా నా స్టైల్లో చేయండి
కడుపునిండా అన్నం తిన్నా మళ్ళీ ఒక ముద్ద అయినా తినాలనిపించే రెసిపీ ఆలూ ఫ్రై. పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ సింపుల్ ఆలూ ఫ్రై రెసిపి కొత్తగా నా స్టైల్లో చేయండి చాలా నచ్చుతుంది. ఆలూ ఫ్రై రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
“బంగాళాదుంప వేపుడు” అంటే అందరికీ ఇష్టమే! అందులోనూ టొమాటో పప్పు, సాంబార్, రసంలోకి నంజుడుగా ఉంటే ప్రేత్యేకంగా చెప్పాలా దీని రుచి. క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ఆలూ ఫ్రై చేయడం చాలా సులభం. బంగాళాదుంప ముక్కలు నూనెలో వేపి ఉప్పు కారం వేసి కలిపి దింపేయడమే. కానీ ఈ రెసిపీలో నేను ఆ సింపుల్ పద్ధతికి కాస్త భిన్నంగా ఆలూ మెంతి కూర వేపుడు చేశాను. చిరు చేదుగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
బంగాళాదుంపలు:
-
ఆలూ ఎప్పుడూ తాజాగా ఉండేవి తోలు పల్చగా ఉండేవి వాడితే వేపుడు కరకరలాడుతూ వస్తుంది. చిప్స్ కి వాడే ఆలూ దొరికితే రెసిపీ చాలా బాగా వస్తుంది.
-
ఆలూని వేపే ముందు ఆలూ చెక్కు తీసి ముక్కలు చేసి నీళ్ళలో వేసి 30 నిమిషాలు వదిలేస్తే ఆలూలోని పిండి పోయి దుంపల వేపుడు కరకరలాడుతూ వస్తుంది
మెంతులు- మెంతి కూర:
-
వేపుడులో వేసిన ఆ కొద్ది మెంతులు ఎర్రగా వేగితే వేపుడుకి రుచి, లేదంటే చేదుగా తగులుతుంది. నచ్చనివారు మెంతులు వదిలేయవచ్చు.
-
చిరు చెదుని ఇష్టంగా తినేవారుంటే, చిన్న ఆకుల మెంతి కూర వేసుకోండి, లేదంటే పెద్ద ఆకుల మెంతి కూర వాడుకోండి.
ఆలూ ఫ్రై | బంగాళాదుంప వేపుడు | సింపుల్ ఆలూ ఫ్రై రెసిపి కొత్తగా నా స్టైల్లో చేయండి - రెసిపీ వీడియో
Crispy Potato Fry | Aloo Fry | The Best Aloo Methi Fry | Best Every Crispy Potato Fry Recipe | How to make Aloo Fry
Prep Time 5 mins
Cook Time 30 mins
Total Time 35 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/2 Kg బంగాళాదుంపలు
- 1/2 tsp మెంతులు
- 2 ఎండు మిర్చి
- 1/2 cup నూనె
- 1 cup మెంతికూర తరుగు
- 1 tbsp కారం
- ఉప్పు
- 1 tbsp ధనియాల పొడి
విధానం
-
నూనె వేడి చేసి 30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన ఆలూ గడ్డ ముక్కులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ముక్కలు ఎర్రబడ్డాక తీసుకోండి.
-
అదే నూనెలో మెంతులు ఎండుమిర్చి వేసి మెంతులు ఎర్రబడేదాకా వేపుకోవాలి.
-
మెంతికూర తరుగు వేసి 2 నిమిషాలు వేపితే పసరు వాసన పోయి మెత్తగా వేగుతుంది.
-
తరువాత ఆలూ గడ్డ ముక్కలు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
-
వేపుడు తయారయ్యాక గిన్నెలోకి తీసి జల్లెడతో కప్పి ఉంచుకుంటే క్రిస్పీగా వేగిన ఆలూ మెత్తబడదు.
-
ఈ వేపుడు వేడిగా నెయ్యి వేసుకుని తిన్నా సాంబార్, రసం, పెరుగన్నం తో నంజుడిగా కూడా చాలా బాగుంటుంది.

Leave a comment ×
4 comments