దోసావకాయ | దోస ఆవకాయ | ఈ పక్కా కొలతలతో చేయండి కంచాలు కంచాలు లాగించేస్తారు

అందుబాటులో పచ్చడి ఉంటే చాలు ఏ కూర లేకపోయినా తృప్తిగా భోజనాన్ని ముగించొచ్చు. అలాంటిదే ఆంధ్రా స్టైల్ దోసావకాయ. ఇన్స్టంట్ పచ్చడి దోసావకాయ పచ్చడి కనీసం 2 నెలలు నిలవ ఉంటుంది. ఈ సింపుల్ పచ్చడి స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.

దోసావకాయ తెలుగు వారి ప్రేత్యేకమైన ఊరగాయ. ఈ పచ్చడి ప్రేత్యేకించి పెళ్ళిళ్ళలో శుభకార్యాలలో అప్పటికప్పుడే అయిపోయే పచ్చడిగా చేస్తారు.

దోసావకాయ పచ్చడికి సీసన్తో పని లేదు ఎప్పుడూ దొరికే నాటు దోసకాయలుంటే చాలు. ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు.

ఈ పచ్చడి కనీసం 3 నెలలు నిలవుంటుంది. ఈ పచ్చడి పెట్టిన వెంటనే తినేవచ్చు, పెట్టిన వెంటనే తింటే ఒక రుచి, రెండోకి ముక్కలు ఊరి పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి వేడిగా నెయ్యి వేసిన అన్నంతో ఇంకా పెరుగన్నంతో నంజుడుగా చాలా బాగుంటుంది.

Cucumber Mustard Pickle | Andhra Style Spicy Pickle | Yellow Cucumber Pickle | Dosakaya Chutney |

టిప్స్

దోసకాయ:

  1. దోసకాయ అంటే పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దోసకాయలు మాత్రమే వాడాలి. కీర దోసకాయలు పనికిరావు

  2. దోసకాయకి చెక్కు తీయకండి, చెక్కు తీస్తే త్వరగా ముక్క మెత్తబడి పచ్చడి అంతా రుచిగా ఉండదు.

  3. పచ్చడి పెట్టడానికి ముందు కచ్చితంగా దోసకాయ చేదు చూసుకోవాలి.

  4. దోసావకాయకి నాటు కాయలు అయితే పుల్లగా ఉంటాయ్ రుచిగా ఉంటుంది పచ్చడి.

  5. ఒకవేళ కాయ పులుపు లేకపోతే ఆఖరున 2 tbsp నిమ్మరసం వేసుకోండి

నూనె: నువ్వుల నూనె, వేరుశెనగ నూనె రుచిగా ఉంటుంది. రెఫైండ్ నూనె కంటే.

మెంతులు : పచ్చడిలో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది. కానీ మెంతులు వేస్తే రెండు రోజులు పడుతుంది మెంతులు ఊరడానికి.

దోసావకాయ | దోస ఆవకాయ | ఈ పక్కా కొలతలతో చేయండి కంచాలు కంచాలు లాగించేస్తారు - రెసిపీ వీడియో

Cucumber Mustard Pickle | Andhra Style Spicy Pickle | Yellow Cucumber Pickle | Dosakaya Chutney |

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 5 mins
  • Resting Time 5 hrs
  • Total Time 5 hrs 15 mins
  • Servings 50

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms పుల్లని దోసకాయలు
  • 1/3 cup కారం (70 gm)
  • 1/4 cup ఉప్పు (¼ Cup + 1 tsp)
  • ఆవపిండి (1 Spoon less than 1/3 Cup)
  • 1/2 tsp పసుపు
  • 3/4 cup నూనె

విధానం

  1. ఆవాలలో పసుపు వేసి మెత్తని పొడి చేసుకోండి
  2. ఆవాల పొడి లో కారం ఉప్పు కలిపి పక్కనుంచుకోండి
  3. దోసకాయలని కడిగి తుడిచి, పూర్తిగా ఆరబెట్టి గింజలు తీసేసి, ½ అంగుళం ముక్కలుగా కోసుకోండి
  4. దోస ముక్కల్లో, కలిపి ఉంచుకున్న ఆవాలు, కారం కలిపి ఉంచుకున్న పొడి, నూనె వేసి బాగా కలుపుకోండి
  5. ఈ కలిపిన వెంటనే తినవచ్చు, కనీసంఐదు గంటలు ఊరితే దోసకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టి రుచిగా ఉంటుంది.
  6. ఈ పచ్చడి కనీసం 3 నెలలు నిలవుంటుంది

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • L
    Lakshman
    Recipe Rating:
    I am trying to make this dosaavakaya. But find it difficult to follow. You should give all measures in Metric. Cups and spoons are not standard across the world. Atleast provide equivalent metric measures. Cup in India is different from a cup in the USA.
Cucumber Mustard Pickle | Andhra Style Spicy Pickle | Yellow Cucumber Pickle | Dosakaya Chutney |